మహేష్ భూపతి
జూన్ 7, 1974 న చెన్నై లో జనించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లాం టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. 1997 లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో జపాన్ కు చెందిన రికా హిరాకీతో కల్సి ఆడి మిక్స్‌డ్ డబుల్స్ లో విజయం సాధించాడు. 2001 లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లోనూ . 1999 వింబుల్డన్ డబుల్స్ లోనూ లియాండర్ పేస్ తో కల్సి ఆడి గెల్చినాడు. గ్రాండ్‌స్లాం కు చెందిన నాల్గు టోర్నమెంట్లలోనూ ఫైనల్స్ చేరిన ఏకైక జంట వీరిది. 2002 లో బుసాన్ లో జర్గిన 14 వ ఆసియా క్రీడలలో లియాండర్ పేస్ మనదేశానికి బంగారు పతకం సాధించిపెట్టినాడు. 2006 లో మహేష్ భూపతి మార్టినా హింగిస్ తో కల్సి మిక్స్‌డ్ డబుల్స్ ఆడి గెల్చినాడు. 2007 లో చెక్ కు చెందిన ఆటగ్డితో కల్సి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడి అందులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఇతనితోనే ఆడి సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు.
[మార్చు] కుటుంబం
మహేష్ భూపతికి గతంలో ప్రముఖ మోడల్ శ్వేతా జయశంకర్‌తో వివాహమైంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరి ఆరేళ్ళ వివాహ జీవితం 2010 జులై నెలలో ముగిసింది. తర్వాత మహేష్ భూపతికి, బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి లారాదత్తాలకు నిశ్చితార్థం న్యూయార్క్‌లో జరిగింది.[1]