మామిడి తాండ్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడి తాండ్ర
మామిడి తాండ్ర
మూలము
ఇతర పేర్లుమామిడి తాండ్ర, ఆమ్‌ పాపడ్, అమావత్, ఆమ్‌సోట్టో, మంబ్లా
మూలస్థానంభారతదేశము
ప్రదేశం లేదా రాష్ట్రంఉత్తర భారతదేశము, కోస్తా ఆంధ్ర, కర్ణాటక
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు మామిడి పండ్ల రసం, చక్కెర(సుక్రోజ్)

తాండ్ర అనేది పండ్ల రసాలని ఎండవెట్టి తయారు చేసే తియ్యని చిరుతిండి. ఈ తాండ్ర ని చెయ్యడానికి ఏ పండు రసమైనా వాడవచ్చు. కాని తెలుగు దేశంలో దీనిని ఎక్కువగా మామిడి పళ్లతోనూ, కొంచెం తక్కువగా తాటి పళ్ళతోనూ చేస్తారు. మామిడి పండ్లతో చేసిన మామిడి తాండ్ర కి ఉన్న ప్రాచుర్యం తాటి తాండ్రకి లేదు. పాశ్చాత్య దేశాలలో కూడ పండ్ల రసంతో తాండ్ర వంటి చిరుతిండిని చేసి, ప్లేస్టిక్ సంచీలలో వేసి అమ్ముతారు. కాని మామిడి తాండ్రకి ఉన్న రుచి, ప్రాచుర్యం తదితర తాండ్రలకి లేవేమో!

మామిడి తాండ్రని మామిడి పండు రసం నుండి తయారుచేస్తారు. పొరలు పొరలుగా ఉండి పులుపు, తీపి సమ్మేళనంతో అత్యంత మదురంగా ఉండే మిఠాయి మామిడి తాండ్ర.[1]

తయారీ విధానం[మార్చు]

మామిడి రసమును సేకరించి దానిని వెడల్పాటి అల్యూమినియం పళ్ళాలలో గాని, పెద్దవైన తాటాలు తట్టలలో గాని పొరలు పొరలుగా పోస్తారు. ఒక పల్చటి పొరలా రసాన్ని పళ్లెంలో కాని తట్టలో కాని పోసి, దానిని ఎండలో పెట్టి, అది గట్టి పడిన తరువాత మరొక వాయ రసం, మరొక పొరలా పోస్తారు. అలా కావలసిన మందం వచ్చే వరకూ పోస్తూ ఎండబెడుతూ పోతారు. ఈ తతంగం అంతా అవడానికి 2-4 వారాలు కాలం పట్టవచ్చు. బాగా ఎండిన తదనంతరం దానిని నలు చదరంగా ముక్కలు ముక్కలుగా కోసి అమ్మకమునకు తీసుకెళతారు.

  • శ్రేష్టమైన మామిడి తాండ్ర తయారీ కోసం కొన్ని రకాల జాతుల మామిడీ పళ్ళను మాత్రమే వాడుతారు. పుల్లని మామిడి తాండ్రకు పనికిరాదంటారు కాని, తీపి తీపిగా, పుల్ల పుల్ల పుల్లగా ఉండా లంటే కొన్ని కొన్ని పొరలని వెయ్యడానికి పులుపు పళ్లు వాడినా పరవాలేదు. .
  • అలా సేకరించిన మామిడి పళ్ళను తొక్క తీసి మాగాయ పచ్చడీకి తీసినట్టుగా పల్చని ముక్కలుగా కోసి టెంకలు పక్కన పెడతారు. ఇంట్లో చేసు కునేటప్పుడు రసాన్ని గిన్నెలోకి పిండుకుని చేసుకోవచ్చు.
  • మామిడి ముక్కలను పెద్ద గ్రైండర్లలో పోసి మెత్తగా ఆయేవరకూ తిప్పి ఆరసాన్ని పెద్ద బానలలో తీస్తారు.
  • చెక్కర కలిపే ముందు కొందరు దానిని త్వరగా గడ్డకట్టేటందుకు నీళ్ళతో కలపి వేడి చేస్తారు. కొందరు గ్రైండింగ్ చేసేటపుడే చక్కెర కలిపి చేస్తారు.
  • అలా వచ్చిన రసం పెద్ద పాత్రలలో బియ్యం జల్లెడలలో వేసి వడకడతారు
  • వడకట్టిన రసం పెద్ద పాత్రలలోనే ఉంచి ఎండలో పెడతారు.
  • పెద్ద అరపల మాదిరి తక్కువ ఎత్తులో పందిరి వేసి దానిపై చీరలు దుప్పట్లు వేసి వాటిమీద కొత్త తాటాకు చాపలు పరుస్తారు.
  • పరిచిన చాపలను ఎత్తుపల్లాలు లేకుండా ఉండేలా రాళ్ళను పెట్టి చాపలపై నీళ్ళు కొడుతూ శుభ్రపరుస్తారు.
  • చాపలు శుభ్రపడి ఎండిన తరువాత వాటిమీద కొంచెం చిక్కబడిన రసం మద్యలో నుండి పోసుకు వెళతారు. చివరల వరకూ ఆఖరుగా పోస్తూ చేతులతో సరిచేస్తారు. చివరల వరకూ కారిపోకుండా చీరలను మడతపెట్టీ అడ్డుపెడతారు.
  • మళ్లీ మళ్ళీ పొరలు పొరలుగా మామిడి రసం పోసుకు పోతారు. అది తగిన మందం అయినపుడు దాన్ని అనుకొన్న పరిమాణంలో ముక్కలుగా కోస్తారు. వాటిని మైకా కవర్లలో పాకింగ్ చేసి అమ్మకానికి ఇస్తారు.

కుటీర పరిశ్రమగా[మార్చు]

మామిడి తాండ్ర కేవలం ఎవరికి వారుగానే తయారు చేయం కాక కుటీర పరిశ్రమగా విస్తరించినది[2]. మామిడి ఉత్పతి అధికంగా జరిగే తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్టణం జిల్లా, విజయనగరం జిల్లా లలో దీనిని భారీ ఎత్తున పెద్ద కళ్ళాలు(సిమెంటు చేయబడిన కాళీ స్థలం) లో తయారు చేస్తారు. ఈ విదంగా తయారు చేసి ఎగుమతి చేస్తుంటారు. దీనిని ఉత్తర భారతదేశంలో కూడా తయారుచేస్తారు.[3]

చిత్రాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. G. Venkataramana Rao (25 May 2013). "The yummy 'mamidi tandra'". The Hindu.
  2. తీరని కష్టాల 'తీయని తాండ్ర'[permanent dead link]
  3. "Ode to the mango". 25 March 2007. Retrieved 3 June 2015.

ఇతర లింకులు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.