మార్పు (చేప)

వికీపీడియా నుండి
మార్పు చేప
భద్రంగా ఉన్నది
Clarias batrachus.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: Actinopterygii
వర్గము: సిలురిఫార్మిస్
కుటుంబము: క్లారిడే
ప్రజాతి: Clarias
జాతి: C. batrachus
ద్వినామము
Clarias batrachus
లిన్నేయస్, 1758

మార్పు చేప ఒక ఆహార ప్రధానమైన చేప. ఈ నడిచే పిల్లి చేపలు (Catfish) శాస్త్రీయ నామం క్లారియస్ బట్రాఖస్ (Clarias batrachus). ఇవి మంచినీటి ఆవాసాలలో నివసించే గాలిపీల్చే పిల్లిచేపలు (airbreathing catfish) ఇవి ప్రధానంగా ఆసియా (Southeast Asia) లో నివసిస్తాయి. వీటి పేరుకు తగినట్లుగా ఇవి కాళ్ళులేకపోయినా భూమి మీద మంచినీటిగుంటలు దొరికే ప్రాంతాలకు పాము మాదిరిగా ప్రాకుకుంటూ నడవగలవు.[1] ఈ విధమైన చలనం మూలంగా తేమ వున్నంతవరకు ఇవి నీటి బయట బ్రతుకగలవు.[1] ఇవి సామాన్యంగా నిలకడగా ఉండే బురద నీటిలో జీవిస్తాయి. కుంటలు ఎండిపోయినప్పుడు మరొక నీటికుంటకు పాకుకుంటూ కదిలిపోతాయి.

[మార్చు] లక్షణాలు

  • పొడవైన దేహము కలిగి సుమారు 45 సెం.మీ.వరకు పెరుగుతుంది.
  • అణచబడిన తల, పృష్ట మరియు పార్శ్వతలములలో అస్థిఫలకములుండుట, గుండ్రని అనుకపాల కీలితములు కలిగివుండడం ఈ చేపల ప్రధాన లక్షణములు.
  • ముట్టె మీద 4 జతల మీసాలు, మొప్ప కుహరములో అనుబంధ శ్వాసాంగాలు, కంటకములతో కూడిన ఉరోవాజములు, పొడవైన పృష్ట, పాయు వాజములు, గుండ్రని పుచ్ఛవాజము, బూడిద రంగు దేహము.
  • లోతు జలాల్లో పరభక్షక జీవనాన్ని గడుపుతుంది. చిన్న చేపలను, రొయ్యలను, లార్వాలను, క్రిములతోపాటు శైవలలను ఆహారంగా తీసుకుంటుంది.
  • కృత్రిమ చెరువుల్లో ప్రత్యుత్పత్తి జరుపుకోగలుగుతుంది.

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 "Catfish 'walk' down street", Metro.co.uk, 2008-07-18. Retrieved on 2008-07-18.

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు