ముస్తఫా కమాల్ అతాతుర్క్
| ముస్తఫా కమాల్ అతాతుర్క్ | |
|
మొదటి టర్కీ అధ్యక్షుడు
|
|
|---|---|
| పదవీ కాలము 29 అక్టోబరు 1923 – 10 నవంబరు 1938 |
|
| తరువాత | ఇస్మత్ ఇనోను |
|
మొదటి టర్కీ ప్రధానమంత్రి
|
|
| పదవీ కాలము 3 మే 1920 – 24 జనవరి 1921 |
|
| తరువాత | ఫెయూజి చక్మక్ |
|
మొదటి పార్లమెంటు స్పీకర్లు
|
|
| పదవీ కాలము 24 ఏప్రిల్ 1920 – 29 అక్టోబరు 1923 |
|
| తరువాత | అలీ ఫతెహి ఒక్యార్ |
|
మొదటి ఆర్.పీ.పీ. నాయకుడు
|
|
| పదవీ కాలము 1919 – 1938 |
|
| తరువాత | ఇస్మత్ ఇనోను |
|
|
|
| జననం | మే 19 1881 సెలానిక్ (థెస్సలోనికీ) |
| మరణం | నవంబరు 10, 1938 (వయసు 57) దొలంబాచే సౌధం, ఇస్తాంబుల్ |
| జాతీయత | టర్కిష్ |
| రాజకీయ పార్టీ | రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ |
| భార్య/భర్త | లతీఫే ఉసక్‌లిగిల్ (1923–25) |
| మతం | ఇస్లాం[1][2][3] |
| సంతకం | |
ముస్తఫా కమాల్ అతాతుర్క్ (ఆంగ్లం : Mustafa Kemal Atatürk) (మే 19 1881 - నవంబరు 10) ఒక టర్కిష్ సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "టర్కీ జాతిపిత " గా అభివర్ణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మొదటి అధ్యక్షుడు.
ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. గల్లిపోలీ యుద్ధం లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని పేరుగాంచాడు.[4] ఉస్మానియా సామ్రాజ్యం అల్లైస్ సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ టర్కిష్ జాతీయ ఉద్యమం నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. అంకారాను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన ధీటైన రాజకీయ సైనిక చాతుర్యాలతో రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ని స్థాపించగలిగాడు.
ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర సెక్యులర్ రాజ్యంగా తీర్చిదిద్దాడు.
విషయ సూచిక |
అతాతుర్క్ సంస్కరణలు [మార్చు]
- లిపి సంస్కరణ :నవంబర్ 1, 1928 నుండి టర్కీభాషకు కొత్త అక్షరమాల ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉలేమాల పరిధిలో మాత్రమే పరిమితంగా ఉన్న పార్శీ -అరబిక్ లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన లాటిన్ లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8అచ్చులు ,21హల్లులు తో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన భాష చదవటం రాయటం సులభమై అక్షరాస్యత పెరిగింది.
కమాలిజం [మార్చు]
ఇవీ చూడండి [మార్చు]
పాదపీఠికలు [మార్చు]
- ↑ Kinross, Atatürk: The Rebirth of a Nation, Related pages: 4, 6, 216, 217, 386
- ↑ Ethem Ruhi Fığlalı (1993) "Atatürk And The Religion Of Islam" Atatürk Araştırma Merkezi Dergisi, Sayı 26, Cilt: IX.
- ↑ Öztürk, Dr. Yaşar Nuri. "Atatürk'ün din anlayışı", Hurriyet, 4 July 2008. Retrieved on 2008-12-13. “Everything, he had done for Islam is ignored and a new propaganda propagated that claimed he is devote of belief."”
- ↑ Zürcher, Turkey : a modern history, 142
మూలాలు [మార్చు]
- ముద్రణలు
- Ahmad, Feroz (1993). The Making of Modern Turkey. London ; New York: Routledge. ISBN 978-0415078351.
- Armstrong, Harold Courtenay (1972). Grey Wolf, Mustafa Kemal: An Intimate Study of a Dictator. Freeport, NY: Books for Libraries Press. ISBN 978-0836969627.
- Atillasoy, Yüksel (2002). Atatürk: First President and Founder of the Turkish Republic. Woodside, NY: Woodside House. ISBN 978-0971235342.