మహా శ్వేతాదేవి
వికీపీడియా నుండి
మహా శ్వేతాదేవి (బెంగాలీ: মহাশ্বেতা দেবী ) పశ్చిమ బెంగాల్ కు చెందిన సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. ఆమె 1926లో ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని నగరమైన ఢాకాలో జన్మించింది. ఆమె తండ్రి మనిష్ ఘటక్ కూడా కవి మరియు నవలా రచయిత. తల్లి ధరిత్రి దేవి కూడా రచయిత మరియు సామాజిక కార్యకర్త.
[మార్చు] తొలి జీవితం
1926లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ , కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.
[మార్చు] అవార్డులు
- 2006లో భారత ప్రభుత్వపు రెండో అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ అవార్డు లభించింది.
- 1997లో రామన్ మెగ్సేసే అవార్డు స్వీకరించింది.
- 1996లో సాహిత్య రంగంలో అత్యున్నత అవార్డు జ్ఞానపీఠ అవార్డు లభించింది.
