ముషాయిరా

వికీపీడియా నుండి

ముషాయిరా (ఉర్దూ: مشاعره) షాయరోఁ కి మెహఫిల్ కవిసమ్మేళనం, కవులు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించే వేదిక. ఈ ముషాయిరా తరహి కావచ్చు, గైర్ తరహి గావచ్చు. నాతియా గావచ్చు, లేదా గజల్ ముషాయిరా గావచ్చు, లేదా మజాహియా ముషాయిరా (హాస్య కవిసమ్మేళనం) గావచ్చు. తరహి ముషాయిరా కవుల మధ్య చాలా పోటాపోటీ వుంటుంది సుమా.

[మార్చు] ముషాయిరా రకాలు

  • తరహి ముషాయిరా : నిర్వాహకులచే ఇవ్వబడిన తరహీమిస్రానుసారంగా కవితలను రచించి వినిపించే ముషాయిరా.
  • గైర్ తరహి ముషాయిరా: ఏలాంటి తరహి మిస్రా ఇవ్వబడదు, కవి తన కవితలను స్వతంత్రంగా వినిపించే ముషాయిరా.
  • నాతియా ముషాయిరా: ఈ ముషాయిరాలో నాత్ లు మాత్రమే వినిపిస్తారు.
  • గజల్ ముషాయిరా: ఈ ముషాయిరాలో కేవలం గజల్ లు మాత్రమే వినిపిస్తారు.
  • ఆలమి ముషాయిరా: ప్రపంచ నలుమూలలనుండి కవులను ఆహ్వానించి నిర్వహించే ముషాయిరా.
  • కుల్ హింద్ ముషాయిరా: భారతదేశం నలుమూలలనుండి కవులను ఆహ్వానించి నిర్వహించే ముషాయిరా.
  • రియాసతీ ముషాయిరా: రాష్ట్రం నలుమూలలనుండి కవులను ఆహ్వానించి నిర్వహించేముషాయిరా.
  • మఖామీ ముషాయిరా: ప్రాంతీయ కవులను ఆహ్వానించి నిర్వహించే ముషాయిరా.

ఈ ముషాయిరా లో కవులు తమ కవిత్వాన్ని తరన్నుమ్ లో(రాగయుక్తంగా) గాని తహత్ (సాదా) లో గాని వినిపించవచ్చు.

ఈ ముషాయిరా ను నిర్వహించేవాడిని నాజిమ్-యె-ముషాయిరా అంటారు.

కొందరు ప్రముఖ నాజిమ్-యె-ముషాయిరా లు: అన్వర్ జలాల్ పురి, అస్లం ఫర్షోరి, షఫీఖ్ ఆబిది బెంగలూరు, అసర్ సిద్దీఖి మాలెగాఁవ్, సత్తార్ సాహిర్ తిరుపతి, నిసార్ అహ్మద్ సయ్యద్ మదనపల్లె.

[మార్చు] సమకాలీన ముషాయిరా కవులు

అహ్మద్ ఫరాజ్, నిదా ఫాజిలి, మునవ్వర్ రానా, బషీర్ బదర్ , వసీమ్ బరేల్వి, మాజిద్ దేవ్ బంది, గుల్జార్ దెహల్వి, రాహత్ ఇందోరి, మన్ జర్ భోపాలి, ముంతాజ్ రాషిద్ ముంబాయి, షఫీఖ్ ఆబిది బెంగలూరు, సత్తార్ సాహిర్ తిరుపతి, నిసార్ అహ్మద్ సయ్యద్ మదనపల్లె, సాగర్ జయ్యది, న.మ.జాలిబ్, సాఖి కడప.

[మార్చు] కొందరు హాస్య కవులు

రవూఫ్ రహీం హైదరాబాద్, షాదాబ్ బేధడక్ చెన్నై, పాగల్ ఆదిలాబాది.


పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు