మిర్చి (2013 సినిమా)
| మిర్చి | |
|---|---|
![]() |
|
| దర్శకత్వం | కొరటాల శివ |
| రచన | కొరటాల శివ |
| చిత్రానువాదం | కొరటాల శివ |
| తారాగణం | ప్రభాస్ సత్యరాజ్ అనుష్క రిచా గంగోపాధ్యాయ నదియా ఆదిత్య బ్రహ్మానందం |
| సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
| ఛాయాగ్రహణం | మధి |
| కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
| పంపిణీదారు | గ్రేట్ ఇండియా ఫిలింస్ (విదేశాలు)[1] |
| విడుదలైన తేదీ | ఫిబ్రవరి 8, 2013 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
మిర్చి 2013 , ఫిబ్రవరి 8 న విడుదలైన తెలుగు చిత్రం.
విషయ సూచిక |
కథ [మార్చు]
దేవా (సత్యరాజ్), లత (నదియా) ఏకైక సంతానం జై (ప్రభాస్). దేవా సొంత ఊరు గుంటూరులోని రెంటచింతల గ్రామంలో ఫ్యాక్షన్ గొడవల కారణంగా తండ్రిని పోగొట్టుకుంటాడు. వూరి ప్రజల కోసం దేవా అక్కడే ఉంటానంటాడు. అక్కడే ఉంటే తన కొడుకుని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని జై ని తీసుకుని లత హైదరాబాద్ వెళ్ళిపోతుంది. జై పెద్దయ్యాక గతం తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాడు. సొంత మరదలు వెన్నెల (అనుష్క) ప్రేమని గెలుచుకుంటాడు. ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా ఉన్న ఆ వూరికి జై వల్ల మళ్లీ సమస్యలు మొదలవుతాయి. వెన్నెలతో జై పెళ్లి నిశ్చయమై పెళ్లి జరుగుతున్న సమయంలో దేవాకి సంభందించిన శత్రువులు రాజయ్య (నాగినీడు) మనుషులు దేవా కుటుంబం మీద కాపు కాసి దాడి చేస్తారు. ఈ గొడవల్లో లత హత్యకు గురై చనిపొతుంది. లత చావుకు జై కారణమని భావించి దేవా జై ని వెళ్ళగొడతాడు.
ఆపై కథ ఇటలి దేశంలోని మిలన్ నగరంలో ప్రారంభమౌతుంది. స్వతహాగా గొడవలంటే పడని జై అక్కడ ఆర్కిటెక్ గా తన జీవితాన్ని వెళ్ళదీస్తుంటాడు. అదే సమయంలో తనకి మానస (రిచా గంగోపాధ్యాయ) పరిచయమౌతుంది. మానస రాజయ్య కుటుంబంలో ఒక వ్యక్తి. తను జై ని తొలిచూపులోనే ప్రేమిస్తుంది. జై కూడ ప్రేమించినట్టు నటించి తన ద్వారా రాజయ్య కుటుంబాన్ని కలుస్తాడు. అక్కడి బ్యాంకు మేనేజరు వీరప్రతాప్ (బ్రహ్మానందం) సహాయంతో అందరినీ అహింసా మార్గనికి చేరుస్తాడు. కానీ తను ఉమ (సంపత్ రాజ్) ని మార్చలేకపోతాడు. ఉమ ఒక సందర్భంలో జై దేవా కొడుకన్న విషయాన్ని కనిపెట్టి తీవ్రంగా గాయపరుస్తాడు. ఐతే తన తండ్రిని చంపుతానన్న మాట విన్న జై ఉక్రోషాన్ని ఆపుకోలేక తిరగబడి చివరలో తన ఆంతర్యాన్ని అందరిముందూ బయటపెడతాడు. కత్తి పట్టి నరుక్కోవడం కంటే ఒకరికి ఒకరు ప్రేమను పంచుకోవడం మంచిందన్న వాదనని ముందుంచుతాడు. ఉమ కి తన పగ తీర్చుకునే అవకాశం జై ఇచ్చినా ఉమ మారి తన తప్పు తెలుసుకుంటడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దేవా కూడా తన కొడుకు ఈ పగలకు స్వస్తిపలికించడం చూసి తన తప్పు తెలుసుకుని జై ని తనతో తీసుకెల్తాడు. ఊరి చివర కూర్చున్న వెన్నెల ను తనతో పెళ్ళీకి జై ఒప్పించడంతో కథ సుఖాంతమౌతుంది.
నటులు [మార్చు]
పాటలు [మార్చు]
అన్ని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.
| # | పేరు | Artist(s) | నిడివి | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1. | "మిర్చి" | చిన్న పొన్ను | 01:23 | ||||||
| 2. | "యాహూ యాహూ" | మికా సింగ్ | 04:40 | ||||||
| 3. | "ఇదేదో బాగుంది" | విజయ్ ప్రకాష్, అనిత | 04:26 | ||||||
| 4. | "పండగలా వచ్చావు" | కైలాష్ ఖేర్ | 04:51 | ||||||
| 5. | "బార్బీ గర్ల్" | జస్ప్రీత్, సుచిత్ర | 03:57 | ||||||
| 6. | "నీ చూపుల" | కైలాష్ ఖేర్ | 00:58 | ||||||
| 7. | "డార్లింగే" | దేవిశ్రీ ప్రసాద్, గీతా మాధురి | 03:44 | ||||||
| 24:03 | |||||||||
మూలాలు [మార్చు]
- ↑ "Great India Films bags Prabhas's Mirchi Overseas Rights". timesofap.com. Retrieved 4 నవంబరు 2012.
