మస్జిద్-ఎ-అఖ్సా

వికీపీడియా నుండి

అల్ అఖ్సా మస్జిద్ లేదా మస్జిద్ ఎ అఖ్సా (ఆంగ్లం : Al-Aqsa Mosque) (అరబ్బీ :المسجد الاقصى, సాహిత్యపరంగా అర్థం "సుదూరపు మస్జిద్". ఈ మస్జిద్ జెరూసలేం నగరంలోని ఆలయాల సమూహంలో గలదు. ఈ ఆలయాల సమూహం యూదులకు పరమ పవిత్రంగా భావిస్తారు.[1][2] సార్వజనీయంగాను మరీ ముఖ్యంగా సున్నీ ముస్లింల విశ్వాసాల ప్రకారం, ఇస్లాంమతములో మూడవ పవిత్రక్షేత్రం. ఇస్రా మరియు మేరాజ్ కొరకు ముహమ్మద్ ప్రవక్త బయలు దేరినది ఈ మస్జిద్ నుండేనని ముస్లింల విశ్వాసం.[3] ముహమ్మద్ ప్రవక్త మదీనాకు హిజ్రత్ చేసిన 17 నెలలవరకూ ఈ అఖ్సా మస్జిద్ ఖిబ్లాగా వ్యవహరింపబడినది. ఆ తరువాత మక్కాలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడి స్థిరపడింది.[4]

ఈ అఖ్సా మసీదు, ఒక చిన్న ప్రార్థనాలయంగా, రాషిదూన్ ఖలీఫా అయిన ఉమర్ చే నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ దీనిని విస్తరించాడు. ఇతడి అల్లుడైన అల్-వలీద్ క్రీ.శ. 705 లో పూర్తిగావించాడు.[5]

విషయ సూచిక

[మార్చు] ప్రాముఖ్యత

ఇస్లాంలో మస్జిద్ ఎ అఖ్సా, ఒక ప్రాముఖ్యతగల మస్జిద్. [6]

[మార్చు] మొదటి ఖిబ్లా

మక్కా నగరంలోని కాబా గృహం ఖిబ్లా గా ప్రకటింపబడక ముందు, ఈ మస్జిద్ ఎ అఖ్సా మొదటి ఖిబ్లాగా వ్యవహరింపబడేది.[7]

[మార్చు] మూడవ పవిత్ర స్థలం

ప్రధాన వ్యాసం: ముస్లింల పవిత్ర స్థలాలు

మక్కా మరియు మదీనా ల తరువాత ముస్లింలకు మూడవ పవిత్ర క్షేత్రం. సున్నీ ముస్లింలు పవిత్రంగా భావించే విశ్వాసానికి మూలాలు ఖురాన్ మరియు హదీసులు.[8]

[మార్చు] ప్రస్తుత స్థితి

[మార్చు] నిర్వహణ

జోర్డాన్ కు చెందిన వక్ఫ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దీని నిర్వహణా కార్యక్రమాలు సాగుతాయి.[9]

ముహమ్మద్ అహ్మద్ హుసేన్ ఈ మస్జిద్ కు ప్రధాన ఇమామ్. ఇతడు గ్రాండ్ ముఫ్తీ కూడా.[10]

మస్జిదె అక్సా బయట ఒక ఫలక. ఇందుపై, హిబ్రూ మరియు ఆంగ్లంలో సూచన, ఇందులో యూదులకు ప్రవేశం లేదని సూచించే ప్రకటన.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
పేజీకి సంభందించిన లింకులు