మీర్ తఖి మీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mir Taqi Mir 1786

ముహమ్మద్ తఖీ (1723 - 1810) అనే ప్రసిద్ధ ఉర్దూ కవి, తన తఖల్లుస్ కలంపేరు మీర్ తఖి మీర్ తో ఖ్యాతినొందాడు. 18వ శతాబ్దపు ఉజ్వల కవి. ఉర్దూ భాషకు వినూత్న ఒరవడిని అందించిన అగ్రగణ్యుడు. "మీర్ లేనిదే ఉర్దూ కవిత్వం సంపూర్ణం గాదు" అనే లోకోక్తి ప్రసిద్ధమైనది. ఇతడు ఆగ్రా (ఆ కాలంలో అక్బరాబాద్ అనే పేరు గలదు) లో జన్మించాడు. లక్నోలో కవిగా ప్రకాశించాడు.

గజల్ లేనిదే ఉర్దూ సాహిత్యం లేదు, కాని 'మీర్' లేనిదే గజల్ లేదు. ఉర్దూ సాహిత్యంపై మీర్ ప్రభావం అంతటిది. తన రచనలు 'కులియాతె మీర్' ఆరు దీవాన్లు గలవి. మీర్ తఖి మీర్ ను గాలిబ్ తో పోలుస్తారు. లక్నోలో అంతిమ శ్వాస విడిచాడు.

ఇతని గజళ్ళను ఎందరో గాయకులు పాడారు. చాలా హిందీ సినిమాలలో ఇతని కవితలు, గజళ్ళు ఉపయోగించారు. మీర్ ప్రభావం గాలిబ్ పై ఎంతుందో గాలిబ్ వ్రాసిన ఈ షేర్ ద్వారా తెలుస్తుంది.

రీఖ్తా కె తుమ్ ఉస్తాద్ నహీఁ హో గాలిబ్

కెహ్ తే హైఁ అగ్లే జమానే మేఁ కోయీ మీర్ భి థా

రీఖ్తా (ఉర్దూకు పాతపేరు) లో నీవే ఉస్తాద్ కాదు 'గాలిబ్', గడచిన కాలంలో 'మీర్' కూడా ఉన్నట్టు ప్రతీతి