మిరిస్టిక్ ఆమ్లం
మూస:Chembox IUPACNameమూస:Chembox PubChemమూస:Chembox BoilingPt
| మిరిస్టిక్ ఆమ్లం[1] | |
|---|---|
| ఇతర పేర్లు | C14:0 (Lipid numbers) |
| Identifiers | |
| CAS number | [544-63-8] |
| SMILES | CCCCCCCCCCCCCC(=O)O |
| రసాయన ధర్మాలు | |
| Molecular formula | C14H28O2 |
| Molar mass | 228.37092 |
| సాంద్రత | 0.8622 g/cm3 |
| ద్రవీభవణ స్థానం |
54.4 °C[2] |
| మూస:Chembox verificationExcept where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa) | |
| Infobox references | |
మిరిస్టిక్ ఆమ్లం (Myristic acid, also called tetradecanoic acid) ఒక సాధారణమైన సంతృప్త కొవ్వు ఆమ్లం. ఇది 14 కార్బనులను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH3(CH2)12COOH.
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే జాజికాయ (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈ ఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనే పేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్ ఆసిడ్ అధిక శాతము సింపుల్ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తల నూనెలో మిరిస్టిక్ ఆసిడు 15% వున్నది. అధికముగా (excess) మిరిస్టిక్ ఆసిడ్‌ను ఆహరములో తీసుకున్న ఫ్లాస్మా కొలెస్ట్రాల్ పెరిగె ప్రమాదము వున్నది. సాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లలో మిరిస్టిక్ ఆసిడ్ మాత్రమే కణ మాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్ లింకు ఏర్పరచగలదు. పాల కొవ్వులలో ఈ ఆసిడ్ 8-12% వరకు వున్నది. కొబ్బరి, పామ్‌కెర్నల్ నూనెలలో కూడా 1-5% వరలు వుండును. ఈ ఫ్యాటి ఆసిడ్ నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారు చెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ ఆసిడ్‌ను క్షయికరణ చర్య (reduction) కు గురికావించి మిరిస్టి అల్డిహైడ్ (myristyl aldehyde) మరియు మిరిస్టిల్ అల్కహల్ (myristyl alcohol) ను ఉత్పన్నం చెయుదురు. తెల్లగా ఘనరూపంలో వుండును.
[మార్చు] ధర్మాలు
మిరిస్టిక్ ఆమ్లం భౌతిక, రసాయనిక ధర్మాలు
| భౌతిక స్థితి | తెల్లని ఘనస్దితి |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 52-540C |
| మరుగు ఉష్ణోగ్రత | 2500C,100mm/Hg వద్ద |
| సాంద్రత | 0.86 |
| సపొనిఫికెసన్ విలువ | 245-249 |
| కలరు | 2Y+0.2R(5.25" cell) |
మిరిస్టిక్ కొవ్వుఆమ్లంను కలిగివున్న కొన్ని నూనెలు/కొవ్వులు
| నూనె | శాతం | నూనె | శాతం |
|---|---|---|---|
| జాజికాయ | 70-75 | khakan fat | 28-45 |
| పామ్‌కెర్నల్ నూనె | 14-18 | మరోటి నూనె | 10-12 |
| కొబ్బరి నూనె | 13-19 | పామాయిల్ | 0.5-2.0 |
| మొక్కజొన్న నూనె | 0.5-1.0 | జట్రొఫా నూనె | 0.5-1.5 |
| తవుడు నూనె | 0.5-1.0 | కొకమ్ | >1.0 |
| పత్తిగింజల నూనె | >1.0 | ఒడిసలు | 1.5-3.5 |
మిరిస్టిక్ అమ్లమున్ననూనెలను ఆహరంలో అధికంగా తీసుకున్న ఫ్లాస్మా కొలెస్ట్రాల్‌పెరిగే అవకాశమున్నది.
[మార్చు] వినియాగాలు
- రబ్బరు, ప్లాస్టికులు, గ్రీజులు, ద్రవకందెనలు, మందుల తయారి, మరియు కాస్మోటిక్స్ తయారిలలో వినియోగిస్తారు.
- టాయ్‌లెట్ సబ్బుల తయారిలోను వినియోగిస్తారు.
[మార్చు] మూలాలు
- ↑ Merck Index, 11th Edition, 6246
- ↑ (2001) "Lexicon of lipid nutrition (IUPAC Technical Report)". Pure and Applied Chemistry 73 (4): 685–744. DOI:10.1351/pac200173040685.