మాక్స్ ప్లాంక్
| Max Planck | |
|---|---|
| Born | ఏప్రిల్ 23 1858 Kiel, Holstein |
| Died | 1947 (వయసు 89) Göttingen, West Germany |
| జాతీయత | German |
| Fields | Physics |
| విద్యాసంస్థలు | University of Kiel University of Berlin University of Göttingen Kaiser-Wilhelm-Gesellschaft |
| Alma mater | Ludwig Maximilian University of Munich |
| Doctoral advisor | Alexander von Brill |
| Doctoral students | Gustav Ludwig Hertz Erich Kretschmann Walther Meißner Walter Schottky Max von Laue Max Abraham Moritz Schlick Walther Bothe Julius Edgar Lilienfeld |
| ప్రసిద్ధి | Planck constant Planck postulate Planck's law of black body radiation |
| Notable awards | Nobel Prize in Physics (1918) |
| Signature |
|
|
Notes
He is the father of Erwin Planck who was executed in 1945 by the Gestapo for his part in the July 20 plot. |
|
మాక్స్ ప్లాంక్ (ఏప్రిల్ 23, 1858 – అక్టోబర్ 4, 1947) ప్రఖ్యాత జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఆయనను క్వాంటం భౌతిక శాస్త్రానికి ఆద్యుడిగా భావిస్తారు. 17 ఏళ్ళకే డిగ్రీ చేశాడు. 31 ఏళ్ళకే ప్రొఫెసర్ అయ్యాడు. క్వాంటమ్ వాదాన్ని ప్రతిపాదించినందుకు గాను 1918 లో నోబెల్ బహుమతి సాధించాడు.
బాల్యం[మార్చు]
జర్మనీ లోని కీల్ లో 1858 ఏప్రిల్ 23 న ఓ విద్యాధికుల కుటుంబం లో పుట్టిన మాక్స్ ప్లాంక్ చదువు, సంగీత రంగాల్లో చురుకైన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. పదిహేడేళ్ళకే డిగ్రీ చేసి, భౌతిక శాస్త్రాన్ని అభ్యసించి ఒక ప్రయోగానికి గాను డాక్టరేట్ పొందాడు. ఆయన జీవితకాలంలో చేసిన ప్రయోగం అదొక్కటే. ఆపై ఆయన అందించిన విజ్ఞానం అంతా దాని ఆధారంగా చేసుకున్న సిద్ధాంత పరమైనదే.
బెర్లిన్ విశ్వవిద్యాలయం లో 31 ఏళ్ళకే భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతి అయ్యాడు. 1900 లోప్రతిపాదించిన క్వాంటమ్ వాదం పెద్ద సంచలనం. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటో విద్యుత్ ఫలితం వాదం , ప్లాంక్ క్వాంటమ్ వాదాన్ని మరింతగా బలపరిచింది.
క్వాంటమ్ వాదం[మార్చు]
క్వాంటమ్ వాదం ఈ ప్రపంచాన్ని సరికొత్త కోణంలో చూపుతుంది. దీని ప్రకారం శక్తి అవిచ్ఛిన్నంగా కాకుండా విడివిడిగా అతి చిన్న పరిమాణాల్లో కణాల రూపంలో ఉంటుంది. ఒక పరిమాణాన్ని ఒక క్వాంటమ్ శక్తి అంటారు. ఇది ఆవర్తన పట్టిక ను విపులీకరిస్తుంది. రసాయనిక చర్య లు ఎందుకు జరుగుతాయో చెబుతుంది. జీవశాస్త్రం లో డీఎన్‌ఏ కణాల స్థిరత్వాన్ని, పరమాణు కేంద్రం నుంచి ఆల్ఫా కణాల వికిరణాలను వివరిస్తుంది.
ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతున్న లేజర్ కిరణాలు, కంప్యూటర్ రంగానికి మూలాధారమైన మైక్రోచిప్స్, అతివాహకత, కాంపాక్ట్ డిస్క్ ల ఆవిష్కరణకు నాంది పలికింది. దీని ఆధారంగా పరిశోధనలు చేసిన వారెందరో నోబెల్ బహుమతులు అందుకున్నారు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
ఆయన జీవితం విషాద భరితం. పెద్ద కుమారుడు ప్రపంచ యుద్ధంలో మరణించాడు. ఇద్దరు కుమార్తెలు వివాహమైన కొద్ది రోజులకే చనిపోయారు. చిన్న కుమారుడిని దేశద్రోహిగా చిత్రీకరించి హిట్లర్ ఉరి తీయించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనినే దైవంగా భావించి ముందుకు సాగిపోవడం ఆయన దృఢసంకల్పానికి నిదర్శనం.