మూలకము
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ఇప్పటివరకు తెలిసిన 106 మూలకాలలో, 90 మూలకాలు ప్రకృతిలో లభించేవి, మిగిలినవి కృత్రిమంగా తయారుచేసినవి.
విషయ సూచిక |
వర్గీకరణ [మార్చు]
మెండలీఫ్ ఆవర్తన పట్టిక [మార్చు]
విస్తృత ఆవర్తన పట్టిక [మార్చు]
| గ్రూపు → | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | ||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ↓ పీరియడు | ||||||||||||||||||||
| 1 | 1 H |
2 He |
||||||||||||||||||
| 2 | 3 Li |
4 Be |
5 B |
6 C |
7 N |
8 O |
9 F |
10 Ne |
||||||||||||
| 3 | 11 Na |
12 Mg |
13 Al |
14 Si |
15 P |
16 S |
17 Cl |
18 Ar |
||||||||||||
| 4 | 19 K |
20 Ca |
21 Sc |
22 Ti |
23 V |
24 Cr |
25 Mn |
26 Fe |
27 Co |
28 Ni |
29 Cu |
30 Zn |
31 Ga |
32 Ge |
33 As |
34 Se |
35 Br |
36 Kr |
||
| 5 | 37 Rb |
38 Sr |
39 Y |
40 Zr |
41 Nb |
42 Mo |
43 Tc |
44 Ru |
45 Rh |
46 Pd |
47 Ag |
48 Cd |
49 In |
50 Sn |
51 Sb |
52 Te |
53 I |
54 Xe |
||
| 6 | 55 Cs |
56 Ba |
* |
72 Hf |
73 Ta |
74 W |
75 Re |
76 Os |
77 Ir |
78 Pt |
79 Au |
80 Hg |
81 Tl |
82 Pb |
83 Bi |
84 Po |
85 At |
86 Rn |
||
| 7 | 87 Fr |
88 Ra |
** |
104 Rf |
105 Db |
106 Sg |
107 Bh |
108 Hs |
109 Mt |
110 Ds |
111 Rg |
112 Uub |
113 Uut |
114 Uuq |
115 Uup |
116 Uuh |
117 Uus |
118 Uuo |
||
| * Lanthanides | 57 La |
58 Ce |
59 Pr |
60 Nd |
61 Pm |
62 Sm |
63 Eu |
64 Gd |
65 Tb |
66 Dy |
67 Ho |
68 Er |
69 Tm |
70 Yb |
71 Lu |
|||||
| ** Actinides | 89 Ac |
90 Th |
91 Pa |
92 U |
93 Np |
94 Pu |
95 Am |
96 Cm |
97 Bk |
98 Cf |
99 Es |
100 Fm |
101 Md |
102 No |
103 Lr |
|||||
Notes
- Lanthanides are also known as "rare earth elements", a deprecated term. Regarding group membership of these elements, see here.
- క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు, పరివర్తన మూలకాలు, actinides, lanthanides, and poor metals are all collectively known as "లోహాలు".
- హేలోజన్ లు మరియు ఉత్కృష్ట వాయువులు - అలోహాలు.
|
ఆవర్తన పట్టిక యొక్క రసాయన సీరీసులు |
||||||||
|
|
|||||||
మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా నీల్స్ బోర్ విస్తృత ఆవర్తన పట్టికను నిర్మించాడు. పట్టికలోని నిలువు వరుసలను 'గ్రూపు'లనీ, అడ్డు శ్రేణులను 'పీరియడ్'లనీ అంటారు. ఆవర్గన పట్టికలో 18 గ్రూపులు, 7 పీరియడ్ లు ఉన్నాయి. అన్ని మూలకాలను వాటి పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. ఆవర్తన పట్టికలో ఎడమ నుంచి కుడికి పోయిన కొద్దీ ఒక మూలకం పరమాణు సంఖ్య కంటే దాని తరువాత మూలకం పరమాణు సంఖ్య ఒక యూనిట్ పెరుగుతుంది. ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసానికి దాని ముందు మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం కంటే ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుంది. ఇలా ఆ పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ ను 'భేదపరచే ఎలక్ట్రాన్' అంటాం.
- బ్లాకులుగా వర్గీకరణ : ఆవర్తన పట్టికలో మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా 4 బ్లాకులు ఉన్నాయి. ఒక మూలకంలో భేదపరిచే ఎలక్ట్రాన్ 's' ఉపకర్పరంలోకి పోతే ఆ మూలకాన్ని s బ్లాకులో చేర్చడం జరుగుతుంది. ఇదే విధంగా మిగిలిన మూడు p, d, f బ్లాకులు ఆవర్తన పట్టికలో చూపించడం జరిగింది. 's' బ్లాక్ ఎడమవైపు, 'p' బ్లాక్ కుదివైపు, 'd' బ్లాక్ s, p బ్లాక్ లకు మధ్యగానూ ఉన్నాయి. శక్తి స్థాయి క్రమానుసారంగా 'f' బ్లాక్ ను అమర్చినట్లయితే, ఆవర్తన పట్టిక చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి ఈ బ్లాక్ ను ఆవర్తన పట్టిక కింది భాగంలో ప్రత్యేకంగా చూపుతారు. ఎలక్ట్రాన్ విన్యాసాలు ఆధారంగా మూలకాలను అమర్చితే నాలుగు బ్లాక్ లు ఏర్పడటమే కాకుండా బాహ్యకర్పరంలో ఒకే రకం ఎలక్ట్రాన్ విన్యాసం గల మూలకాలు అన్నీ గ్రూపు అని పిలిచే ఒక నిలువు వరుసలో ఉంటాయి. ఒకే గ్రూపు మూలకాలన్నిటికీ ఒకే విధమైన రసాయన ధర్మాలుంటాయి.
- గ్రూపులుగా వర్గీకరణ : బాహ్య కర్పరంలోని 's' ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్ గల (ns1) మూలకాలను 'I గ్రూపు మూలకాలు' అంటాం (ఉ.హైడ్రోజన్, ఆల్కలీ లోహాలు). బాహ్య కర్పరంలోని 's' ఆర్బిటాల్ లో రెండు ఎలక్ట్రాన్ లు గల (ns²) మూలకాలను 'II గ్రూపు మూలకాలు' అంటారు (ఉ.క్షార మృత్తిక లోహాలు). బాహ్యకర్పరంలో మూడు ఎలక్ట్రానులు, 's' లో రెండు, 'p' లో ఒకటి (ns² p1) 'III గ్రూపు మూలకాలు' అంటాం. ఇదే విధంగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది ఎలక్ట్రానులు వరసగా ఉన్న మూలకాలను IV, V, VI, VII, 0 గ్రూపు మూలకాలు అంటాం.
ధర్మాల ఆధారంగా వర్గీకరణ [మార్చు]
- జడవాయు మూలకాలు : ఆవర్తన పట్టికలో '0' గ్రూపుకు చెందిన మూలకాలను జడవాయువు మూలకాలు అంటారు. అవి: హీలియం-2, నియాన్-10, ఆర్గాన్-18, క్రిప్టాన్-36,జినాన్-54 మరియు రేడాన్-86.
- ప్రాతినిధ్య మూలకాలు : ఆవర్తన పట్టికలో 's', 'p' బ్లాకు మూలకాలను ప్రాతినిధ్య మూలకాలంటారు. అవి: కొన్ని లోహాలు, అన్ని అలోహాలు, అర్ధలోహాలు.
- పరివర్తన మూలకాలు : ఇవి 'd' బ్లాకు మూలకాలు.
- అంతర్ పరివర్తన మూలకాలు : ఇవి 'f' బ్లాకు మూలకాలు.