మెట్లోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమల మార్గములోని ఏడుకొండలను సాంప్రదాయ పద్ధతిలో కర్ణాటక హరిదాసులు సూచించిన విధముగా మెట్ల మీదగా ఎక్కటాన్ని మెట్లోత్సవము అంటారు. వేలాది మంది భజన బృంద సభ్యులు, భక్తులు హరిదాసుల వేషం ధరించి భజనలు పాడుతూ హరిదాసుల చిత్రాలను తిరుపతిలో ప్రధాన వీధుల గుండా ఊరేగించటం, భజనలు, ప్రశ్నోత్తర పోటీలు మొట్లోత్సవము యొక్క కొన్ని ప్రధాన అంశాలు.[1]

మొట్లోత్సవం ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే ఉత్సవం. మొదటి రోజు ఊరేగింపు తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం నుండి ప్రారంభమై త్యాగరాజ మండపం చేరుతుంది. త్యాగరాజ మండపం వద్ద హరిదాస సంధ్య సంకీర్తన అనే సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.[2]

మొట్లోత్సవ ఆచారాన్ని ప్రసిద్ధ కన్నడ హరిదాసులైన పురందర దాసు, కనక దాసు, విజయ దాసులు ప్రారంభించారు.[3] పురంధర దాసు వారు ప్రతి సంవత్సరం వారి శిష్యబృందంతో బ్రాహ్మీముహూర్తంలో మెట్లమార్గంలో ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు, ముఖ్యంగా బ్రహ్మోత్సవంలో తిరుమలకు దర్శించేవారు. అదే దాస సాంప్రదాయం 15-16వ శతాబ్దం నుండి కొనసాగుతున్నది.[4]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-06-16. Retrieved 2007-07-16.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-30. Retrieved 2007-07-16.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-03-02. Retrieved 2007-07-16.
  4. https://www.youtube.com/watch?v=eH51IbXq86U