మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గురూజీగా ప్రసిద్ధులైన మాధవ్ రావ్ సదాశివ రావ్ గోల్వల్కర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు రెండవ సర్ సంఘ్ చాలక్.

ప్రారంభ జీవితం[మార్చు]

గోల్వల్కర్ మహారాష్ట్రలోని నాగపూర్ సమీపానగల రాంటెక్ పట్టణం లో ఫిబ్రవరి,19-1906 న జన్మించారు. ఈయన తండ్రి పేరు సదాశివ రావ్. ఈయన ఒక స్కూలు టీచర్. తల్లి లక్ష్మీబాయి. గోల్వల్కర్ తన బాల్యాన్ని నాగపూర్ లో గడిపారు.

ఈయన జంతుశాస్త్రం లో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను బెనారస్ హిందూ యూనివర్సిటీ లో పూర్తి చేసారు. తరువాత అదే యూనివర్సిటీలో ఆచార్యునిగా పనిచేసారు. ఆ సమయంలోనే ఈయనకు గురూజీ అనే పేరు సిద్ధించినది. ఇక ఆయన జీవితాంతం అదే పేరుతో పిలువ బడ్డారు.

ఆర్.యస్.యస్.తో సంబంధం[మార్చు]

బెనారస్ హిందూ యూనివర్సిటీలో విధ్యార్ధి ఐన భయ్యాజీ దాణే వలన ఈయనకు ఆర్.యస్.యస్. సర్ సంఘ్ చాలక్ ఐన కె.బి.హెడ్గేవార్ ను కలిసి ఆర్.యస్.యస్. లో చేరారు. హెడ్గేవార్ అనతికాలంలోనే గోల్వల్కర్ లోని అంకితభావాన్ని గమనించి అతనిని తన వారసునిగా గుర్తించారు. గోల్వల్కర్ 1939లో ఆర్.యస్.యస్. సర్ కార్య వాహ్ గా నియమించబడ్డారు. హెడ్గేవార్ జబ్బుపడి జూన్,21-1940న మరణించారు. దానితో గోల్వల్కర్ ఆర్.యస్.యస్.సర్ సంఘ్ చాలక్ అయ్యారు.

సంఘ్ పరివార్ లోని అన్ని సంస్థల వెనుక గోల్వల్కర్ కృషి ఉన్నది. 2006-07లో సంఘ్ పరివార్ ఈయన శతజయంతి ఉత్సవాలను జరుపుకున్నది.

వివాదం[మార్చు]

మరణం[మార్చు]

గోల్వల్కర్ గురూజీ జూన్,5-1973న నాగపూర్ లో కాన్సర్ తో మరణించారు.

బయటి లింకులు[మార్చు]

ఆర్.యస్.యస్.అధికారిక వెబ్ సైటు