ముత్తులక్ష్మి రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముత్తులక్ష్మి రెడ్డి
జననంముత్తులక్ష్మి నారాయణ సామి
1886, జులై 30
పుదుక్కోటై , మద్రాస్ రాష్ట్రం, భారతదేశం
మరణం1968 , జులై 22
జాతీయతఇండియన్
విశ్వవిద్యాలయాలుమద్రాస్ వైద్య కళాశాల
వృత్తిరచయిత్రి,సామాజ సేవకురాలు, రాజకీయ వేత్త,
భార్య / భర్తడా. సుందర రెడ్డి
పిల్లలుడా. తయుమానవన్
తండ్రిశ్రీ నారాయణ సామి
తల్లిశ్రీమతి చంద్రమ్మాళ్

ముత్తులక్ష్మి రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి, భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలు. .

బాల్యం[మార్చు]

ముత్తులక్ష్మి రెడ్డి గారు 1886వ సంవత్సరం జూలై నెల 30 వ తేదీన పుదుక్కోటై సంస్ఠానంలో నారాయణ సామి, చంద్రమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఆడ పిల్లల చదువుకు ఆంక్షలు ఉన్న ఆ కాలం లోనే ముత్తులక్ష్మి రెడ్డి గారు 1912వ సంవత్సరంలో మద్రాస్ వైద్య కళాశాల నుండి వైద్య పట్టా అందుకున్నరు.

సామాజిక సేవ[మార్చు]

శ్రీమతి సరోజిని నాయుడు గారి ప్రేరణతో వీరు స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నతికై పోరాడారు. వీరి సేవలను మెచ్చి నాటి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వము శాసన మండలి సభ్యురాలిగా వీరిని 1927వ సంవత్సరంలో నియమించారు. ఆ విధంగా భారతదేశపు మొట్ట మొదటి మహిళా శాసన సభ్యురాలయ్యారు. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు. 1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు. గాంధీ గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.[1][2]

స్త్రీధర్మ[మార్చు]

ఈమె మహిళాభ్యుదయం కొరకు "స్త్రీధర్మ" అనే పత్రికను నడిపారు. దీనిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం నాలుగు భాషలలో రచనలు ఉండేవి[3].

స్వాతంత్ర్యానంతరం[మార్చు]

ప్రస్తుతం భారతదేశంలోనే అగ్రగామి కాన్సర్ వైద్యశాలగా వెలుగొందుతున్న అడయార్ కాన్సర్ వైద్యశాలను ముత్తులక్ష్మి రెడ్డి గారు 1954వ సంవత్సరంలో ప్రారంభించారు. 1956వ సంవత్సరంలో భారత ప్రభుత్వము వీరిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది.

మూలాలు[మార్చు]

  1. http://www.iicdelhi.nic.in/publications/uploads_diary_files/22612January212013_IIC%20Occasional%20Publication%2044.pdf[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-03-19. Retrieved 2014-03-13.
  3. పసుమర్తి, కృష్ణమూర్తి. "శ్రీమతి డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి అమ్మాళ్". గృహలక్ష్మి కంఠాభరణం. మద్రాసు: కె.ఎన్.కేసరి. pp. 138–140. Retrieved 2018-07-27.[permanent dead link]