మహామృత్యుంజయ మంత్రం

వికీపీడియా నుండి

మృత్యంజయ మంత్రము లేదా మహామృత్యుంజయ మంత్రము ఋగ్వేదం (7.59.12)లోని ఒక మంత్రము. ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59వ సూత్రంలో 12వ మంత్రంగా వస్తుంది. దీనినే "త్ర్యంబక మంత్రము", "రుద్ర మంత్రము", "మృత సంజీవని మంత్రము" అని కూడా అంటారు. ఇదే మంత్రం యజుర్వేదం (1.8.6.i; 3.60)లో కూడా ఉన్నది. ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి, మోక్షం కొరకు జపిస్తారు. గాయత్రీ మంత్రములాగానే ఇది కూడా హిందూ మతములో ఒక సుప్రసిద్ధమైన మంత్రము.


విషయ సూచిక

[మార్చు] మంత్రం

ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

[మార్చు] ప్రయోజనం

చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు. దీర్ఘరోగం తో బాధపడేవారు ఈ మృత్యుంజయ స్తోత్రాన్ని నిత్య పారాయణగా ఆచరిస్తే శివుడు ఆ రోగం బారినుంచి వారిని, తీగనుంచి దోసకాయను దూరం చేసినట్లు, దూరంచేస్తాడు.

[మార్చు] విశేషాలు

ఈ మంత్రమునకు ఋషి వసిష్ఠుడు. ఛందస్సు అనుష్టుప్. దేవత శివుడు (శ్రీ మృత్యుంజయ త్ర్యంబకేశ్వరుడు). బీజము "హామ్". శక్తి దేవి అమృతేశ్వరి.

ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.


[మార్చు] అర్థం

ఈ మంత్రం తైత్తిరీయోపనిషత్తు లోని నారాయణప్రశ్నము లోనిది. ఇది తైత్తిరీయం లో 56 వ అనువాకం.

" సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా ! నిన్ను పూజిస్తున్నాను. బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); ఉర్వారుకమివ = దోసకాయను వలె ; మృత్యోః = చావునుంచి ; ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; అమృతాత్ = మోక్షము నుంచి; మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉందునుగాక )

తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. ఆమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉందును గాక."


[మార్చు] మృత్యుంజయ స్తోత్రము

ఇది కాక "మృత్యుంజయ స్తోత్రము" లేదా "మహామృత్యుంజయ స్తోత్రము" అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. స్తోత్ర పాఠంలో కొద్ది పాదాలు దిగువన ఇవ్వడమైనవి.

ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠ ముమాపతిం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
కాలకంఠం కాలమూర్తిం కాలాగ్నిం కాలనాశనం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభుం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం - నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ||

[మార్చు] వనరులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు