మిహిరకులుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
'మిహిరకులుడు'
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
సంపాదకులు: విశ్వనాథ పావని శాస్త్రి
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
సీరీస్: కాశ్మీర రాజవంశ నవలలు
ప్రక్రియ: నవల
ప్రచురణ:
విడుదల:
దీనికి ముందు: పాతిపెట్టిన నాణెములు
దీని తరువాత: సంజీవకరణి

మిహిరకులుడు విశ్వనాథ సత్యనారాయణ కాశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని రచించిన నవల. విశ్వనాథ సత్యనారాయణ రచించిన కాశ్మీర రాజవంశ నవలలనే నవలామాలికలోనిది.

రచన నేపథ్యం[మార్చు]

కాశ్మీర రాజవంశ నవలలు[మార్చు]

కల్హణుడు రాసిన కశ్మీర రాజతరంగిణిని ఆధారం చేసుకుని విశ్వనాథ రాసిన ఆరు నవలల మాలిక. వేలయేళ్ల చరిత్రను సాధికారికంగా నిర్ధారించుకుని ఆసక్తికరమైన వర్ణనలతో కల్హణుడు 11శతాబ్దిలో రాసిన కశ్మీర రాజతరంగిణి అటు చారిత్రిక గ్రంథంగా, ఇటు కావ్యంగా ప్రాముఖ్యత పొందింది[1].
పాశ్చాత్య చరిత్ర పండితులు, వారిని అనుసరించిన భారతీయ చరిత్ర పండితులు చరిత్రలోని ఎన్నో అంశాలను విస్మరించి మన గతానికి అన్యాయం చేశారని చెప్పే విశ్వనాథ దృష్టి సహజంగానే కశ్మీర రాజతరంగిణిపై పడింది. రాజతరంగిణిలో రాసిన పలువురు రాజులు, రాణులు, వారి జీవితాలు, ఆనాటి వాతావరణాన్ని అంశంగా తీసుకుని 6 నవలల మాలికను విశ్వనాథ సృష్టించారు. కాశ్మీర రాజవంశ నవలలు ఇవి:

  1. యశోవతి
  2. పాతిపెట్టిన నాణెములు
  3. మిహిరకులుడు
  4. సంజీవకరణి
  5. కవలలు
  6. భ్రమరవాసిని

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ధర్, సోమనాథ్ (1983). కల్హణుడు (1 ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాఢమీ.