మిరియాల రామకృష్ణ

వికీపీడియా నుండి

డా.మిరియాల రామకృష్ణ ఒక ప్రముఖ తెలుగు రచయిత మరియు పరిశోధకుడు. వీరు సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నారు.

వీరు మహకవి శ్రీశ్రీ రచనల పై పరిశోధన చేశారు.

వీరు వ్రాసిన కథలు కొన్నే అయినా; ప్రతి కథా ఒక ఆణిముత్యమే. వీరి కథలలో 'ఆకుపచ్చని కుక్కపిల్ల', 'ఆశ్చర్య చూడామణి', 'చెరసాలలో సరస్వతి', 'ఉంగరం' వంటివి చెప్పుకోదగినవి.

వీరు 1995-96 ప్రాంతంలో 'గీతాంజలి' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.

వీరు 'హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్' అనే సంస్థను స్థాపించి మంచి కథలను గుర్తించి, రచయితలను ప్రోత్సహించడానికి ఆయా కథకులకు అవార్డులిస్తున్నారు.

[మార్చు] తెలుగు భాష గురించి

తెలుగు భాషలోని మాధుర్యాన్ని గురించి వివరిస్తూ రామకృష్ణ గారు వ్రాసిన కవిత.

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృత రాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు

[మార్చు] మూలాలు

  • కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె