ముప్పవరపు వెంకయ్య నాయుడు
| వెంకయ్య నాయుడు | |
|
|
|
| నియోజకవర్గము | ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం (1978-1985) |
|---|---|
|
|
|
| జననం | జూలై 1 1949 (వయసు 63) చవటపాలెం, నెల్లూరుజిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
| రాజకీయ పార్టీ | |
| భార్య/భర్త | ఉష |
| సంతానము | ఒక కుమారుడు, ఒక కూతురు |
| జూన్ 24, 2008 | |
భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన ముప్పవరపు వెంకయ్య నాయుడు (M.Venkaiah Naidu) 1949, జూలై 1న ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో చవటపాలెం గ్రామంలో జన్మించాడు. నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయము నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. 2002లో జానా కృష్ణమూర్తి తరువాత భాజపా అధ్యక్ష పదవిని చేపట్టి 2004, అక్టోబర్ 18 వరకు ఆ పదవిలో తన సేవలందించాడు. రెండు సార్లు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. భాజపాకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నాడు. మే 8, 2010న శాసనసభలో, రాజ్యసభలో, భాజపా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్రబృందం "అలుపెరుగని గళం విరామమెరుగని గళం." పేరుతో సంకలనం చేసి విడుదల చేయించారు.[1]
విషయ సూచిక |
బాల్యం విద్యాభ్యాసం [మార్చు]
1942, జూలై 1 న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్య, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్యనాయుడు నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందినాడు. విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డాడు.[2] ముఖ్యంగా సమాజంలో అణగారిన వర్గాల కొరకు మరియు రైతుకుటుంబాలకొరకు అతడు కృషిచేశాడు. రాజకీయ మరియు సామాజిక కార్యకలాపాలలో కూడా అతనిలో అప్పుడే బీజాలు పడ్డాయి. స్వలాభం కొరకు కాకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన దేశభక్తుల మరియు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళమెత్తిన నాయకుల జీవితాలను ఆదర్శంగా తీసుకున్నాడు. అత్యవసర పరిస్థితి కాలంలో అనేక మాసాలు జైలు జీవితం గడిపినాడు.
రాజకీయ జీవితం [మార్చు]
1973-74లో ఆంధ్ర విశ్వవిద్యాలయపు విద్యార్థినాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు ఏర్పడ్డాయి. 1977 నుంచి 1980 వరకు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అదే సమయంలో 1978లో తొలిసారిగా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనాడు. 1980 నుంచి శాసనసభలో భాజపా శాసనసభాపక్ష నేతగా వ్యవహరించాడు. 1983లో మళ్ళీ అదే స్థానం నుంచి రెండో పర్యాయం శాసనసభ్యుడుగా ఎన్నికై 1985 వరకు కొనసాగినాడు. 1980లో అఖిల భారతీయ జనతా పార్టీ యువ విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1985లో భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించబడి 1988 వరకు కొనసాగి ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1993నుండి భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాడు. 1998లో రాజ్యసభకు ఎన్నుకోబడినాడు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పనిచేసినాడు. 2002 జూలై 1 నుంచి 2004, అక్టోబర్ 5 వరకు భాజపా అధ్యక్షపదవిలో సేవలందించి మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడు. [3] 2005 ఏప్రిల్ లో భాజపా ఉపాధ్యక్షపదవిని స్వీకరించాడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
ప్రమాదాలు [మార్చు]
రెండు సార్లు వెంకయ్యనాయుడికి తృటిలో పెద్ద ప్రమాదాలు తప్పాయి. 2005, జనవరి 29న బీహార్ లోని గయ పర్యటనలో ఉండగా మావోయిస్టులు అతని హెలికాప్టర్ కు నిప్పంటించారు. అప్పడు నాయుడు ఎన్నికల సభలో ప్రసంగిస్తున్నాడు. వెంటనే తేరుకొని తప్పించుకున్నాడు. మరోసారి 2007, జూలై 15న ఉత్తర ప్రదేశ్ లోని లక్నో విమానాశ్రయం సమీపంలో అతను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందికి దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు.
వ్యక్తిగత జీవితం [మార్చు]
1971, ఏప్రిల్ 14న వెంకయ్య నాయుడు వివాహం చేసుకున్నాడు. భార్య పేరు ఉష. వారి సంతానం ఒక కుమారుడు మరియు ఒక కూతురు నాన్నరు
బయటి లింకులు [మార్చు]
- "Venkaiah Naidu escapes bid on life" - newkerala article dated January 29, 2005
- "Naxals blow up Venkaiah Naidu's chopper" - expressindia.com article dated January 29, 2005
- Naidu hompeage at Parliament of India
బయటి లింకులు [మార్చు]
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 09-05-2010
- ↑ http://www.bjp.org/leader/July%200102a.htm
- ↑ http://www.wowtelugu.com/Telugupeople/Politicians/venkaiahnaidu.asp
|
|||||