మురళీకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మురళి కృష్ణ
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం వి.వెంకటేశ్వర్లు
కథ పి.రాధ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జమున
శారద
హరనాథ్
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల,
ఎస్.జానకి
గీతరచన ఆచార్య ఆత్రేయ,
సి.నారాయణరెడ్డి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం మాధవ్ బుల్ బులే
కూర్పు ఆర్.హనుమంతరావు
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

అపార్ధాలు, సమాచారలోపం (Communication gap) వల్ల జరిగే అనర్ధాలు, వర్యవసానాలు ఈ చిత్రం కథాంశం. ఈ చిత్రంలో పాటలు ఆపాతమధురాలు..సంగీతం జనాదారణ పొందింది కానీ, చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు.ఈ చిత్రంలో పాత్రలన్నీ మంచి స్వభావం గల పాత్రలే... దుష్ట స్వభావం గలిగిన పాత్రలు లేవు. కానీ, భార్య పట్ల అనురాగం ఎక్కువైన భర్త, భార్యను అర్ధం చేసుకోక భార్య బ్రతకాలని భార్యను వదిలి ఆమెకు మనోవ్యధ కలిగించి తనకు కష్టం కలిగించుకుంటాడు.

చిత్రకథ[మార్చు]

మురళి (జమున) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ భయంకర్ (ఎస్.వి.రంగారావు) గారాల పట్టి. ఆమె కృష్ణ అనే్ డాక్టర్ (అక్కినేని నాగేశ్వరరావు) పరస్పరం ప్రేమించుకుంటారు. వివాహం నిశ్చయ మపుతుంది. ఆమె స్నేహితురాలు లత (శారద) మేన మామని ఆయన పెద్ద కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. ఒక చిత్రలేఖన ప్రదర్శనలో లక్ష్మీకాంతం (హర్నాధ్) అనే చిత్ర కారుని చిత్ర కారిణిగా భ్రమించి కలం స్నేహం సాగిస్తుంది. అతడు పురుషుడని తెలిసిన తరువాత స్నేహితులురాలిని అతనికి చేరువ చేసే ఉద్దేశంతో కలం స్నేహం కొనసాగిస్తుంది. వివాహమైన పిమ్మట డాక్టర్ కృష్ణ కలకత్తా వెళతాడు. లక్ష్మీకాంతం, కృష్ణతో మురళి అనే ఆమె అతనితో కలం స్నేహం చేస్తోందని ఆమెను ప్రేమిస్తునాన్నని, ఆమె కూడా అతనిని ప్రేమిస్తోందని చెబుతాడు. అతడు తిరిగి వ్చే సమయానికి మురళి, లక్ష్మీకాంతానికి ఉత్తరం రాస్తూ ఉండడం గమనించి ఆమెను వదిలి వెళతాడు.. మారుమూల ప్రాంతంలో వైద్య సహకారం అందిస్తూ ఉండాడు వివాహ సమయంలో వరుడు మరణించడం త అభాగ్యురాలిగా ముద్ర వేయించుకున్న యువతి (గీతాంజలి). కూతురి దురదృష్టానికి కుములుతున్న ఆమె తండ్రి (గుమ్మడి వెంకటేశ్వరరావు) ఒంటరిగా ఉన్న కృష్ణ ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుందని తలుస్తాడు. లక్ష్మీకాంతం లతల వివాహం జరిగింది. తండ్రి మరణించడంతో భర్తను వెతుక్కుంటూ మురళి కూడా అక్కడికి చేరుకుంటుంది. అపార్దాలు తొలిగి మురళి, కృష్ణ ఒకటౌతారు.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఊ అను ఊఊ అను అవునను అవునవునను నా వలపంతా నీదని నీదేనని (రచన: సి. నారాయణరెడ్డి; గాయకులు: ఘంటసాల, పి. సుశీల)
  2. ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమే నే కోరుతున్నా (రచన: ఆత్రేయ; గాయకులు: ఘంటసాల)
  3. ఏమని ఏమని అనుకుంటున్నది (రచన: ఆత్రేయ; గాయని: పి.సుశీల)
  4. కనులు కనులు కలిసెను కన్నె వయసు పిలిచెను (రచన: సి. నారాయణరెడ్డి; గాయకుడు: ఘంటసాల)
  5. మోగునా ఈ వీణ (రచన: ఆత్రేయ; గాయని: ఎస్.జానకి)
  6. వస్తాడమ్మా నీదైవము వస్తుందమ్మా వసంతము (రచన: ఆత్రేయ; గాయని: పి.సుశీల)

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.

బయటి లింకులు[మార్చు]