దినోత్సవాలు

వికీపీడియా నుండి
(మానవ హక్కుల దినోత్సవం నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం[మార్చు]

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (International Men's Day) ప్రతి సంవత్సరం నవంబరు 19 తేదీన జరుపుకుంటాము. ఇది ఐక్య రాజ్య సమితి (United Nations) ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగో లో 1999 లో ప్రారంభించబడినది.[1]

మూలాలు[మార్చు]

  1. 'UNESCO comes out in Support of International Men's Day', Article Trinidad Guardian Nov 20, 2001

అంతర్జాతీయ మహిళా దినోత్సవం[మార్చు]

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) జరుపుకుంటాము.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం[మార్చు]

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 17 నవంబరు 1999లో యునెస్కో సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.

అటవీ అమరవీరుల సంస్మరణ దినం[మార్చు]

అటవీ అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం నవంబరు 10 న జరుపుకుంటారు. 1991 నవంబర్ 10న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఐఎఫ్‌ఎస్‌ (Indian Forest Service - IFS) అధికారి శ్రీనివాస్‌ స్మరణార్థం ప్రతిసంవత్సరం అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం[మార్చు]

భారత జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంను ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 న జరుపుకుంటారు. 1991 డిసెంబర్‌ 14న జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంధనం పొదుపు చేయడంలో చాతుర్యం చూపిన సంస్థలను ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేశారు. అప్పట్నుంచీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 న భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ తరపున జాతీయ గుర్తింపును ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రియల్‌ యూనిట్లకు, హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లు - ఇలా కుటీర పరిశ్రమలతో సహా అనేక సంస్థలకు అవార్డులు ఇస్తున్నారు. 2001వ సంవత్సరంలో భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంధన పొదుపు చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఎనర్జీ మ్యానేజర్లు, ఆడిటర్లను ఎవరో ఒకర్ని నియమించకూడదు. ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, ప్రోజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సింగ్‌, ఇంప్లిమెంటేషన్లలో నిపుణులైనవారిని, క్వాలిఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ను ఆయా ఉద్యోగాలకు నియమించాలి.

బయటి లింకులు[మార్చు]

జాతీయ ఓటర్ల దినోత్సవం[మార్చు]

భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవమును జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా జాతీయ ఎన్నికల కమీషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

జాతీయ పత్రికా దినోత్సవం[మార్చు]

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 16 వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవం జరుపుకుంటారు. 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

బయటి లింకులు[మార్చు]

ప్రపంచ జనాభా దినోత్సవం[మార్చు]

Countries by population density.svg

ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) : ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాము. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చలనం తెచ్చేందుకు ఐక్య రాజ్య సమితి 1989లో దీనిని ప్రారంభించింది. 1987లో ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన రోజు జూలై 11 కాబట్టి ఆరోజును గుర్తించారు.

ప్రపంచ జనాభా 20వ సంవత్సరాల తరువాత జూలై 11, 2007న 6,602,226,175 కు చేరింది.

బయటి లింకులు[మార్చు]

ప్రపంచ పర్యావరణ దినం[మార్చు]

ప్రధాన వ్యాసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినం (ప్ర.ప.ది.) (World Environment Day 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది.

మానవ హక్కుల దినోత్సవం[మార్చు]

ప్రతి సంవత్సరం డిసెంబరు 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం (Human Rights Day) జరుపుకుంటాము.

పోలీసులంటే భయం[మార్చు]

కాలం మారినా పోలీసులపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయంలో మాత్రం తేడా రాలేదని తేలింది. పోలీసులు దశాబ్దాల తరబడి పక్షపాత నైజాన్ని మార్చుకోక పోవడంతో ప్రజల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో వారిపై అపనమ్మకం, భయం పెరిగి పోయాయని మానవ హక్కుల సంస్థ స్పష్టం చేసింది.పరపతి కలిగిన వ్యక్తులు, పెద్దస్థాయి వారితో సంబంధాలు ఉన్నవారు మాత్రమే పోలీసుల సహాయాన్ని కోరటానికి ముందుకు వస్తున్నారని, పక్షపాతంతో వ్యవహరించటం, రాజకీయ ప్రేరణలతో సామాన్యుల ఫిర్యాదులు నమోదు చేసుకోకపోవటం, అకారణంగా నిర్బంధించటం, చిత్రహింసలు, చంపటం, రాజకీయ నేతల కోసం నేరాలకు పాల్పడటం. వల్ల పోలీసులంటే భయం, అపనమ్మకం పెరిగిపోయాయని తమ నివేదికలో స్పష్టం చేశారు.