మూస చర్చ:స్వాగతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సూచనలు[మార్చు]

తెవికీలో నిర్వహిస్తున్న వికీప్రాజెక్టులకు కూడా ఒక లింకు తతగిలిస్తే కొత్తగా చేరిన సభ్యులకు మార్గనిర్దేశం చేసినట్లు ఉంటుంది. సభ్యుల పట్టికకు మీ పేరు జతచేయండి., అనే వాక్యం బదులుగా మీకు నచ్చిన వికీప్రాజెక్టులో మీ పేరు నమోదు చేసుకోండి. అనే సందేశం ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 11:04, 27 నవంబర్ 2006 (UTC)

కొత్త మూస సరళంగా బాగుంది.
  1. సభ్యుల పట్టిక అలా ఉంచుదాం. దానితోపాటుగా వికీప్రాజెక్టు కూడా చేర్చుదాం.
  2. సహాయానికి అధికారిక మెయిలింగులిస్టు (WikiTe-L@wikipedia.org) మరియు IRC లని కూడా ఉపయోగించుకొమ్మనే సందేశం ఇవ్వాలి.
--వీవెన్ 13:47, 27 నవంబర్ 2006 (UTC)
ప్రదీపు, ఈ మూస అందరికీ ఉపయోగపడేటట్టు చేసినందుకు కృతజ్ఞతలు. మీ ఇద్దరి ఆలోచనలు బాగున్నాయి అందుకు తగిన విధముగా పై మూసను మీరే దిద్దండి. --వైఙాసత్య 14:35, 27 నవంబర్ 2006 (UTC)
వికీప్రాజెక్టులను, అధికారిక మెయిలింగులిస్టు చేర్చాను, కానీ ఇప్పుడు మళ్ళీ ఆక్కడి సమాచారం సరళత దెబ్బతిందేమో అని అనిపిస్తుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:10, 28 నవంబర్ 2006 (UTC)
బొమ్మలు కూడా చేరిస్తే ఎలా ఉంటుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 06:11, 28 నవంబర్ 2006 (UTC)

రెండవ తరం మూస గురించి చర్చలు[మార్చు]

చాలా మంది తెలుగు రాయడానికి నానావస్థలు పడుతున్నరు వారికి స్వాగతం పేజిలోనే లేఖిని లింకు ఇవ్వమని నా సూచన లింకు ప్రస్ఫుటం గా కనిపించాలి. --మాటలబాబు 08:50, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి. అని స్వాగతం మెదటి వాక్యంలోనే అన్నప్రాసన రోజే ఆవకాయ పెడుతున్నాం. దయచేసి చూడండి ఆ సభ్యుల పట్టిక ఉన్న పేజిని గాని ఏమాత్రమైన సరళం చెయ్యచ్చేమౌ, లేకపోతే ఆ వాక్యమే తీసేయండి. --మాటలబాబు 09:13, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తెలుగు వికీపీడియాలో లేఖిని లేకుండానే టైపు చెయ్యవచ్చు కదా! మళ్లీ లేఖిని లింకు ఎందుకు? ఇక సభ్యుల పట్టికకు పేరు జతచేయమని చెప్పటం చాలా ఇబ్బందులు పెడుతున్నట్టు నాకూ అనిపించింది. ప్రస్తుతానికి దాన్ని తొలగిస్తా --వైజాసత్య 11:56, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదీపు గారు ఇదివరకే ఈ వాక్యాన్ని సరళీకృతం చేసినట్టున్నారు. దీని తాలూకు ప్రభావం ఎలా ఉంటందో కొన్ని రోజులు వేచిచూద్దాం. --వైజాసత్య 12:02, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఉదాహరణ కు పూర్ణాస్వరం "ం" ఇవ్వడం తెలియక 0 ఉపయౌగిస్తున్నారు.--మాటలబాబు 12:32, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
EDITBOXకు పైన కింద రెండు చోట్లా తెలుగులో టైపు చేయడానికి సూచనలు ఉన్నాయి. అవి వారికి ఎట్లా కనిపించడంలేదో నాకు అర్ధం కావడం లేదు. కొంతమందికి "ం"కి బదులుగా 'o', 'O' లేదా '0' లను ఉపయోగించడం అలవాటయిపోయి, ఇక్కడ కూడా అదే ఉపయో గించేస్తూ ఉంటారనుకుంటా. వీరి లేఖిని గురించి చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 12:51, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రదిప్ గారు అలా అనకండి నేను ఆ త్రోవా లో వెళ్ళిన వాడినే నాకు మెదట్లో తెలియక చచ్చేది. ఆ తరువాత నేను నెమ్మదిగా నెర్చుకొన్నాను--మాటలబాబు 13:11, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మాటలబాబు అన్నట్టు స్వాగతం మూసను సరళీకరించాలని నేనూ అనుకుంటున్నాను. కొత్త సభ్యులను స్వాగతించేటపుడు "వికీ గురించి వాళ్ళకేమాత్రం తెలియదని" మనం భావించాలి. మొదటినుండి మనం మన స్థాయిలో ఆలోచించాం గానీ, కొత్త వాళ్ళకి వికీ చూడగానే ఎంత అయోమయంగా ఉంటుందో మనం పరిగణించలేదు. కొత్తవాళ్ళని దృష్టిలో ఉంచుకుని దీన్ని మరికాస్త ఉపయోగకరంగా చెయ్యాలి! కొన్ని సూచనలు..
  • కొత్తవాళ్ళకి అన్నన్ని లింకులు చూపిస్తే తికమక పడతారేమోననిపిస్తోంది. దాని బదులు ఒకటో రెండో లింకులు ఇచ్చి నేర్చుకునేందుకు దోహదం చేస్తే బాగుంటుందేమో! ఉదాహరణకు.. పరిచయం, 5 నిమిషాల్లో వికీ -ఈ రెంటినీ ముందు చదవమందాం.
  • నవీన్, ప్రవీణ్ లు తయారు చేసిన సినిమా లాంటిది ఇక్కడ బహు ప్రయోజనకరం. సినిమా చూసి త్వరగా నేర్చుకోగలరు, ఆసక్తికరంగా కూడా ఉంటుంది.
ఆలోచించండి!! __చదువరి (చర్చరచనలు) 15:53, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆహా! చదువరీ, మీకు మీరే సాటి. ఆలోచనలు బాగున్నాయి. వాటిని అమలుచేద్దాం. వాళ్ల వీడియోలో సౌండు ఉన్నట్టు లేదుకదా..నేనొకటి, రెండు వీడియోలు తీసి ప్రయత్నిస్తా..గొంతు బాగోకపోతే మాటలబాబు చే డబ్బింగ్ చేయించాల్సిందే ;-) --వైజాసత్య 16:05, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మూడో తరం మూస[మార్చు]

ఇప్పుడున్న సందేశాన్ని మళ్ళీ మారుతున్న అవసరాలకు, మనకు వస్తున్న ఫీడ్ బాక్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చెయ్యాల్సిన సమయం వచ్చింది.

మూసను వీలైనంతగా సరళీకరించి పెద్దగా వికీఫార్మాటింగు, పట్టికలు లేకుండా చేయ్యాలని నాకనిపించింది. ఏదైనా రాయాలని చర్చాపేజీ తెరిచినవాళ్ళకి 5 కేబీల క్లిష్టమైన వికీఫార్మాట్లో పట్టికలతో ఉన్న గందరగోళాన్ని చూసి జడుసుకుంటున్నారేమోనని నా అనుమానం.
ఇక ఈ మూడు లైన్ల వళ్ల పెద్ద ఉపయోగమేమీ లేదు. ఒక్కోదాని కింద వ్యాఖ్యానిస్తా. --వైజాసత్య 09:36, 9 ఆగష్టు 2007 (UTC)
నేను కొత్త మూసకు ఒక ప్రయత్నం ఇక్కడ ప్రారంభిస్తా. మీరూ మార్పులు చేర్పులు చెయ్యండి. మూస:స్వాగతం/మూడో తరం
ఇక చర్చ ఇక్కడ కొనసాగించబడుతున్నది మూస చర్చ:స్వాగతం/మూడో తరం --వైజాసత్య 12:07, 10 ఆగష్టు 2007 (UTC)

స్వాగతం మూస మార్పులు[మార్చు]

రమేష్ గారు, ఒక్కసారి subst: వాడితే ఆ కాలం లో మూసలో వున్న విషయం చేరిపోతుంది. మీరు సభ్యుడు పేరు ఉదాహరణ లో తొలగించినట్లున్నారు. సభ్యుడు పేరు వుండాలి. ఇది చర్చాపేజీలో వాడతాము కాబట్టి, ఒక రికార్డుగా మిగిలి పోతేనే బాగుంటుంది. దీనితో మీరు అంగీకరించితే మీ మార్పుని రద్దుచేయమని విజ్ఞప్తి.--అర్జున 04:02, 13 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ గూర్చి వాడుకరులకు తెలియజేయాలి[మార్చు]

తెలుగు వికీపీడియా యొక్క ఔన్నత్యాన్ని, దాని చరిత్రను క్రొత్త వాడుకరులకు తెలియవలసిన అవసరం ఉన్నది. కనుక ఈ మూసలో మొదటి పాయింట్ గా వికీపీడియా:వికీపీడియా - స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము ను చేర్చితే బాగుండునేమో పరిశీలించగలరు.-- కె.వెంకటరమణ చర్చ 06:56, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూసలో మార్పులతో స్వాగతించిన వాడుకరి చర్చాపేజీలకు అధిక ప్రాధాన్యత[మార్చు]

ఇటీవల జరిగిన మూస మార్పులలో "ఏ విషయంలో సాయం అవసరమైనా సరే... నా చర్చా పేజీలో రాయండి. సంతకంలో నా చర్చ పేజీ లింకు ఉంది, చూడండి" అనే మార్పు సరికాదు అనిపిస్తుంది. స్వాగతించేవారు చాలా కొద్దిమంది, వారికి తెవికీ గురించిన సందేహాలపై స్పష్టత ఇవ్వగలిగే శక్తి ఉండకపోవచ్చు, లేక వెంటనే స్పందించకపోవచ్చు. ఈ వాక్యానికి ముందే {{సహాయం కావాలి}} గురించి తెలిపాము. కావున ఈ మూస వాడి ఏ చర్చాపేజీలోనైనా సందేహం రాసి అందరికీ తెలిపే అవకాశమున్నప్పుడు, స్వాగతించిన వ్యక్తి చర్చాపేజీకి అదనపు ప్రాముఖ్యం మంచిది కాదని నా అభిప్రాయం. User:Chaduvari గారు మరల పరిశీలించమని కోరుతున్నాను. అర్జున (చర్చ) 05:09, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, స్వాగత సందేశాన్ని అలా మార్చడానికి కారణాలేంటంటే..
  1. కొత్తవారు సాయం పొందే విధానం వీలైనంత తేలిగ్గా ఉండాలని భావించాను.
  2. కొత్త వాడుకరి సాయం కోసం ఒక వ్యక్తిని అడిగేంత తేలిగ్గా, చొరవగా మూసను వాడి అడగక పోవచ్చు అని నా భావన.
  3. స్వాగత సందేశం మరీ ఫార్మల్‌గా కాకుండా, వీలైనంత వ్యక్తిగత సాన్నిహిత్యం చూపించేలా ఉంటే, కొత్తవారు బిడియపడకుండా అడుగుతారని భావించాను.
  4. స్వాగతించేవారు ఆ మాత్రం బాధ్యత తీసుకుంటారని అనుకున్నాను.
మొదటి మూడింటినీ దృష్టిలో ఉంచుకుని, నాలుగోదాన్ని సవరించండి సార్. __చదువరి (చర్చరచనలు) 06:13, 26 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, చర్చా పేజీలో స్వాగత సందేశం లో కేవలం "ఇక్కడ" అనే లింకు పై నొక్కడం ద్వారా మూస చేరేటట్లుగా ఏర్పాటు వున్నది కావున, అంతకంటే తేలికగా సాయం పొందే విధానం లేదనిపిస్తుంది. ఎక్కువగా స్వాగతించేవారిలో చాలా మందికి బాధ్యత తీసుకునే శక్తి లేదు అని నా అభిప్రాయం. అందువలన ఆ వాక్యం అవసరంలేదని నా అభిప్రాయం.-- అర్జున (చర్చ) 04:52, 27 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, నేను చెప్పాల్సింది చెప్పేసాను, ఇక చెప్పాల్సిందేమీ లేదు. మీకు ఉచితమనిపించిన విధంగా మార్చండి. __చదువరి (చర్చరచనలు) 05:52, 27 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మార్పు చేశాను.అర్జున (చర్చ) 04:19, 3 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం మూసలో వికీసంతకం[మార్చు]

గమనిక: ట్వింకిల్ ద్వారా స్వాగతించినపుడు సంతకం అప్రమేయంగా చేరుతున్నందున, మానవీయంగా చేర్చినపుడు వికీసంతకం చేర్చాలి. అర్జున (చర్చ) 13:34, 28 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఇలా ట్వింకిల్ వికీసంతకం ప్రత్యేకవరుసలో చేరుతున్నందున, ఆంగ్లవికీకి సామ్యతగా, మూసలోనే సంతకం వుంచాలి. ట్వింకిల్ అభిరుచులలో లో స్వాగత విభాగంలో సంతకం చేర్చకుండా ఎంపిక చేసుకోవాలి. ఈ మార్పుపై అభ్యంతరాలేమైనా వుంటే వారంలోగా స్వాగతానికి ట్వింకిల్ వాడుక దారులు, మామాలుగా మూస వాడేవారు, స్పందించండి. --అర్జున (చర్చ) 11:41, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రత్యేక వరుస దోషాన్ని మూసలో సవరించాను. ప్రతిపాదించిన సవరణను విరమిస్తున్నాను. మూసలో పెద్ద మార్పులు చేసినప్పుడు చేపట్టవచ్చు --అర్జున (చర్చ) 01:01, 17 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

{{ఈ నాటి చిట్కా}} మరల చేర్చుట[మార్చు]

YesY సహాయం అందించబడింది

{{ఈ నాటి చిట్కా}} కొన్నాళ్ల క్రిందట స్వాగతం మూసలో User:Chaduvari గారు తొలగించారు. దీని ద్వారా వికీపీడియాలో కృషి గురించి సులభంగా తేదీ కొకటి చొప్పున అందించే సమాచారం చాలా వుపయోగం కావున మరల చేర్చాలని ప్రతిపాదిస్తున్నాను. --అర్జున (చర్చ) 00:58, 2 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మరింత అవగాహనకు ప్రతిపాదిత మార్పుతో పోలికకు మూస:స్వాగతం/testcases చూడండి.--అర్జున (చర్చ) 23:47, 7 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సందర్భం: ముందుగా ఈ మూసను వాడుతున్న సందర్భమేంటో చూస్తే.. వికీలో కొత్తగా చేరినవారిని, అసలు వికీ గురించి ఏ అవగాహనా లేని వారిని ఈ మూస ద్వారా స్వాగతిస్తూ, వారికి వికీని పరిచయం చేస్తున్నాం.
ఓనమాలు నేర్చుకునే వారికి, అసలు ప్రాథమిక విషయాలే తెలియని వారికి చిట్కాలు చెప్పడం సందర్భోచితమా? అన్నప్రాసన నాడే ఆవకాయా?
విజ్ఞులు ఆలోచించవలసినది. __చదువరి (చర్చరచనలు) 05:02, 9 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్త వికీపీడియన్లకు తొలిగా అందే సందేశం గురించిన చర్చపై కేవలం ఒక స్పందన మాత్రమే రావడం శోచనీయం. ఈ పరిస్థితిలో ఈ చర్చను కొనసాగించడం ఉపయోగం లేదు కావున ముగిస్తున్నాను. --అర్జున (చర్చ) 00:39, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, నిజమేనండి, ఉరుకుల పరుగుల జీవితంలో వికీపీడియనులు చర్చలో పాల్గొనడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదు. చదువరి గారు, ఉదా: ఎంత ముఖ్యమైన అంశం గత మూడు రోజుల నుండి దీనిపైన ఎవరైనా ఒక అభిప్రాయం రాగానే నా అభిప్రాయం రాయాలని రాసి పెట్టుకున్న ప్రచురించలేదు, ఎవరు ఈ చర్చలో పాల్గొనడం లేదు. మొన్నటికి మొన్న మన దాంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే, వారికి అభినందనలు చెప్పేవారే కరువయ్యారు. ఇక ఈ మూస గురించి, స్వాగతం పలికే వారికి వృధా ప్రయాస తప్ప ఆ పేజీ తోనూ అంతగా ఉపయోగం లేదు, అలాగని ఆ పేజీని కూడా అంటే ఆ మూస స్వాగతం పేజీ అలా అని, స్వాగతం పలక కుండా ఉండలేం కదా, నేను కూడా కొన్ని ప్రయోగాలు చేశా, ఉదాహరణకు కొత్తవారి వాడుకరి పేజీని వారి పేరుతో నేనే సృష్టించా, అలా కూడా ఉపయోగం లేక వదిలేశా, బహుశా ఒక ముగ్గురు నలుగురు, తర్వాత ఏవో కొన్ని చిన్న మార్పులు చేశారు, తరువాత వారు కూడా దూరమయ్యారు. ప్రయోగాలు చేయడం తప్ప మరి ఏం చేయలేం కాబట్టి, నా అభిప్రాయం ఈ మూస కూడా ఒక చిన్న ప్రయోగమే, నా పేజీలో గత ఐదు సంవత్సరాల నుండి {{ఈ నాటి చిట్కా}} మూస ఉంది. నాకు చాలా ఉపయోగపడింది. ఆ మూసను లోతుగా పరిశీలిస్తే 360 చిట్కాలు కొత్తవారికి ప్రారంభంలో ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ, తర్వాత రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఒక్క చిట్కా నైనా ఉపయోగపడుతుందని చెప్పగలను, అర్జునరావు గారు, చదువరి గారు, ఇలాంటి చిట్కాల పైన పంచి డైలాగుల యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో ఈ చిట్కా చర్చకు రమ్మంటే... ఫలానా కేసులో కోర్టుకు వచ్చి ఎదురు సాక్ష్యం చెప్పాలి. అన్నట్లు ఉంది. అందుకే పాపం ఈ చర్చకు ఎవరూ రాలేదు. ధన్యవాదాలు __ ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 03:20, 16 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2014 పుస్తకం లింకు[మార్చు]

ఈ స్వాగతం మూసలో కొన్ని లింకులను తీసెయ్యాలి.

  1. 2014 ఈపుస్తకం లింకుతో సమస్యలున్నాయి. వాటిలో కొన్ని ఇవి:
    1. ఆ పుస్తకంలో కొన్ని అస్పష్టతలున్నాయి. ఉదా: ఏ ఎడిటరు గురించి వివరిస్తోందో ఆ పుస్తకం స్పష్టం చెయ్యలేదు.
    2. కొన్ని చోట్ల వికీ మార్కప్ గురించి చెబుతోంది. కొత్త వాడుకరులకు వికీని పరిచయం చేసేటపుడు వికీమార్కప్ గురించి చెబితే అది వారిని బెదరగొట్టే అవకాశం ఉంది. వారికి విజువల్ ఎడిటరును మాత్రమే పరిచయం చెయ్యాలి.
    3. అందులోని భాషలో అక్కడక్కడా సవరణలు చెయ్యాల్సి ఉంది. కొత్త వాడుకరులకు తేలిగ్గా అర్థమయ్యేలా మార్చాలి.
  2. గూగుల్ గుంపు, ఫేస్‌బుక్ లింకులను కూడా తీసెయ్యాలి. అవి అధికారికమైనవి కావు.

__ చదువరి (చర్చరచనలు) 04:34, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2014 ఈ-పుస్తకం అప్పటి వికీపీడియాను దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా నేను గమనించాను.అప్పటికి, ఇప్పటికి కొన్నిటికి కాలం చెల్లి, చాలా తేడాలు ఉండవచ్చు.లేదూ అంటే ఈ-పుస్తకం పనికట్టుకుని ఇప్పటి వికీపీడియాకు అనుగుణంగా సవరించాలి.అయినా కొత్తవారిని అవి చూడండి, ఇవి చూడండి అని వారిని బెదరగొట్టేటట్లు ఉండకూడదని నా అభిప్రాయం.అలాగే మనంగా గూగుల్ గుంపు, ఫేస్‌బుక్ లింకులను మనమెందుకు ప్రోత్సహించాలి.ఇది ఒకరకంగా వికీనియమాలకు విరుద్ధం అని నేను భావిస్తున్నాను.కావున నేను పైన చదువరి గారు వెలుబుచ్చిన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 15:34, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి, యర్రా రామారావు గార్లకు, 2014 ఈ పుస్తకం లింకు తీసేయ్యడం గురించి మీతో విభేదించక తప్పటంలేదు. దానికి కారణాలు.
  1. ఇది ఫౌండేషన్ బృందం తయారు చేసిన ప్రామాణిక పుస్తకానికి అనువాదం. అటువంటి పుస్తకం, సాధారణ వికీపీడియన్లు చేయలేరని నా అనుభవం.
  2. విజువల్ ఎడిటర్ తో అన్ని పనులు సాధ్యమవకపోవచ్చు, సౌలభ్యంగాను వుండకపోవచ్చు. కావున వాడుకరులకు సాధారణ ఎడిటర్ గురించి తప్పనిసరిగా తెలపాలి.
  3. ఎవరైనా పుస్తకంలోని భాషను మెరుగు చేయడానికి అభ్యంతరం లేదు. పెద్ద మార్పులు ఏవైనా చేయాలనుకుంటే ఒక అనుబంధ పుస్తకాన్ని తయారుచేసి లింకు ఇవ్వండి --అర్జున (చర్చ) 22:16, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, చర్చ మెరుగుగా జరగటానికి, చర్చను ఒక విషయానికే పరిమితం చేయండి. పై ప్రారంభ చర్చలో గూగుల్, ఫేస్ బుంక్ లింకులకు వేరే చర్చ ప్రారంభించండి. --అర్జున (చర్చ) 22:49, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, కొత్తవారు పెద్దగా రాయకపోవడం అనేది వికీపీడియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి. దీన్ని అధిగమించడం అనేది వికీ ప్రాథమ్యాల్లో ఒకటి. ఇందులో భాగంగా ఎడిటరును మెరుగు పరచుకుంటూ వస్తోంది. ఒకప్పటి వికీటెక్స్టు ఎడిటరులో పరికరాలేమీ ఉండేవి కావు. ప్రతీ మార్కప్‌ను స్వయంగా రాయాల్సి వచ్చేది. దాని స్థానంలో 2010 వికీటెక్స్టు ఎడిటరు వచ్చింది. పని తేలికైంది. మళ్ళీ దాన్ని మెరుగుపరుస్తూ 2017 వికీటెక్స్టు ఎడిటరు వచ్చింది. మార్కప్ రాయాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఈలోగా విజువల్ ఎడిటరు వచ్చింది. అసలు మార్కప్ అంటే ఏంటో తెలియాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇవన్నీ కొత్తవారికి ఇక్కడ పనిచెయ్యడాన్ని ఎంతో తేలిక చేసాయి. విజువల్ ఎడిటరుకు వికీటెక్స్టు 2017 ఎడిటరుకూ పరికరాల పట్టీ ఒక్కటే, అందులోని పరికరాలన్నీ ఒకటే.. గమనించారా? వాడుకరికి సాంకేతికత తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వీలైనంతగా తగ్గించి, పని వీలైనంత తేలిక చేస్తున్నారు. ఎందుకంటే వాడుకరి ఇక్కడకు వచ్చింది, విజ్ఞాన సర్వస్వం రాయడానికి, సాంకేతికత నేర్చుకోడానికి కాదు అనేది దీనికి ఆధారం.
"కావున వాడుకరులకు సాధారణ ఎడిటర్ గురించి తప్పనిసరిగా తెలపాలి." అని మీరు రాసారు. అవున్నిజం! కానీ అది కొత్తవారికి కాదు. కొంత అనుభవం సంపాదించాక అది అవసరమౌతుంది. కానీ, అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టకూడదు.
ఈ పుస్తకం లోని విషయానికి కాలదోషం పట్టింది. అది ఒకప్పటి వికీపీడియాను వివరించే పుస్తకం. ఇప్పటి వికీపీడియాను వివరించడానికి అది సరిపోదు. ఈ పుస్తకాన్ని ఇప్పటి వికీపీడియాకు తగినట్లుగా సవరించుకోవాలి, లేదంటే కొత్తగా రాసుకోవాలి. మీరు సవరిస్తానంటే సవరించండి. కొత్తగా పుస్తకం రాస్తానంటే రాయండి. నాకైతే ఈ పనులు చేసే తీరిక లేదు, ఓపికా లేదు. అసలు ఆ పని చేసే అవసరమే లేదని ఉద్దేశం. ఎందుకంటే కొత్తవారికి పనికొచ్చే 70 పైచిలుకు సహాయం పేజీలను ఈ మధ్యనే అనువదించి పెట్టాన్నేను.
అర్జున గారూ, ఆ పుస్తకంపై మీరు పనిచేసారు కాబట్టి, మీకు ప్రేమ ఉండవచ్చు అది సహజం. అంత మాత్రాన దాన్నే ఇప్పుడూ నేర్పాలంటే ఎలా? నేను ఒకప్పుడు అనేక సహాయం పేజీలను అనువదించాను. మొన్న ప్రణయ్ రాజ్ గారు వాటిని ఒక జాబితా చేసారు (వాటిలో నేను అనువదించినవి 35 పేజీల దాకా ఉన్నాయి) వాటిని చూసాక, వాటిలో కొన్ని పేజీలకు కాలదోషం పట్టిందనీ, వాటి మొహాన ఆ ముక్క రాసేసి పక్కన పడెయ్యాలని నేనాయన్ని కోరాను. నేను అనువదించినవే అయినప్పటికీ, అవి ఇప్పుడు పనికిరావని నాకు తెలుసు. అందుకే నేను ఆ ఆభిప్రాయం చెప్పాను. నాకూ వాటిపై అభిమానం ఉన్నంత మాత్రాన, వాటిని ఇప్పుడు నేర్పాల్సిందే అంటే ఎలా? పనికిరానివి పనికిరానివే -అవి నేను రాసినా మీరు రాసినా! అది గ్రహించాలి మనం.
"నువ్వు రిక్షా తొక్కడంతో మొదలుపెట్టి జీవితంలో కోటీశ్వరుడివి అయ్యావు కాబట్టి, నీ కొడుకు కూడా రిక్షా తొక్కడం తోనే జీవితం మొదలెట్టాలనుకోవడం కరెక్టు కాదు" అని ఒక సినిమా డైలాగు. మనం మార్కప్‌తో నేర్చుకోవడంతో మొదలెట్టాం గదా అని ఇప్పటి కొత్తవారు కూడా అలాగే నేర్చుకోవాలని ఆశించడం ఏమాత్రం సరైనది!?
ఒక్క ఉదాహరణ చెబుతాను.. @యర్రా రామారావు గారు రిటైరయ్యాక ఖాళీ సమయం దొరికింది కాబట్టి, వికీలో రాయడం మొదలుపెట్టారు. కొన్ని నెలల్లోనే విరివిగా రాస్తూ తెవికీని ముందుకు లాక్కెళ్తున్నారు. కొత్తలో, ఆ వయసులో ఆయన మార్కప్ నేర్చుకోవాల్సి వచ్చి ఉంటే, బహుశా మనకు ఈ లక్ష పైచిలుకు దిద్దుబాట్లు వచ్చి ఉండేవే కావు.
ఆలోచించండి. సహకరించండి. __ చదువరి (చర్చరచనలు) 04:20, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. వికీపీడియాలో రచనలు చేయడం అనే పుస్తకం విలువను, సాధారణ ఎడిటర్, విజువల్ ఎడిటర్ ఎలా వాడాలి అనే దానికి కుదించడం మీ వాదనసారాంశం లాగా వుంది. రెండవది, నేను ఆ పుస్తకం తెలుగు అనువాదం నేను సమన్వయం చేశానని నాకేదో దానిపై ప్రేమ వున్నదని కాబట్టి లింకు తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నానని ఇంకొక వాదం. అది సరికాదు. పుస్తకం ఒక విలువైన సమాచారం కలిగివుంది. దానిని పనికట్టుకొని ఎవరూ నేర్పుట లేదు. కొత్త వాడుకరులకు, విజువల్ ఎడిటర్ అప్రమేయంగా చేతనం చేయవచ్చు. తెలుగువికీకి ఇప్పటికే అలా జరగకపోతే అలా చేయవచ్చు. మనం ఎన్ని లింకులిచ్చిన ఏ కొద్ది మందో ఆ పుస్తకం గమనిస్తున్నారని, కొత్త వాడుకరులు చేసే తొలి రచనలు, సందేహాలవలన తెలుస్తున్నది. అయినా ఆ పుస్తకం వికీపీడియా పరిచయానికి విలువైనది అని నేను భావిస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. ఈ వివాదంపై ఏకాభిప్రాయ సాధనకు వికీపీడియా పద్ధతుల ప్రకారం చర్యలు తీసుకొని, తదనుగుణంగా సవరించితే నాకు అభ్యంతరంలేదు. --అర్జున (చర్చ) 21:53, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
సర్లెండి @Arjunaraoc గారూ, నేను చెప్పినది స్పష్టంగానే చెప్పాను. మీరు అంగీకరించనంటే నేనిక చేసేదేమీ లేదు. మీరన్నదే కానివ్వండి. ఈమధ్య ఒక కొత్త ప్రాజెక్టు తెవికీలో చేతనమైంది. దానికి సంబంధించిన వాడుకరులకు మాత్రం అది కనబడకుండా చేస్తాను.మిగతా వారికి మాత్రం మామూలుగానే కనబడుతుంది. __ చదువరి (చర్చరచనలు) 00:44, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ప్రతి రోజు 10-20 మంది కొత్త వాడుకరులకు చేర్చే సందేశంలో మార్పులపై అభ్యంతరం తెలిపినా, ప్రస్తుతం వికీపీడియాలో పనిచేసేవారిలో అత్యంత ఎక్కువ అనుభవం, అధికార, నిర్వాహక హోదా గల మీరు ఏకపక్షంగా మార్పు చేయటం సరికాదు.( ఉదాహరణ కొత్త వాడుక, ఇతరులకు పుస్తకం లింకు కనబడేటట్లు, సంబంధింత వాడుకరికి కనిపించకుండా వుండేటట్లు సవరణ) వికీపీడియాలో చేరిన వారికి ఒకటే రకమైన తొలి సందేశం అందటమే మంచిది. తొలి సందేశంలో కొత్త ప్రాజెక్టు సభ్యులు, ప్రాజెక్టులో చేరని సభ్యులు అనే భేదబావం సరికాదు. ఈ సభ్యులకు ప్రాజెక్టు లో భాగం గాని సభ్యులు కూడా స్పందించవచ్చు. అప్పుడు ఆ కొత్త సభ్యుడు చర్చాపేజీలో ఏ లింకులు చూస్తున్నాడో గురించి ఏకాభిప్రాయం లేకపోతే, చర్చలు గందరగోళమయ్యే అవకాశం వుంది. తెలియక గతంలో కూడా కొంతమంది స్వాగతించే వారు మూస వాడకుండా, తేడాలుండే స్వాగత సందేశాలు చేరుస్తుంటే వారిని ఒకే రకమైన స్వాగత సందేశం చేర్చమని కోరటం జరిగింది. వారు అంగీకరించి ఒకే రకమైన స్వాగత సందేశం చేర్చటం ప్రారంభించారు. దయచేసి, మీరు చేసిన మార్పులో పుస్తకం లింకు కనబడకుండా చేసే కోడ్ రద్దుచేయండి. ప్రత్యేక ప్రాజెక్టు లో చేరిన సభ్యుల చర్చాపేజీలలో మీరు అదనపు సందేశం చేర్చే ఏర్పాటు చేయటం మంచిదైనా స్వాగత మూస ద్వారా ప్రాజెక్టు కు సంబంధించిన వివరం చేర్చే కోడ్ పై నాకు అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 22:13, 26 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, మీకో నమస్కారం సార్. __ చదువరి (చర్చరచనలు) 01:55, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Arjunaraoc గారూ, ఆ కాలదోషం పట్టిన పుస్తకపు లింకును తిరిగి పెట్టేసా. __ చదువరి (చర్చరచనలు) 01:58, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: గారు, పుస్తకం విలువ కాలంతో కొంత తగ్గవచ్చు కాని, దాని ఆధారిత సాంకేతికాలు పూర్తిగా తొలగితే తప్ప, విలువ పూర్తిగా కోల్పోదు. కావున మీరు వాడిన కాలదోషం అనే విశేషణం సరికాదు. ఏదేమైనా, అవసరమైన మార్పులు చేసినందులకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 22:35, 27 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పదాలు సవరణ[మార్చు]

స్వాగతం మూసలో కొన్ని చిన్న పదాల సవరణ చేసాను. గమనించగలరు--యర్రా రామారావు (చర్చ) 15:38, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]