ముడి చమురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భూమిలో ముడి చమురు నిక్షేపాలు భూమిమీద, నీటిలో జీవించే ఆల్గే (నాచు), ప్లాంక్‌టన్‌ (పూలు పూయని నీటి మొక్కలు) చనిపోవడం ద్వారా తయారవుతోంది. ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోయిన తరువాత ఇవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురవుతాయి. ఇలా కొన్ని లక్షల, కోట్ల సంవత్సరాల పాటు భూమి లోపలి పొరలలో జరిగే మార్పులకు లోనై హైడ్రోకార్బన్స్‌ (ముడి చమురు అణువులు) గా రూపాంతరం చెందుతాయి. హైడ్రోకార్బన్స్‌ అంటే.. ఉదజని, కర్బన సమ్మిళిత పదార్థం. ఇదే ముడి చమురుకు మూలం. మూడి చమురులో బ్యూటేన్ ‌, ప్రొపేన్‌ అనే పదార్థాలు ఉంటాయి. ఆల్గే, ప్లాంక్‌టన్‌ చనిపోవడం ద్వారా అవి భూమి లోపలి పొరలలో కలిసిపోయి అక్కడ తీవ్రమైన ఉష్ణోగ్రత, ఒత్తిడికి గురయి సహజసిద్ధంగా ఏర్పడే ముడి చమురు నిల్వలు పూర్తిగా అయిపోతే అప్పుడు మానవ జీవనమే స్తంభిస్తుంది. ఆ ప్రమాదం రాకమునుపే కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించేందుకు దశాబ్దాల తరబడి శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భూమి లోపలి పొరలలో దాదాపు 100 కిలోమీటర్ల లోతున మీథేన్‌ వాయువు (సహజ వాయువుకు ఇదే ప్రధానం) ను 1200 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతకు తీసుకెళ్లడం ద్వారా కృత్రిమంగా హైడ్రోకార్బన్స్‌ను సృష్టించవచ్చు. ఆ ఉష్ణోగ్రత వద్ద మీథేన్‌ వాయువు ఈథేన్‌, బ్యూటేన్‌, ప్రొపేన్‌, మాలిక్యులార్‌ హైడ్రోజన్‌, గ్రాఫైట్‌లుగా విడిపోతాయి. మళ్లీ ఈథేన్‌ను లేజర్‌ కిరణాల ద్వారా అదే ఉష్ణోగ్రతకు తీసుకెళ్లినప్పుడు అది మీథేన్‌గా మారుతుంది. బ్యూటేన్‌, ప్రొపేన్‌లు ముడి చమురుకు మూలమైన పదార్థాలు. భూమి ఉపరితలం నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల లోతున ఉండే ఉష్ణోగ్రత వద్ద ఆల్గే, ఫ్లాంక్‌టన్‌లతో సంబంధం లేకుండానే హైడ్రోకార్బన్స్‌ తయారవుతాయి. ఇలా తయారైన హైడ్రోకార్బన్స్‌ను అక్కడి క్రస్ట్‌ పొరలలో పగుళ్లు మధ్యన ఉండే తీవ్రమైన ఒత్తిడి పైకి నెట్టివేస్తూ ఉంటుంది. ఈ చమురు నిక్షేపాలనే వెలికితీసి, శుద్ధి చేసుకుని, పెట్రోలు, డీజిలుగా మార్చుకుని ఉపయోగించుకుంటున్నాం. భూమి మధ్యలోని 'కోర్‌' పొరలకు, భూ ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల దిగువు నుంచి మొదలయ్యే 'క్రస్ట్‌' పొరలకు మధ్యన మరికొన్ని కిలోమీటర్ల పాటు విస్తరించి ఉండే 'మాంటెల్‌' పొరల నడుమ ఉండే పగుళ్లలో చమురు నిల్వలు ఉన్నాయి. భూమిలోని మాంటెల్‌ పొరలలో ఉద్భవించే హైడ్రోకార్బన్స్‌ అక్కడి పొరలలో ఉండే విపరీతమైన ఒత్తిడి కారణంగా క్రస్ట్‌ పొరలలోకి చేరి చమురు, సహజ వాయు నిక్షేపాలుగా రూపాంతరం చెందుతున్నాయి.