ముత్యాలముగ్గు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ముత్యాలముగ్గు (1975) | |
| దర్శకత్వం | బాపు |
|---|---|
| నిర్మాణం | మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు |
| తారాగణం | శ్రీధర్ , సంగీత, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్,మాడా, బేబీ రాధ, మాస్టర్ మురళి |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| గీతరచన | సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ, ఆరుద్ర |
| నిర్మాణ సంస్థ | శ్రీ రామ చిత్ర |
| భాష | తెలుగు |
ఇది తెలుగు సినిమా ఫ్రేక్షకులు చిరకాలం గుర్తుంచుకోవలసిన ఆణిముత్యం. బాపు దర్శకత్వం, ముళ్ళపూడి వెంకటరమణ మాటలు, ఇషాన్ ఆర్య ఛాయాగ్రహణం, కోన సీమ అందాలు, తెలుగు బాష యాసలు - అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక మేలు ముత్యంగా తెలుగువారికి అందజేశాయి. ఇది బాపు దర్శకత్వానికి ఒక మైలురాయి. రావు గోపాలరావు నటనలో ఒక కలికితురాయి.
ఈ చిత్రంలో ఉత్తర రామాయణం కథ అంతర్లీనంగా కనిపిస్తుంది. ఒక ధనికుల కుర్రాడు అనుకోకుండా ఒక పేదింటి పిల్లను పెళ్ళి చేసుకొంటాడు. ఆ జమీందారు ఆస్తిపై కన్నేసిన ఆ కుర్రాడి మేనమామ వారి సంసారాన్ని విడదీయడానికి ఒక గుమాస్తా (అల్లు రామలింగయ్య) తో కలిసి ఒక దళారీ (రావు గోపాలరావు - కంట్రాక్టరు)తో ఒప్పందం కుదుర్చుకొంటాడు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు.
విషయ సూచిక |
[మార్చు] హిట్టయిన పాటలు
- ఏదో ఏదో అన్నది, ఈ మసక వెలుతురు, గూటిపడవలో విన్నది, కొత్త పెళ్ళి కూతురు (గాయకుడు వి.రామకృష్ణ హిట్టయిన పాటలలో ఎంపిక చేయవలసిన పాట)
- నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నులలో నీరు తుడిచి కమ్మని కథ చెప్పింది. (గుంటూరు శేషేంద్రశర్మ రాసిన ఏకైక చిత్రగీతం)
- ఎంతటి రసికుడవో తెలిసెరా.... ఎంతసేపు నీ తుంటరి చూపు
- ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయా, మత్తైదు కుంకుమా బ్రతుకంత ఛాయా - పి.సుశీల
- శ్రీరామ జయరామ సీతా రామ (బాలమురళీకృష్ణ)
[మార్చు] హిట్టయిన "డవలాగులు"
ఈ సినిమాలో పాటలకంటే సంభాషణలు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఒకటి కాదు. దాదాపు అన్నీను. వాటిని తూర్పు గోదావరి యాసలో రావుగోపాలరావు చెప్పిన తీరు తెలుగువారికి సాహిత్యంలో భాగమై పోయింది.
- అల్లొల్లొల్లొ - జోగినాధం గారా
- సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటది?
- అబ్బో ముసలాడు రసికుడేరా!
- సెరిత్ర సెరిపేసత్తే సెరిగిపోదు. సింపేత్తే సిరిగి పోదు.
- ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా
- ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త
అయితే ఒక్కసారి వచ్చిన మాడా "డవలాగులు" ఊరూరా మోగిపోయాయి
- మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత?కాలు చెయ్యితీయడానికీ, మెడిసిన్ సీటుకీ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెసను ఉంటుందా?
రావుగోపాలరావు సంభాషణలే కాకుండా కాంతారావు,సంగీత లకు రాసిన సంభాషణలు మనసుకు హత్తుకొనేవి చాలాఉన్నాయి.
- వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది.నాకు మనుషులమీదే నమ్మకంపోయింది.(కాంతారావు ముక్కామల తో)
- సిఫార్సులతొ కాపురాలు చక్కబడవు.(సంగీత కాంతారావు తో)
- మీరూ ఇక్కడే ఉండండి నాకు ముగ్గురు పిల్లలనుకుంటాను.(సంగీత కాంతారావు తో)
[మార్చు] సినిమా బొమ్మల కొలువు
[మార్చు] వనరులు
- లో వ్యాసం, చిత్రాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.