మేడారం (సమ్మక్కజాతర)
మేడారం, వరంగల్ జిల్లా, తాడ్వాయి (వరంగల్ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ గ్రామం జిల్లా కేంద్రమైన వరంగల్లునుండి 120 కి.మీ. దూరంలో ఉంది.
సమ్మక్క సారలమ్మజాతర [మార్చు]
- ప్రధాన వ్యాసం సమ్మక్క సారక్క జాతర
ఈ జాతర భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర . 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు షుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా.ఇది విగ్రహాలు లేని జాతర.సమ్మక-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జనవరి 27 నుంచి 30 తేదీ వరకు నిర్వహిస్తారు.హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.45 లు బస్ చార్జి ఉంటుంది.కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీర వని తలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. కుంభ మేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వం 1996లో రాష్ట్ర పండుగగా ప్రకటించింది. రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులతో మేడారం ప్రాంతం జనసంద్రాన్ని తల పిస్తుంది. భక్తి పారవశ్యంతో, పూనకాలతో ఊగిపోతూ లక్షలా ది భక్తులు సమ్మక్క-సారలమ్మ మొక్కులు చెల్లించుకుంటారు.కోయ గిరిజ నుల ఉనికికోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర కీ. శ.1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతా పరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగు తున్నట్లు స్థల పు రాణాలు తెలుపు తున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించే వారు. ఇతను కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగ రాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పడిగిద్ద రా జు సతీమణి సమ్మక్క . ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం జరిపిం చారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు సంతా నం. మేడారం పరిగణాలను కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలిం చేవారు. ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ సై న్యం వంటి వరంగల్లు జిల్లాలోని ములుగు సమీపంలో లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పా టు చేసుకొని యుద్ధం ప్రకటించారు. పగిడిద్దరాజు అతని కుమార్తెలు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది.ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది.తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతా పరుద్రుడు సమ్మక్క భక్తుడి గా మారాడు.మేడారం జాతర గద్దెల ప్రాంగణాని కి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు ప ది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమా లు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతపూ జారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకల గుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసు కువస్తారు. ఈ సం దర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తా రు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.
మూలాలు [మార్చు]
|
|
|
|---|---|
| కాల్వపల్లి · మేడారం (సమ్మక్కజాతర) · ఊరట్టం · జంపంగవాయి · కన్నెబోయినపల్లి · బయ్యక్కపేట్ · నార్లపూర్ · గోనేపల్లి · వెంగళాపురం · పడిగపురం (పి.పి) · ఎల్బాక · కొండపర్తి · ఇమ్మడిగూడెం · బిట్టుపల్లి (పి.ఎల్) · వడ్డెగూడెం · బొందల్ · తాడ్వాయి · కామారం (పి.టి) · బంజర్ఎల్లాపూర్ · సెరిగరం · భూపతిపురం · గంగారం (పి.ఎ) · అన్నారం · దామెర్వాయి · కాటపురం · పంబాపురం · నర్సాపూర్ (పి.ఎ) · చౌలేడ్ · లవ్వల్ · పోచపల్లి · లింగాల · బొల్లేపల్లి (పి.ఎల్) · నర్సాపూర్ (పి.ఎల్) · అల్లిగూడెం · కౌసెట్టివాయి · అంకంపల్లి (తాడ్వాయి మండలం) · ఆశన్నగూడెం ఎల్లాపూర్ · వీరపురం · కామారం (పి.ఎ) · బీరెల్లి · రంగాపురం (పి.ఎ) |