ముద్దుల మేనల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్దుల మేనల్లుడు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
నిర్మాణం యస్.గోపాలరెడ్డి
తారాగణం నందమూరి బాలకృష్ణ,
విజయశాంతి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ముద్దుల మేనల్లుడు 1990 లో వచ్చిన తెలుగు సినిమా. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై, కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. [1] [2] ఈ చిత్రం తమిళ చిత్రం తంగమన రాసాకు రీమేక్.

కథ[మార్చు]

తరతరాలుగా రెండు కుటుంబాల మధ్య ఉన్న స్పర్థను ఈ చిత్రం చూపిస్తుంది. ప్రస్తుతం, మాధవ రావు (నాసర్) & రాజా (నందమూరి బాలకృష్ణ) ఆ కుటుంబాల వారసులు. వారు ఒకే ప్రాంగణంలో, మధ్య గోడ కట్టి నివసిస్తున్నారు. వారి మాట ఆ ప్రాంతంలో వేదవాక్కు. రాజేశ్వరీ దేవి (జయంతి) వారి మేనత్త. ఆమె ఎప్పుడూ వారి మధ్య ఉన్నసంఘర్షణను పరిష్కరించడానికి, వారిని తిరిగి కలపడానికీ ప్రయత్నిస్తూంటూంది. ఆమె పెద్ద కుమార్తె పార్వతి (సంగీత) ని మాధవరావు పెళ్ళి చేసుకున్నాడు. చిన్న కుమార్తె శాంతి (విజయశాంతి) తో రాజా ప్రేమలో ఉన్నాడు. రాజా మంచి స్వభావం గలవాడు. రాజేశ్వరి దేవికి స్నేహశీలియైనవాడు. మాధవరావును తన పెద్దవాడిగా గౌరవిస్తాడు కాని అతను శత్రుత్వాన్ని మాత్రం కొనసాగిస్తాడు. వారి మధ్య ఎప్పుడూ వివాదాలు తలెత్తుతూంటాయి. ఇంతలో, రాజేశ్వరి దేవి రాజా, శాంతి ల పెళ్ళి కోసం ప్రణాళికలు వేసుకుంటుంది. దీనిని మాధవ రావు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు .వారు ముందుకు సాగితే తన భార్యను విడిచిపెడతానని హెచ్చరిస్తాడు. అప్పుడు, రాజా తన సోదరుడు అంగీకరించే వరకు ఆమెను పెళ్ళి చేసుకోనని ధ్రువీకరిస్తాడు. తరువాత పార్వతి ఇంటిని వదిలి వెళ్ళి వారి పెళ్ళి జరిపిస్తుంది. మాధవరావు దురాగతాలు రోజురోజుకు పెరుగుతున్నాయి రాజా అతని నుండి అన్ని అధికారాలను తీసుకుంటాడు. కక్ష పెట్టుకున్న మాధవ రావు ఆ ప్రాంతానికి అవినీతిపరుడైన పోలీసు అధికారిని తీసుకువస్తాడు. కాని రాజా అతనికి బదులు చెల్లించేస్తాడు. అంతేకాకుండా, మాధవరావు సోదరి సుమతి (శారద ప్రీత) పాఠశాల ఉపాధ్యాయుడు రఘు (వసంత) ను ప్రేమిస్తుంది. మాధవ రావు వారిని వేరు చేయడానికి ప్రయత్నించగా, రాజా వారికి అండగా నిలుస్తాడు. ఈ సమయంలో, రాజా తన సోదరిగా భావించే స్నేహితురాలు రాధ (లతాశ్రీ) అక్కడికి వస్తుంది. దుష్ట మాధవరావు వారి మధ్య అక్రమ సంబంధాన్ని ఆపాదిస్తాడు. దీనిని వాడుకుంటూ, పోలీసు అధికారి రాధను చంపి, ఆ నేరాన్ని రాజాపై తోస్తాడు. అతను శాంతిని వేశ్యగా చిత్రీకరిస్తాడు. ఆమెను పట్టుకోవటానికి అతడు వెళ్ళినపుడు రాజేశ్వరి దేవి అతన్ని చంపేస్తుంది. సోదరులను ఏకం చేయడానికి ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సమయంలో, రాజా జైలు నుండి తప్పించుకుని, రఘుతో సుమతి పెళ్ళి చేస్తానని రాజేశ్వరి దేవికి హామీ ఇస్తాడు. అజ్ఞాతంలో ఉంటూ రాజా, పెళ్ళికి ఏర్పాట్లు చేస్తాడు, అయితే మాధవ రావు వాటిని అడ్డుకుంటాడు. ఆ సమయంలో, మాధవరావు తీవ్రంగా గాయపడతాడు. రాజా తన రక్తాన్ని ఇచ్చి అతణ్ణి కాపాడతాడు. ఇది అతని తప్పును గ్రహించేలా చేస్తుంది. చివరగా, కుటుంబం తిరిగి కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

  • నందమూరి బాలకృష్ణ
  • విజయశాంతి
  • నాజర్
  • జయంతి
  • బ్రహ్మాజీ
  • బాలాజీ
  • మాడా
  • సంగీత
  • లతాశ్రీ
  • బాబూమోహన్
  • కెకె శర్మ
  • వసంత్
  • ప్రసన్న కుమార్
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • చిడతల అప్పారావు
  • దమ్
  • అనిత
  • శారద ప్రీత్
  • కల్పనారాయ్.

సాంకేతిక సిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."పరువాల చిలకలా"వెన్నెలకంటిఎస్.పి.బాలు, చిత్ర4:13
2."టాటా చెప్పాలోయి"వెన్నెలకంటిఎస్.పి.బాలు, శైలజ4:13
3."పండగొచ్చెనమ్మ"సినారెఎస్.పి.బాలు, చిత్ర4:51
4."ముత్యాల పందిరిలో"వెన్నెలకంటిఎస్.పి.బాలు, చిత్ర3:53
5."నొప్పిగుంది"వెన్నెలకంటిఎస్.పి.బాలు, చిత్ర4:44
6."ద్వాపర యుగమున"సినారెఎస్.పి.బాలు3:42
Total length:25:48

మూలాలు[మార్చు]

  1. "Muddula Menalludu (1990)". The Cine Bay. Archived from the original on 2019-03-27. Retrieved 2020-08-21.
  2. "Mudhdhula Menalludu". gomolo. Archived from the original on 2017-07-12. Retrieved 2020-08-21.