మున్నేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మున్నేరు
నది
ఖమ్మం పట్టణంలో మున్నేరుపై రెండు వంతెనలు
దేశం భారతదేశం
ఉపనదులు
 - ఎడమ వైరా నది
 - కుడి ఆకేరు
Source పాకాల సరస్సు
 - ఎత్తు 238 m (781 ft)
Mouth కృష్ణానది
 - location కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
 - ఎత్తు 0 m (0 ft)
మున్నేరు దృశ్యం.

మున్నేరు కృష్ణా నదికి ఉపనది.[1][2]

మున్నేరు వరంగల్ జిల్లా, పాకాల సరస్సు వద్ద పుట్టి, ఖమ్మం, నల్గొండ, ఎన్టీఆర్ జిల్లాల గుండా ప్రవహించి, పులిచింతలకు 20 కి.మీ. దిగువన కృష్ణానదిలో కలుస్తుంది. ఆకేరు, వైరా నదులు మున్నేరు ప్రధాన ఉపనదులు.[3] మున్నేరు సముద్రమట్టం నుండి 238 మీటర్ల ఎత్తున ప్రారంభమై కృష్ణానదిలో కలిసేసరికి మొత్తం 195 కి.మీ. దూరం ప్రవహిస్తుంది. మున్నేరు పరీవాహక ప్రాంతపు వైశాల్యం 10,490 చ.కి.మీ.లు.[4] ఆకేరు ఖమ్మం గ్రామీణ మండలంలోని తీర్థాల గ్రామం వద్ద మున్నేరులో కలుస్తుంది. వైరా నది దక్షిణానికి ప్రవహించి కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలంలోని కీసర వద్ద మున్నేరులో కలుస్తుంది.

మున్నేరు ఖమ్మం పట్టణపు శివార్లలోని దానవాయిగూడెం నుండి ప్రవహిస్తుంది. ఖమ్మం పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా మున్నేర నదినుండి జరుగుతుంది.పూర్వపు ఖమ్మం జిల్లా, ప్రస్తుత మహబూబాబాదు జిల్లా లోని గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేటిపై మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించబడింది.

మున్నేరును ఆనుకొని పెనుగంచిప్రోలు సమీపంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ తిరుపతమ్మ అమ్మ వారి దేవస్థానం (పెనుగంచిప్రోలు) ఉంది.[5]

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Godavari, Krishna tributaries in spate - The Hindu August 18, 2013
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-02. Retrieved 2014-03-15.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-24. Retrieved 2014-03-15.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2014-03-15.
  5. "About Temple | Temple Info | TAPGPL". tms.ap.gov.in. Archived from the original on 2021-09-10. Retrieved 2021-09-10.
"https://te.wikipedia.org/w/index.php?title=మున్నేరు&oldid=3621939" నుండి వెలికితీశారు