మృకండు మహర్షి

వికీపీడియా నుండి

మృకండు మహర్షి మృగశృంగ మహర్షి కుమారుడు. ఈతని కుమారుడే మార్కండేయుడు.

[మార్చు] జీవిత విశేషాలు

మృగశృంగ మహర్షి తపశ్శక్తిచే చనిపోయిన సువృత్తను మరల బ్రతికించెను. సువృత్త తండ్రి నుచథ్యుడు తన కూతురిని, ఆమె ముగ్గురు చెలికత్తెలైన కమల, విమల, సురసలను ఆతని కిచ్చి వివాహము చేసెను. వారు నలుగురు మహర్షి నెల్ల విధముల సేవలతో సంతోషపెట్టిరి. అతడును వారియెడ సమానప్రేమను చూపుచు ఆనందపరిచెను. వారు నలుగురు ఒక్కసారిగా గర్భములు ధరించి నలుగురు పుత్రులను గాంచిరి. అందు సువృత్త కుమారుడే మృకండుడు. కమల కుమారునికి ఉత్తముడు, విమలకు సుమతి, సురసకు సువ్రతుడు యని నామకరణము చేసెను.


[మార్చు] మూలాలు

  • మహర్షుల చరిత్రలు (ఏడవ సంపుటము), విద్వాన్ బులుసు వేంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె