మహాకవి క్షేత్రయ్య

వికీపీడియా నుండి
మహాకవి క్షేత్రయ్య (1976)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు,
సి.ఎస్.రావు
నిర్మాణం పి.ఆదినారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీ దేవి,
కాంచన,
మంజుల,
ప్రభ
సంగీతం పి.ఆదినారాయణరావు
నేపథ్య గానం వి.రామకృష్ణ,బాలసుబ్రహ్మణ్యం
నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ


మహాకవి క్షేత్రయ్య 1976లో విడుదలైన ఒక మంచి తెలుగు చిత్రం. క్షేత్రయ్య పేరు తో పిలవబడే వరదయ్య కృష్ణా తీరం లోని మువ్వ గ్రామ నివాసి. అతడు మువ్వగోపాల పదాలు అనేకం రచించాడు. భక్త తుకారాం నిర్మించిన అంజలీ పిక్చర్స్ వారు అదేకోవలో క్షేత్రయ్య కథను నిర్మించారు. ఆదినారాయణరావు సంగీత దర్శకత్వంలో రామకృష్ణ,బాలసుబ్రహ్మణ్యం(అష్ట నాయికలపై పాట), సుశీల పాడిన పాటలు శ్రోతల్ని అలరించాయి.

విషయ సూచిక

చిత్రకథ [మార్చు]

వరదయ్య మువ్వ గ్రామంలో ఆకతాయి గా ఉంటాడు. తన మరదలు (ప్రభ) ను ప్రేమిస్తాడు. ప్రభ వరదయ్య తో చనువుగా వుండటం చూసిన ఆమె తండ్రి ప్రభ బాలవితంతువు అని చెబుతాడు. బాధతో ఉన్న వరదయ్యను వివాహమాడతానని కూచిపూడి భాగవతుల కుటుంబంలోని భామ (మంజుల) అడుగుతుంది. తల్లి అనుమతి ఉంటే వివాహమాడతానని వరదయ్య చెప్పి తల్లి అడుగుతాడు. కుల బేధంతో తల్లి అందుకు అంగీకరించదు. తను ప్రేమించిన మరదలు, తనను ప్రేమించిన భామ దూరం కావటంతో వరదయ్య విరక్తుడౌతాడు. భామ సోదరుడు (రాజబాబు) భామ ఆత్మహత్య చేసుకుందని జనాన్ని నమ్మించి ఆమె ను వరదయ్య దగ్గర చేరుస్తాడు. మువ్వ గోపాలస్వామి కటాక్షం తో వరదయ్య మంచి కవి ఔతాడు. అతని గీతాలు విన్న గోలకొండ తానీషా అతన్ని తన దగ్గరకు ఆహ్వానిస్తాడు. అహ్వానాన్ని తిరస్కరించిన వరదయ్యను బలవంతంగా తనతో తీసుకుని పోతాడు తానిషా. భామ సహాయంతో అక్కడి నుండి వరదయ్య తప్పించుకుని తంజావూరు చేరతాడు. తంజావూరు రాజు , ఆయన రెందవ భార్య , కవయిత్రి రంగాజమ్మలు వరదయ్యను అభిమానిస్తారు. పొరుగురాజు (మదురై)తో, తంజావూరు రాజు కు ఉన్న వైష్మ్యాలు తొలగించే ప్రయత్నం చేస్తాడు వరదయ్య. ఇరురాజ్యాల మధ్య అనివార్యమైన యుద్ధ సమయంలో రంగాజమ్మ కోరిక మేరకు రాకుమారుడ్ని తీసుకుని వెళతాడు వరదయ్య. తానీషా సాయంతో రాకుమారుడ్ని తంజావూరు కు చేరుస్తాడు. రాజనర్తకి తారామతి (జయసుధ), ఆస్థానకవి (రావు గోపాలరావులు క్షేత్రయ్య పట్ల ద్వేషంతో తానీషాను రెచ్చగొట్టి ఒక పోటీ పెట్టిస్తారు. అందులో భాగంగా క్షేత్రయ్య వెయ్యి పదాలు రచించవలసి ఉంటుంది. మంత్రించబడిన ఫలాలు ఆరగించడంతో క్షేత్రయ్య తారామతి పట్ల మోహితుడౌతాడు. సిద్ధేంద్ర యోగి సహాయంతో మోహాన్మత్తత నుండి బయటపడి రచనసాగిస్తాడు.

ఇతర విశేషాలు [మార్చు]

  • ఈ సినిమా నిర్మాణం మధ్య లోనే ఆదుర్తి కన్నుమూసారు. తదుపరి సి.ఎస్.రావ్ దర్శకత్వం లో పూర్తయింది.

పేర్లు [మార్చు]

  • అంజలీ పిక్చర్స్ కంబైన్స్
  • నటులు: కళా శిఖామణి అంజలీ దేవి

మంజుల ప్రభ జయసుధ రాజబాబు కాంతారావు ప్రభాకరరెడ్డి ధూళిపాళ గిరిబాబు రావుగోపాలరావు

  • రచన : ఆరుద్ర
  • సృత్యాలు: వెంపటి సత్యం, ??
  • నిర్మాత మరియు సంగీతం: ఆదినారాయణరావు
  • దర్శకత్వం: సి యస్ రావు

బయటి లింకులు [మార్చు]