మాడపాటి హనుమంతరావు

వికీపీడియా నుండి

ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22 న కృష్ణ జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో వెంకటప్పయ్య,వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.వీరు ఆరువేల నియోగి బ్రాహ్మణులు.ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసేవాడు.1904 లో మాడపాటి వారికి తమ చిన మేన మామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది.వీరిరువురికి లక్ష్మిబాయి అనే కుమార్తె జన్మించింది.దురదృష్ట వశాత్తూ అన్నపూర్ణమ్మఅకాలమరణం చెందారు.తదనంతరం,1918 లో గొల్లమూడి హనుమంతరావు కుమార్తె మాణిక్యమ్మను వివాహమాడారు.మాడపాటివారికి ,మాణిక్యమ్మకు సుకుమార్ జన్మించాడు.1964 లో సుకుమార్ కు సుచేతతో వివాహమైంది.సుచేత,వరంగల్ వాస్తవ్యులు ఎర్ర జగన్మోహన్ రావు ,పద్మావతిల పెద్ద కుమార్తె. దురదృష్ట వశాత్తూ సుకుమార్ అకాలమరణం చెందారు.శ్రీమతి సుచేత మాత్రం మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలకు తమ సేవలను అర్పితం చేసారు.

మాడపాటివారు గొప్ప కవి, రచయిత.మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు.వీటిలో హృదయశల్యం,రాణీసారందా,ముసలిదాని ఉసురు,నేనే,అగ్ని గుండం,నాడు నీ పంతం,నేడు నా పంతం,ఆత్మార్పణం,తప్పు ,ఎవరికి,విధిప్రేరణం అనే కధలు 'మల్లికాగుచ్చం' పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి. మాడపాటికి రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంధం 'తెలంగాణా ఆంధ్రోద్యమం'.మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త. తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకముగా ప్రజలను మేల్కొలిపి సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పాడు. హైదరాబాదు నగర తొలి మేయర్.అంతే కాదు.మన రాష్ట్ర్ర విధాన పరిషత్ కు మొదటి అధ్యక్షులు వీరే కావడం ,ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం. భారతదేశములో ప్రప్రథమ బాలికల పాఠశాలలో ఒకటైన మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించాడు.


[మార్చు] మూలాలు

  • ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు (జీవిత చరిత్ర) - డి.రామలింగం (1985) ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు శతజయంతి ఉత్సవ కమిటీ. [1]

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు