మాదయ్యగారి మల్లన

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మాదయ్యగారి మల్లన అష్టదిగ్గజములలో ఒకడు. 16వ శతాబ్దపు తెలుగు కవి.

మల్లన 516 గద్యపద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అను కావ్యమును రచించినాడు. ఈ గ్రంథమును ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములో చేరకముందే రచించాడు. రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు.

రాయలతోపాటు దండయాత్రలకు, తీర్థయాత్రలకు తప్పకుండా వెళ్లే కవులలో మల్లన ఒకడు. రాయల కొలువులో మొదటినుండి ఉన్నా రాజశేఖర చరిత్రలో రాయల ప్రస్తావన లేదు. ఈయన తన కావ్యమును 1516 - 1520 మధ్య వినుకొండ, గుత్తి సీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పమంత్రి కి అంకితమిచ్చాడు. అప్పమంత్రి తిమ్మరుసు మేనల్లుడు మరియు అల్లుడు.

ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్ననే. లగ్నము పెట్టడము దగ్గరినుండి గృహప్రవేశము వరకు 75 గద్యపద్యములలో అనాటి పెళ్లితంతు గురించి రాజశేఖర చరిత్రలో వర్ణించాడు.

మల్లన తన గురించి రాజశేఖర చరిత్రలో ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. ఈయన కృష్ణా జిల్లాలోని అయ్యంకిపురము కు చెందిన వాడని తెలుస్తున్నది అయితే వైఎస్ఆర్ జిల్లాలో పెరిగినాడు. ఈయన గురువు వైఎస్ఆర్ జిల్లా పుష్పగిరి కి చెందిన అఘోర శివాచార్యులు.

మూలములు[మార్చు]

  • సమగ్ర ఆంధ్ర సాహిత్యము - ఆరుద్ర 7వ సంపుటం పేజీలు 54-69


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు