మాధురీ దీక్షిత్

వికీపీడియా నుండి

మూస:Translation/Ref

మాధురి దీక్షిత్ [1] భారత దేశపు ప్రముఖ బాలివుడ్ నటి. 1980 ల నుండి 1990 ల వరకు ఆమె హిందీ సినీ పరిశ్రమలో ఒక అగ్రగామి నటి మరియు గుర్తింపు పొందిన నాట్యకారిణిగా ప్రఖ్యాతి పొందారు.ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా తన నటనికి గాను విమర్శకుల చే ఎన్నో ప్రశంసలు అందుకుని బాలివుడ్ లోని అత్యంత ఉన్నతమైన నటీమణులో ఒకరు అయ్యారు. 2008 వ సంవత్సరములో భారత ప్రభుత్వం ఆమెను 'పద్మ శ్రీ' బిరుదుతో సత్కరించారు.


విషయ సూచిక

[మార్చు] బాల్యము మరియు విద్య

మాధురి దీక్షిత్ ముంబై, భారత్ కి చెందినవారు. ఆమె అసలు పేరు మాధురి శంకర్ దీక్షిత్. ఆమె మరాఠి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శంకర్ మరియు స్నేహలత దీక్షిత్ ల కుమార్తె. ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి తన చదువు పూర్తి చెసారు. అమెకి మైక్రో బైయాలజిస్ట్ అవ్వాలనే అశయం ఉండేది. అమె కథక్ నృత్యాన్ని ఎనిమిది సంవత్సరాలు అభ్యసించి అందులో ప్రవీణులయ్యరు.


[మార్చు] సినీ జీవితం

1984 లో మాధురి దీక్షిత్ "అబోద్" సినిమాతో అరంగేట్రం చేశారు.కొన్నిసినిమాల్లొ సహాయ నటిగా చేసాక అమె "తేజాబ్" సినిమాలో ముఖ్య నటి పాత్ర పొషించారు. ఈ సినిమా అమెకి పేరునే కాకుండా తన మొదటి ఫిలింఫేర్ నామినేషన్ ని కూడా తెచ్చిపెట్టింది.ఆపై అమె "రాం లఖన్" (1989), "పరిందా" (1989), "త్రిదేవ్" (1989) మరియు "కిషన్ కన్హైయ్యా" (1990) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

1990 లో దీక్షిత్ ఇంద్ర కుమార్ చే నిర్దేశింపబడిన "దిల్" అనే ప్రేమ కధా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించారు.ఇందులో అమె ఒక ధనికురాలు పొగరుగత్తె అమ్మాయి అయిన మధు మెహ్రా గా నటించారు. ఈ సినిమాలో మధు రాజా గా నటించిన ఖాన్ తో ప్రేమలో పడి అతనితో పెళ్లికై ఇల్లు విడిచి వెళతారు. ఈ సినిమా ఆ సంవత్సరంలోని చాలా పెద్ద విజయవంతమైన చిత్రాల్లో ఒకటైంది. అంతే కాకుండా దీక్షిత్ కు ఆమె సినీ జీవితపు మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి నామినేషన్ కూడా తెచ్చి పెట్టింది.

"దిల్" తరువాత ఆమె "సాజన్" (1991), "బేటా" (1992), "ఖల్నాయక్" (1993), "హం ఆప్కే హై కౌన్"(1994), మరియు "రాజా" (1995) వంటి మరిన్ని విజయవంతమైన సినిమాల్లో నటించారు. "బేటా" లో చదువురాని అమాయకుడైన భర్తకి భార్యగా మరియు గయ్యాళి అత్తయ్యతో పోరాడే కోడలిగా పొషించిన పాత్రకి గాను ఆమె తన రెండవ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.

"హం ఆప్కే హై కౌన్!"భారత హిందీ సినీ చరిత్ర లోని గొప్ప విజయవంతమైన సినిమాల్లో ఒకటి. ఈ సినిమా భారత్ లో దాదాపు రూ. 650 మిలియన్లు ఇంకా విదేశాల్లో సుమారు రూ. 150 మిలియన్లు దాకా సంపాయించింది. ఇంకా దీక్షిత్ ఈ సినిమా కి గాను తన మూడవ పిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా పొందారు.ఇదే సంవత్సరంలో దీక్షిత్ "అంజాం" అనే సినిమాలోని తన నటనకై విమర్శకులచే మంచి ప్రశంసలు అందుకున్నారు.

1996 అంత కలిసి రాకపోయినప్పటికీ, ఆమె 1997 లో మళ్లీ "దిల్ తొ పాగల్ హై" అనే సినిమాలో పూజ అనే పాత్రలో నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్నే కాకుండా దీక్షిత్ కు నటిగా కూడా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సంవత్సరమే ఆమె మళ్ళీ తన నాలుగవ ఫిలింఫేర్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె ప్రకాష్ ఝా నిర్దెశించిన "మ్రిత్యుదండ్" అనే చిత్రంలో కూడా చేసారు.ఈ చిత్రం కమర్షియల్ మరియు ఆర్ట్ హంగుల జోడించి ఉన్నది.ఇది బాంకాక్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు జెనీవా లోని "సినెమా టూట్ ఎక్రాన్" లలో ఉత్తమ చిత్రం గా ఎన్నికైంది.ఈ సినిమాకు గాను దీక్షిత్ స్తార్ స్క్రీన్ అవార్డ్స్ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందారు.

దీక్షిత్ కేవలం నటనకే కాదు నాట్యకారిణిగా కూడా మంచి గుర్తింపు పొందారు.తన సినిమాల్లో ఆమె నాట్యం చేసిన పాటలు "ఏక్ దో తీన్" (తేజాబ్), "బడా దుఖ్ దీనా" (రాం లఖన్), "ధక్ ధక్" (బేటా), "చనే కె ఖేత్ మే" (అంజాం), "చోలి కె పీఛే క్యా హై" (ఖల్నాయక్), "అఖియాం మిలాఊం" (రాజా), "పియా ఘర్ ఆయా" (యారానా), "కే సరా సరా" (పుకార్), "మార్ డాలా" (దేవదాస్) వంటివి ఆమెకు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి.2002 లో షారూఖ్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ లతో కలసి సంజయ్ లీలా భంసాలీ చే నిర్దేసింపబడిన "దేవదాస్" చిత్రం లో నటించారు.ఇందులో అమె నటనకు మంచి స్పందన లభించడమే కాకుండా అమెకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం కూడ వచ్చింది.ఈ సినిమాకు విదెశాల్లో కూడా మంచి గుర్తింపు వచ్చి ప్రతిష్ఠాత్మకమైన "కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్" లో కుడా ప్రదర్శింపబదినది.

2003 లో ఆమె పేరు మీదగా "మై మాధురి దీక్షిత్ బన్నా చాహ్తీ హుం" అనే సినిమా విడుదల అయ్యింది. ఒక యువతి (యువతిగా అంత్ర మాలి నటించారు) తను మాధురి దీక్షిత్ అంత గొప్ప నటి అవ్వాలనే కోరికతో బాలివుడ్ లో పడే పాట్లు కథాంసంగా ఈ చిత్రం రూపొందింది.


ఫిబ్రవరి 25, 2006 న దీక్షిత్ 6 సంవత్సరాల తరవాత మళ్ళీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ స్టేజి పై తన "దేవదాసు" సినిమాలొని పాటకి నాట్యం చేసారు.ఈ నృత్యానికి దర్శకత్వం సరోజ్ ఖాన్ వహించారు.

భారత దేశపు ప్రఖ్యాత చిత్రకారుడు ఎం. ఎఫ్. హుసేన్ ఇమె అభిమాని, ఆమెను ఒక గొప్ప మహిళగా అయన వర్ణించారు.2000 లో మాధురి ముఖ్య పాత్రలో "గజ గామిని" అనే చిత్రాన్ని కూడ ఈయన నిర్దేశించారు.ఈ చిత్రాన్ని అయన అమెకే అంకితం చెసారు."గజ గామిని" లో అమె వివిధ రకాలైన స్త్రీ పాత్రలు పొషించారు. వీటిలొ కాళిదాసుకి ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా, లియొనార్డో మోన లీసా గా, ఒక తిరుగుబాటుదారిగా, చెసినవి ప్రముఖమైనవి.


డిసెంబర్ 7, 2006 న దీక్షిత్ తన భర్త పిల్లలతో కలసి ముంబై కి "ఆజా నచ్లే" అనే సినిమా షూటింగ్ కోసం తిరిగి వచ్చారు. నవంబరు 2007 లో విడుదలైన ఈ సినిమా విమర్సకుల మెప్పు పొందకపొయినా దీక్షిత్ కి మంచి పేరునే తెచ్చింది. "న్యూ యోర్క్ టైంస్" అనే పేపర్ అమెలో ఇంకా నాట్యం పై పట్టు పోలేదని రాసింది.


2007 లో అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవ సందర్భంగా రిడిఫ్ దీక్షిత్ ను అత్యున్నత బాలివుడ్ నటీమణి గా గుర్తించింది. [2]


[మార్చు] వక్తిగత జీవితం

దస్త్రం:Madhuri Dixit PS.jpg
The President, Smt. Pratibha Devisingh Patil presenting the Padma Shri Award to Ms. Madhuri Dixit

1999 లో దీక్షిత్ అమెరికా లో స్థిరపడిన భారతీయుడు వైద్యుడు అయిన శ్రీ రాం నేనే ను పెళ్ళాడారు. ఈయన యు.సి.ఎల్.ఎ. లో శిక్షణ పొందిన కార్డిఓ వాస్కులార్ సర్జన్. నేనే డెన్వెర్ కు చెందిన మరాఠి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.దీక్షిత్ కు ఇద్దరు పిల్లలు, అరిన్ (జననం మార్చ్ 2003, కొలరాడొ) మరియు రాయన్ (జననం మార్చ్ 8, 2005, కొలరాడొ).

ఈమెకు ఇద్దరు అక్కలు - రూప మరియు భారతి - ఒక అన్నయ్య, అజిత్.మాధురి తన కుటుంబం కలసి డెన్వర్, కొలరాడొ, యు.ఎస్.ఎ. లొ నివసిస్తున్నారు.


[మార్చు] పురస్కారాలు మరియు ప్రతిపాదనలు

[మార్చు] ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు

గెలిచినవి

  • 1990: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "దిల్" కు.
  • 1992: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "బేటా" కు.
  • 1994: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "హం ఆప్కే హై కౌన్!" కు.
  • 1997: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "దిల్ తొ పాగల్ హై" కు.
  • 2002: ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం "దెవదాస్" కు.


నామినేట్ అయ్యెను

  • 1988: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "తేజాబ్" కు.
  • 1989: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "ప్రేం ప్రతిఙ" కు
  • 1991: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "సాజన్" కు
  • 1993: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "ఖల్నాయక్" కు
  • 1994: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "అంజాం" కు
  • 1995: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "రాజా" కు
  • 1995: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "యారానా" కు
  • 2000: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు
  • 2001: ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం "లజ్జ" కు
  • 2008: ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం "ఆజా నచ్లే" కు


[మార్చు] స్టార్ స్క్రీన్ అవార్డులు

గెలిచినవి

  • 1994: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "హం ఆప్కే హై కౌన్" కు
  • 1995: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "రాజా" కు
  • 1997: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "మ్ర్యుత్యుదండ్" కు
  • 2002: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "దేవదాస్" కు


నామినేట్ అయ్యెను

  • 2000: స్టార్ స్క్రీన్ ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు


[మార్చు] జీ సినీ అవార్డులు

గెలిచినవి

  • 1998: జీ సినీ ఉత్తమ నటి పురస్కారం "దిల్ తొ పాగల్ హై" కు
  • 2002: జీ సినీ ఉత్తమ సహాయ నటి పురస్కారం "లజ్జ" కు


నామినేట్ అయ్యెను

  • 2000: జీ సినీ ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు
  • 2003: జీ సినీ ఉత్తమ నటి పురస్కారం "దేవదాస్" కు


[మార్చు] ఐఫా అవార్డులు

నామినేట్ అయ్యెను

  • 2000: ఐఫా ఉత్తమ నటి పురస్కారం "పుకార్" కు


[మార్చు] స్టార్ డస్ట్ అవార్డులు

నామినేట్ అయ్యెను

  • 2008: స్టార్ డస్ట్ "స్టార్ ఆఫ్ ద ఇయర్" ఉత్తమ నటి పురస్కారం "ఆజా నచ్లే" కు


[మార్చు] సన్మానాలు

  • 1997: "కళాభినేత్రి" - ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే
  • 2001: రాష్ట్రీయ పౌరుల పురస్కారం. (నాష్నల్ సిటిజన్స్ పురస్కారం)
  • 2001: ఫోర్బ్స్ అనే మగజైన్ మాధురి ని "టాప్ ఫైవ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ మూవీ స్టార్స్" లో ఒకరి గా గుర్తించింది.http://www.forbes.com/2001/03/09/0309bollywood.html http://www.geocities.com/bigbachchan2/amitforbes.html
  • 2007: "బాలివుడ్ లోని అత్యున్నతమైన నటీమణి"
  • 2008: "పద్మ శ్రీ" (నాల్గవ అత్యున్నత పౌరసత్కారం) - భారత ప్రభుత్వం చే.
  • 2008: IFFLA ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సన్మానం.


[మార్చు] ఫిల్మోగ్రఫీ

సంవత్సరం సినిమా పాత్ర ఇతరములు
1984 అబోద్ గౌరీ ఖాన్
(1985) ఆవారా బాపి
1986 స్వాతి
1987 మొహరే
హిఫాజాత్ జానకి
ఉత్తర దక్షిణ
1988 ఖత్రో కే ఖిలాడి కవిత
దయావాన్ నీలా వెల్హు
తేజాబ్ మోహిని ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
1989 వర్డి జయ
రాం లఖన్ రాధ
ప్రేఅం ప్రతిగ్యా లక్ష్మి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
ఇలాకా విద్య
ముజ్రిం సోనియా
త్రిదేవ్ దివ్య మాథుర్
కానూన్ అప్నా అప్నా భారతి
పరిందా పారో ఒస్కార్స్ కు భారత యొక్క అధికార ప్రవేశం
పాప్ కా అంత్
బూస్ట్: ౧౯౯౦ - ప్రస్తుత కాలం మహా సంగ్రామం
కిషన్ కన్హైయ్యా అంజు
ఇజత్దార్ మోహిని
దిల్ మధు మెహ్రా ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
దీవాన ముజ్సా నహి అనిత
జీవన్ ఎక్ సంఘర్ష్ మధు సేన్
సైలాబ్ డా. సుష్మ
జమై రాజా రేఖా
థానెదార్ చందా
1991 Pyaar Ka Devata Devi
Khilaaf Sweta
100 డేస్ దేవి
ప్రతీకార్ మధు
సాజన్ పూజ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
ప్రహార్ షిర్లీ
1992 బేటా సరస్వతి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
జిందగి ఎక్ జువా జుహీ
ప్రేం దీవానే శివాంగి మెహ్రా
ఖేల్ సీమా/డా. జడి బూటి
సంగీత్
1993 ధారావి డ్రీం గర్ల్
సాహిబాన్ సాహిబాన్
ఖల్నాయక్ గంగా (గంగోత్రి దేవి) ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
ఫూల్
దిల్ తేరా ఆశిక్ సోనియా ఖన్నా/సావిత్రి దేవి
ఆంసూ బానే అంగారే
1994 అంజాం శివాని చోప్రా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
హం ఆప్కే హై కౌన్! నిషా చౌదరి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
1995 రాజా మధు గరేవాల్ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
యారాన లలితా/శిఖా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
1996 ప్రేం గ్రంథ్ కజ్రి
పాపి దేవత
రాజ్ కుమార్
1997 కోయల గౌరీ
మహాంత జెన్నీ పింటో
మ్రిత్యుదండ్ ఫూల్వ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
మోహబ్బత్ శ్వేత శర్మ
దిల్ తో పాగల్ హై పూజ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం
1998 బడే మియా చోటే మియా మాధురి దీక్షిత్ ప్రత్యేక పాత్ర
వజూద్ అపూర్వ చౌదరి
1999 ఆర్జూ పూజ
2000 పుకార్ అంజలి ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.
గజ గామిని గజ గామిని/సంగిత/శకుంతల/మోనికా/మొన లిసా
2001 యెహ్ రాస్తే హై ప్యార్ కే నేహ
లజ్జా జానకి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి నామినషన్
2002 హమ్ తుమ్హారే హైన్ సనం రాధా
దేవదాస్ చంద్రముఖి ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారం, ఆస్కార్ కు భారత్ తఫున అధికారింగా ఎన్నికైనది
2007 ఆజా నచ్లే దియా ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డుకి నామినేట్ అయింది.


[మార్చు] సంబంధాలు /రేఫెరెంసుస్

  1. (జననం మే 15, 1967)
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Women.E2.80.99s_Day_Article అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు


[మార్చు] బాహ్య లింకులు


మూస:S-ach|-! colspan="3" style="background: #DAA520;" | Filmfare Awards|-|- style="text-align:center;" మూస:FilmfareBestActressAwardమూస:FilmfareBestSupportingActressAward

ముందు
Sridevi
for Chaalbaaz
|width="40%" style="text-align: center;" rowspan="1"|Best Actress
for Dil

1991 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Sridevi
for Lamhe
ముందు
Sridevi
for Lamhe
|width="40%" style="text-align: center;" rowspan="1"|Best Actress
for Beta

1993 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Juhi Chawla
for Hum Hain Rahi Pyar Ke
ముందు
Juhi Chawla
for Hum Hain Rahi Pyar Ke
|width="40%" style="text-align: center;" rowspan="1"|Best Actress
for Hum Aapke Hain Kaun

1995 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Kajol
for Dilwale Dulhaniya Le Jayenge
ముందు
Karisma Kapoor
for Raja Hindustani
|width="40%" style="text-align: center;" rowspan="1"|Best Actress
for Dil To Pagal Hai

1998 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Kajol
for Kuch Kuch Hota Hai
ముందు
Jaya Bachchan
for Kabhi Khushi Kabhie Gham
|width="40%" style="text-align: center;" rowspan="1"|Best Supporting Actress
for Devdas

2003 |width="30%" align="center" rowspan="1"| తరువాత
Jaya Bachchan
for Kal Ho Naa Ho
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు