మహబూబాబాద్

వికీపీడియా నుండి

మహబూబాబాద్, వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌ మండలానికి చెందిన గ్రామము మహబూబాబాద్ ను మానుకొట అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు కలవు. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది.

రవాణా సదుపాయాలు [మార్చు]

మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నవి. కాజీపేట్ - విజయవాడ రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో కలదు.

ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.

కొన్ని విషయాలు [మార్చు]

  • పిన్ కోడ్ : 506101
  • ఎస్టీడి కోడ్  : 08719

ఇవి కూడా చూడండి [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=మహబూబాబాద్&oldid=818142" నుండి వెలికితీశారు