ముక్కామల కృష్ణమూర్తి
వికీపీడియా నుండి
| ముక్కామల కృష్ణమూర్తి | |
| జన్మ నామం | ముక్కామల కృష్ణమూర్తి |
| జననం | అక్టోబర్ 10 1920 (వయసు 91) |
| మరణం | 1987, జనవరి 10 |
| ప్రముఖ పాత్రలు | బొబ్బిలి యుద్ధం |
ముక్కామలగా ప్రసిద్ధి చెందిన ముక్కామల కృష్ణమూర్తి (1920-1987) తెలుగు చలన చిత్ర నటుడు మరియు దర్శకుడు. ఈయన గుంటూరు జిల్లాలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్ధి దశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ఈయనకు తెలుగు సినిమా రంగములో ప్రతినాయక పాత్రలు బాగా పేరు తెచ్చాయి.
ముక్కామల 1952లో తన సొంత చిత్రనిర్మాణసంస్థ ప్రారంభించారు[1].
విషయ సూచిక |
[మార్చు] చిత్ర సమాహారం
[మార్చు] నటుడిగా
- ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)
- శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) .... సయ్యద్ మేనమామ
- కొండవీటి సింహం (1981)
- వంశ వృక్షం(1980)
- రామాయణంలో పిడకలవేట (1976)
- భక్త కన్నప్ప(1976) .... పెదవేమారెడ్డి
- సీతా కళ్యాణం (1976) .... విశ్వామిత్ర మహర్షి
- సీతా స్వయం వరం (1976) .... వశిష్టుడు
- ముత్యాల ముగ్గు (1975) .... కథానాయకుని మేనమామ
- శ్రీరామాంజనేయ యుద్ధం .... విశ్వామిత్ర మహర్షి
- విచిత్ర వివాహం (1973)
- అప్నాదేశ్ (హిందీ) (1972)
- బొమ్మా బొరుసా (1971)
- నిర్దోషి (1967) .... లక్ష్మి తండ్రి
- భామా విజయం (1967)
- గూఢచారి 116 (1967)
- శ్రీకృష్ణావతారం (1967) .... కంసుడు
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967) .... మహారాజు
- పరమానందయ్య శిష్యుల కథ (1966) .... మంత్రి శివానందం
- బభృవాహన (1964)
- బొబ్బిలి యుద్ధం (1964) .... జనరల్ బుస్సీ
- నర్తనశాల (1963) .... విరాటరాజు
- శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) .... దుర్యోధనుడు
- మహామంత్రి తిమ్మరుసు (1962)
- జగదేకవీరుని కథ (1961) .... మహారాజు
- ఉషా పరిణయం (1961)
- జయభేరి (1959) .... ధర్మాధికారి
- రాజ మకుటం (1959)
- అప్పుచేసి పప్పుకూడు (1958) .... రావుబహుద్దూర్ రామదాసు తండ్రి
- మాయా బజార్ (1957) .... దుర్యోధనుడు
- సారంగధర (1957)
- తెనాలి రామకృష్ణ (1956) .... తాతాచార్యులు
- రాణి రత్నప్రభ (1955)
- రేచుక్క (1954)
- ధర్మదేవత (1952) .... రఘునాథవర్మ
- ప్రేమ (1952) .... పరశురాం
- నిర్దోషి (1951) .... విజయ్
- స్వప్న సుందరి (1950)
- లైలా మజ్ను (1949) మొదటి చిత్రం
[మార్చు] దర్శకునిగా
- మరదలు పెళ్ళి (1952)
- ఋష్యశృంగ (1961)