వికీపీడియా నుండి
(
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు కలవు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1957లో ఇతర నియోజకవర్గంలో కలవగా మళ్ళీ 1962లో ప్రత్యేకంగా ఏర్పడింది. 1978లో మర్రి చెన్నారెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థిని గెలిపించిన ప్రత్యేకతను ఈ నియోజకవర్గం దక్కించుకుంది. ఇటీవలి వరకు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ స్థానం పొంది అనేక పదవులు నిర్వహించి, నవతెలంగాణ పార్టీ స్థాపించిన టి.దేవేందర్ గౌడ్ వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎన్నికలలో కంగ్రెస్ పార్టీ 6 సార్లు, తెలుగుదేశం పార్టీ 4 సార్లు విజయం సాధించగా, 1962లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వందేమాతరం రామచంద్రారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుడు కె.వి.రంగారెడ్డిపై గెలుపొందినాడు.[1]
[మార్చు] ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,80,622
- ఓటర్ల సంఖ్య [2](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,60,281
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
| సంవత్సరం |
గెలుపొందిన సభ్యుడు |
పార్టీ |
ప్రత్యర్థి |
ప్రత్యర్థి పార్టీ |
| 1962 |
వి.రామచందర్ రావు |
ఇండిపెండెంట్ |
కె.వి.రంగారావు |
భారత జాతీయ కాంగ్రెస్ |
| 1967 |
సుమిత్రాదేవి |
భారత జాతీయ కాంగ్రెస్ |
కె.ఆర్.అబ్బయ్య |
ఇండిపెండెంట్ |
| 1972 |
సుమిత్రాదేవి |
కాంగ్రెస్ పార్టీ |
వి.ప్రకాష్ |
సి.పి.ఎం |
| 1978 |
మర్రి చెన్నారెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
టి.మోహన్ రెడ్డి |
జనతా పార్టీ |
| 1983 |
ఉమావెంకట్రాంరెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
ట్.పి.రెడ్డి |
తెలుగుదేశం పార్టీ |
| 1985 |
కె.సురేందర్ రెడ్డి |
తెలుగుదేశం పార్టీ |
జి.సంజీవరెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
| 1989 |
ఉమావెంకట్రాంరెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
కె.సురేందర్ రెడ్డి |
తెలుగుదేశం పార్టీ |
| 1994 |
టి.దేవేందర్ గౌడ్ |
తెలుగుదేశం పార్టీ |
ఎస్.ఉమాదేవి |
కాంగ్రెస్ పార్టీ |
| 1999 |
టి.దేవేందర్ గౌడ్ |
తెలుగుదేశం పార్టీ |
ఎస్.హరివర్థన్ రెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
| 2004 |
టి.దేవేందర్ గౌడ్ |
తెలుగుదేశం పార్టీ |
కె.ఆర్.సురేందర్ రెడ్డి |
తెలంగాణా రాష్ట్ర సమితి |
| 2009 |
కె.లక్ష్మారెడ్డి |
కాంగ్రెస్ పార్టీ |
ఎన్.ప్రభాకర్ గౌడ్ |
తెలుగుదేశం పార్టీ |
[మార్చు] 2004 ఎన్నికలు
2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి టి.దేవేందర్ గౌడ్ వరుసగా మూడవ పర్యాయం పోటీచేయగా మొత్తం 172904 ఓట్లు సాధించి సమీప తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కె.ఆర్.సురేందర్ రెడ్డిపై 25704 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సురేందర్ రెడ్డికి 147200 ఓట్లు లభించాయి.
- 2004 ఎన్నికలలో అభ్యర్థులు సాధించిన ఓత్ల వివరాలు
-
-
| అభ్యర్థి పేరు |
పార్టీ |
సాధించిన ఓట్లు |
| టి.దేవేందర్ గౌడ్ |
తెలుగుదేశం పార్టీ |
172916 |
| కె.సురేందర్ రెడ్డి |
తెలంగాణ రాష్ట్ర సమితి |
147209 |
| సి.వి.రత్నం |
బహుజన్ సమాజ్ పార్టీ |
8484 |
| ఎం.అనురాధ |
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా |
7113 |
| పి.బాలకిషన్ |
స్వతంత్ర అభ్యర్థి |
2677 |
| కె.సత్యనారాయణ |
స్వతంత్ర అభ్యర్థి |
2322 |
| హమిదుల్ హక్ చౌదరి |
స్వతంత్ర అభ్యర్థి |
1430 |
| జి.ప్రభాకర్ రెడ్డి |
స్వతంత్ర అభ్యర్థి |
981 |
[మార్చు] నియోజకవర్గ ప్రముఖులు
- మర్రి చెన్నారెడ్డి
- ప్రధాన వ్యాసం: మర్రి చెన్నారెడ్డి
- ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ మరియు తమిళనాడు రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన ప్రముఖుడు మర్రి చెన్నారెడ్డి మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకసారి పోటీచేసి గెలుపొందినాడు. 1919, జనవరి 13న వికారాబాదు తాలుకాలోని సిర్పూరులో జన్మించిన చెన్నారెడ్డి 1996లో మరణించాడు.
- టి.దేవేందర్ గౌడ్
- ప్రధాన వ్యాసం: టి.దేవేందర్ గౌడ్
- రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను, రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్మెన్‌గానూ, రాష్ట్రమంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన ప్రముఖ నేత టి.దేవేందర్ గౌడ్ మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో 1953, మార్చి 18న జన్మించాడు. కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ఎన్.టి.రామారావు నేతృత్వంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. తన తెలంగాణా వాదానికి పార్టీలో తగిన ప్రతిస్పందన లభించకపోవడంతో 2008, జూన్ 23న తెలుగుదేశం పార్టీకి రాజానామా చేసి నవతెలంగాణా ప్రజాపార్టీ పేరుతో కొత్త పార్టీ స్థాపించాడు. ఫిబ్రవరి 2009లో నవతెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశాడు.
[మార్చు] ఇవి కూడా చూడండి