మైక్రోసాఫ్ట్ సర్ఫేస్

వికీపీడియా నుండి

మూస:Infobox software

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ (కోడ్‌నేమ్ మిలాన్‌ ) అనేది మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ఒక మల్టీ-టచ్ ఉత్పత్తి. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్‌ సంయోగ సాంకేతికతతో ఇది అభివృద్ధి చేయబడింది. హావభావాల గుర్తింపు యొక్క ఉపయోగం ద్వారా డిజిటల్ కంటెట్‌ను నడిపేందుకు ఒక యూజర్ లేదా బహుళ యూజర్లను ఇది అనుమతిస్తుంది. చేతుల లేదా భౌతిక వస్తువుల కదలిక అనేది ఇందులో భాగం వహిస్తుంది. మే 29, 2007న D5 సమావేశం సందర్భంగా దీని గురించి ప్రకటించడం జరిగింది.[1] రెస్టారెంట్లు, హోటళ్లు, రీటైల్, పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలు లాంటి ఆతిధ్య వ్యాపారాలు మరియు వ్యూహాత్మక పర్యావలోకనం కోసం వినియోగించే సైన్యం లాంటివారు ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ యొక్క లక్ష్యాత్మక వినియోగదారుల కోవలోకి వస్తారు. AT&T స్టోర్లలో వినియోగదారుల ఉపయోగం కోసం సర్ఫేస్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఏప్రిల్ 17, 2008న ప్రాథమికంగా ఇది అందుబాటులోకి వచ్చింది.[2] 2008 US అధ్యక్ష్య ఎన్నికల సమయంలో కవరేజ్ కోసం MSNBC ద్వారా సర్ఫేస్ ఉపయోగించబడింది;[3] అలాగే డిస్నీల్యాండ్ యొక్క ఫ్యూచర్ హోమ్ ప్రదర్శనల ద్వారా,వివిధ హోటళ్లు, జూదశాలల ద్వారా కూడా ఇది ఉపయోగించబడింది. CBS సిరీస్ CSI: Miami మరియు EXTRA! ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్‌లలో కూడా సర్ఫేస్ దర్శనమిచ్చింది. మార్చి 2009 నాటికి సర్ఫేస్ ఇంటర్‌ఫేస్ కోసం అఫ్లికేషన్లను అభివృద్ది చేస్తోన్న 11 దేశాల్లోని 120 మంది భాగస్వాములను మైక్రోసాఫ్ట్ కలిగి ఉంది.[4]

విషయ సూచిక

అవలోకనం [మార్చు]

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ అనేది ఒక సర్ఫేస్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫాం, అది సహజసిద్ధమైన చేతి సంకేతాలు మరియు నిజ ప్రపంచ వస్తువుల కదలికలకు ప్రతిస్పందిస్తుంది. ఇది ఒక 360-డిగ్రీల యూజర్ ఇంటర్ఫేస్‌, ఒక XGA DLP ప్రొజెక్టర్‌తో పాటు ఒక 30- అంగుళాల ప్రతిబింబించే ఉపరితలాన్ని కింది భాగంలో కలిగి ఉంటుంది. ఆబ్జెక్టులు మరియు వ్యక్తుల వేలి స్పర్శలు ఉపరితలంపై పడినప్పుడు ఉత్తేజితమయ్యే ఇన్ఫ్రారెడ్ లైట్ యొక్క రిఫ్లెక్షన్లను మిషన్ హౌసింగ్‌లో ఉండే ఐదు కెమెరాలు రికార్డ్ చేసిన సమయంలో సర్ఫేస్ అనేది దాని కింది భాగంలో ఒక ఇమేజ్‌ను ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ సర్ఫేస్ అనేది వస్తువును గుర్తించడం, వస్తువు/వేలు జ్ఞానాన్ని గుర్తించడం మరియు పరిశీలనలతో పాటు మల్టీ-టచ్, మల్టీ-యూజర్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. యూజర్లు తమ వేలితో తాకడం లేదా లాగడం మరియు స్క్రీన్ వెంబడి ఉండే పెయింట్‌బ్రష్‌లు లాంటి వస్తువులను ఉపయోగించడం ద్వారా, లేదా దానిపై ఉండే వస్తువులను కదిలించడం ద్వారా మిషన్‌తో సంబంధాన్ని ఏర్పరుచుకోవచ్చు. ఈ రకమైన విధానం ద్వారా కంప్యూటర్లతో సంబంధాన్ని ఏర్పరచుకోవడమనేది నేచురల్ యూజర్ ఇంటర్ఫేస్ (NUI)గా సుపరిచితం.

ఏక కాలంలో 52 స్పర్శలకు ప్రతిస్పందించేందుకు సర్ఫేస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఒక విలేకరి సమక్షంలో ప్రదర్శన సందర్భంగా, సర్ఫేస్ కంప్యూటింగ్ గ్రూప్ యొక్క మార్కెటింగ్ డైరెక్టర్ మార్క్ బోల్జెర్, తన వేలిని ఒక ఆన్-స్క్రీన్ పెయింట్ ప్యాలెట్‌లో "ముంచి", అటుపై ఒక చిరునవ్వుల ముఖం చిత్రించడం కోసం ప్యాలెట్‌లో ముంచిన తన వేలిని స్క్రీన్ వెంబడి గీశారు. దీని తర్వాత జుట్టుతో నిండిన ఒక పూర్తి తలను చిత్రించడం కోసం ఆయన ఒకేసారి తన 10 వేళ్లను ఉపయోగించారు.

ఆబ్జెక్టులపై ప్రత్యేకంగా రూపొందించిన బార్‌కోడ్-శైలి "సర్ఫేస్ ట్యాగ్‌లు"ఉపయోగించడం వల్ల, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ అనేది విభిన్న రకాల అంశాలను అందిచగలదు. ఉదాహరణకు డిన్నర్ చేస్తున్న సమయంలో తాగుతున్న వైన్ మరికొంచెం కావాలనుకున్నప్పుడు బల్ల వద్ద నుంచే దాన్ని కోరవచ్చు. ఆ రకమైన వైన్‌ని సర్ఫేస్‌పై ఉంచడం ద్వారా లేదా యూజర్ ప్రామాణికత కోసం జారీచేసిన ఒక పాస్‌‌వర్డ్ తో సంయోగం చెందడం ద్వారా ఇలా చేయవచ్చు.

వాణిజ్యపరమైన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ యూనిట్ ధర 12,500 (యూనిట్ మాత్రమే) డాలర్లు, ఇక ఒక డెవలపర్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ యూనిట్ ధర 15,000 డాలర్లు, ఇది ఒక డెవలరప్ యూనిట్, ఐదు సీట్లు మరియు సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

భాగస్వామ్య కంపెనీలు సర్ఫేస్‌ను తమ హోటళ్లు, రెస్టారెంట్లు, మరియు రీటైల్ దుకాణాల్లో ఉపయోగిస్తాయి. రెస్టారెంట్లలో భోజనాన్ని ఎంపిక చేసేందుకు, హోటల్ గది నుంచే విహార యాత్రలు, ప్రదేశాలు ఎంచుకునేందుకు సర్ఫేస్ ఉపయోగపడుతుంది. వినియోగదారులు తమ క్రెడిట్ కార్డును టేబుల్‌పై ఉంచడం ద్వారా సంగీతం, పుస్తకాలు, ఇతర అంశాల కోసం కూర్చున్న చోటి నుంచే డబ్బు చెల్లించేలా చేసేందుకు స్టార్‌వుడ్ హోటళ్లు ప్రయత్నాలు చేస్తున్నాయి. AT&T స్టోర్లలో, ప్రణాళికల యొక్క పరస్పర సమర్పణలు, కవరేజ్, మరియు ఫోన్ లక్షణాల పరిశీలనలతో పాటు రెండు ఫోన్లను బల్లపై ఉంచినప్పుడు వినియోగదారుడు ఆ రెండింటినీ ఒకేసారి చూసేందుకు వీలు కావడంతో పాటు ధరలను, లక్షణాలను, ప్రణాళికలను పోల్చేందుకు సర్ఫేస్ ఉపయోగపడుతుంది. 2008 అధ్యక్ష ఎన్నికల సమయంలో సమాచారాన్ని, ఎన్నికల వరకు ఆ ప్రక్రియ విశ్లేషణల గురించి వీక్షకులతో పంచుకోవడానికి MSNBC సర్ఫేస్‌ను ఉపయోగించింది. పోలింగ్, ఎన్నికల ఫలితాలు, అభిప్రాయాల పోకడలు మరియు జనాభా సమాచారం మరియు వోటింగ్ తీరుతెన్నులను మరియు ఫలితాల గురించి ముందస్తు జోస్యం చెప్పేందుకు దేశ మ్యాప్‌లను చూపడం లాంటి పనులన్నింటినీ యాంకర్ కేవలం తన వేలిని కదపడం ద్వారా నిర్వహించగలిగారు. కొన్ని హోటళ్లు, జూదశాలల్లో సర్ఫేస్ ద్వారా యూజర్లు కొంతవరకు వీడియోల వీక్షణ, మ్యాప్‌లను చూడడం, పానీయాలను కోరడం, గేమ్‌లు ఆడడం, చాట్ చేయడం, సర్ఫేస్ టేబుళ్ల మధ్య ఉన్న వారితో సంభాషించడం లాంటివి చేయగలరు.

చరిత్ర [మార్చు]

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్‌ని ఉపయోగించి ప్రదర్శన

సర్ఫేస్‌ ఉత్పత్తి ఆలోచనకు సంబంధించిన భావన అనేది 2001లో మైక్రోసాఫ్ట్ హార్డ్ వేర్‌కు చెందిన స్టీవెన్ బతిచే, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్కు చెందిన ఆండీ విల్సన్‌లచే తెరమీదకు వచ్చింది.[5]

అటుపై ఈ ఆలోచనను తర్వాతి దశ అభివృద్ధి వైపు తీసుకు వెళ్ళడం కోసం 2001 అక్టోబర్‌లో, బతిచే, విల్సన్‌లు కీలక వ్యక్తులుగా ఒక వర్చువల్ బృందం ఏర్పాటైంది.

అటుపై 2003లో ఒక బృంద సమీక్షలో భాగంగా తమ ఆలోచన గురించి ఆ బృందం మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ కు వివరించింది. దీనితర్వాత, ఆ వర్చువల్ బృందం విస్తరించడంతో పాటు, కేవలం నెలరోజుల్లో T1 పేరుతో ఒక ప్రోటోటైప్ తయారైంది. పై భాగంలో మొత్తం కత్తరించడంతో పాటు డిఫ్యూసర్‌గా ఉపయోగించిన ఆర్కిటెక్ట్ వెల్లూమ్ యొక్క ఒక షీట్‌ను కలిగిన IKEA టేబుల్‌పై ఈ ప్రోటోటైప్ ఆధారపడి ఉంటుంది. సర్ఫేస్‌తో పాటు ఆ బృందం పిన్‌బాల్, ఒక ఫోటో బ్రౌజర్, వీడియో పజిల్ లాంటి మరికొన్ని అఫ్లికేషన్లను కూడా అభివృద్ధి చేసింది. తర్వాతి ఏడాది నాటికి సర్ఫేస్ కోసం 85కు పైగా ప్రారంభ ప్రోటోటైప్స్ ని మైక్రోసాఫ్ట్ నిర్మించింది. 2005లో హార్ట్ వేర్‌కు సంబంధించిన తుది డిజైన్ పూర్తయ్యింది.

2002 సైన్స్ ఫిక్షన్ సినిమా మైనారిటీ రిపోర్ట్ లో సర్పేస్‌ను పోలిన భావన ఉపయోగించబడింది. సినిమాలో ఉపయోగించిన డివైజ్‌కు సంబంధించిన భావన కోసం సినిమా తయారీ సమయంలో మైక్రోసాఫ్ట్ తో సంప్రదించడం జరిగిందని డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఒక DVD వ్యాఖ్యానంలో భాగంగా వివరించారు. మరోవైపు సర్ఫేస్ ప్రాజెక్టును తీర్చిదిద్దే పనిలో భాగంగా MIT నుంచి వచ్చిన సినిమా సాంకేతికత కన్సల్టెంట్స్ కూడా కలిసి పనిచేశారు.[6]

మే 30, 2007న మైక్రోసాఫ్ట్ CEO స్టీవ్ బల్మెర్ ద్వారా ది వాల్ స్ట్రీట్స్ జర్నల్‌ యొక్క 'D: ఆల్ థింగ్స్ డిజిటల్' కాన్ఫరెన్స్ ఇన్ కారల్స్ బాద్, కాలిఫోర్నియా [7] లో సర్ఫేస్ ఆవిష్కరించబడింది.సర్ఫేస్ కంప్యూటింగ్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ & డివైజెస్ విభాగంలోని మైక్రోసాఫ్ట్ యొక్క ప్రోడక్టివిటీ మరియు ఎక్స్ టెండ్ కన్జూమర్ ఎక్స్ పీరియన్స్ గ్రూప్‌లో భాగంగా ఉంటుంది. హర్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, స్టార్‌వుడ్ హోటల్స్ & రిసార్ట్స్ వరల్ట్ వైడ్, T-మైబైల్ మరియు ఇంటర్నేషనల్ గేమ్ టెక్నాలజీ డిస్ట్రిబ్యూటర్ లాంటి సంస్థలతో పాటు మరికొన్ని సంస్థలు మొదటగా సర్ఫేస్‌ను ఉపయోగించాయి.[8]

ఏప్రిల్ 17, 2008న AT&T మొట్టమొదటి సర్ఫేస్ ఉపయోగ రీటైల్ కేంద్రంగా మారింది.[9] 2008 జూన్‌లో మైక్రోసాఫ్ట్ సర్పేస్‌ను హర్రాస్ ఎంటర్‌టైన్‌మైంట్ తన రియో ఐబార్‌[10]లో ప్రవేశపెట్టింది. అలాగే డిస్నీల్యాండ్ సైతం దీనిని టుమారోల్యాండ్, ఇన్నోవెన్సన్స్ డ్రీమ్ హోమ్‌లలో ప్రవేశపెట్టింది[11]. 2008 ఆగస్టు 13న షెరేసన్ హోటల్స్ తమ హోటల్ లాబీల్లోని 5 ప్రదేశాల్లో సర్ఫేస్‌ను పరిచయం చేసింది[12]. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రసారాల కోసం ఎన్నికల మ్యాప్‌లపై పనిచేయడం కోసం 2008 సెప్టెంబర్ 8న MSNBC సర్ఫేస్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. MSNBC రాజకీయ డైరెక్టర్ చుక్ టొడ్, దీనికి నాయకత్వం వహించారు.

లక్షణాలు [మార్చు]

వస్తువు గుర్తింపు

డైరెక్ట్ ఇంటరాక్షన్, మల్టీ-టచ్ కాంటాక్ట్, ఒక మల్టీ-యూజర్ అనుభవం, మరియు ఆబ్జెక్ట్ గుర్తింపు లాంటి నాలుగు ప్రధాన భాగాలు సర్ఫేసెస్ ఇంటర్‌ఫేస్‌లో ముఖ్యమైనవని మైక్రోసాఫ్ట్ సూచించింది.

డైరెక్ట్ ఇంటరాక్షన్ అనేది మౌస్ లేదా కీబోర్డ్ అవసరం లేకుండా, ఒక అఫ్లికేషన్‌తో సంబంధం ఏర్పరచుకునేందుకు యూజర్ సులభంగా దాన్ని తాకగలిగే సామర్థ్యాన్ని సూచిస్తుంది. మల్టీ-టచ్ అనేది మౌస్‌లోని ఒకే ఒక కర్సర్‌లా కాకుండా, ఒక ఇంటర్‌ఫేస్‌తో బహుళ సంబంధాల కేంద్రాలు ఉండే సామర్థ్యాన్ని సూచిస్తుంది. మల్టీ- యూజర్ అనేది మల్టీ-టచ్ ప్రయోజనాలను కల్పిస్తుంది. తద్వారా అనేకమంది వ్యక్తులు సర్ఫేస్‌పై విభిన్న ప్రదేశాల నుంచి ఒకరితర్వాత ఒకరుగా ఒక అప్లికేషన్‌తో సంబంధాలు ఏర్పరచుకునేందుకు సాయపడుతుంది. ఇక ఆబ్జెక్ట్ గుర్తింపు అనేది సర్ఫేస్ ఉపరితలంపై ఉన్న ట్యాగ్‌డ్ ఆబ్జెక్టుల యొక్క ఉనికి, దిశను గుర్తించగలిగిన డివైజ్ యొక్క సామర్థ్యాన్ని సూచిస్తుంది.

నాన్-డిజిటల్ ఆబ్జెక్టులను ఇన్‌పుట్ డివైజ్‌లుగా ఉపయోగించేందుకు ఈ సాంకేతికత అనుమతిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ సాఫ్ట్ వేర్‌లో ఒక డిజిటల్ పెయింటింగ్‌ని సృష్టించాలంటే, ఒక సాధారణ పెయింట్ బ్రష్ ఉపయోగించబడుతుంది.[13] ఇన్‌పుట్ కోసం కెమెరాలను ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది, నిర్భందంగా అవసరమైన లక్షణాలైన టచ్‌స్క్రీన్ లేదా టచ్‌ప్యాడ్ డివైస్‌లు అయిన కెపాసిటేన్స్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, లేదా ఉపయోగించే పరికరం యొక్క ఉష్ణోగ్రత(టచ్‌స్క్రీన్ చూడండి) లాంటివాటిపై సిస్టం ఆధారపడదు.

సర్ఫేస్‌పై గురిపెట్టబడిన 850-నానోమీటర్-వేవ్‌లెంగ్త్ LED లైట్ ఆధారమైన ఒక నియర్-ఇన్ఫ్రారెట్ ద్వారా ఈ కంప్యూటర్ యొక్క "విజన్" సృష్టించబడుతుంది. టేబుల్‌టాప్‌పై ఉన్న ఒక ఆబ్జెక్ట్ ను తాకిన సమయంలో, ఆ స్పర్శను గుర్తించడంతో పాటు టేబుల్‌టాప్‌లో స్పర్శించబడిన వాటికి ప్రతిస్పందించడం కోసం మొత్తం 1024 x 768 రిజల్యూషన్‌తో ఆ లైట్ మల్టిపుల్ ఇన్ఫ్రారెట్ కెమెరాలకు ఫ్రతిఫలిస్తుంది.

సర్ఫేస్ అనేది వినియోగదారుల కోసం సృష్టించబడిన ప్రాథమిక అఫ్లికేషన్లతో పాటు ఫోటోలు, సంగీతం, వర్చువల్ కన్సియరేజ్, గేమ్స్ లాంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.[14]

నీటి కుంట ప్రభావిత "అట్రాక్ట్" అనే అఫ్లికేషన్‌ను సర్ఫేస్‌తో ప్రీఇన్స్టాల్డ్ గా వచ్చే మరో అద్భుతమైన అంశంగా చెప్పవచ్చు. ఇది ఆకులు, రాళ్లతో ఉన్న ఒక నీటి మడుగు "చిత్రం" (విండోస్ XP లేదా విస్టాల్లో ఇలాంటి స్క్రీన్ సేవర్లు అనేకం ఉంటాయి)లాగా ఉంటుంది. యూజర్లు స్క్రీన్‌ని తాకడం ద్వారా, అసలైన నీటి ప్రవాహంలో లాగే ఈ బొమ్మలో కన్పించే నీటిలోనూ అలలను సృష్టించవచ్చు. స్పర్శ యొక్క తీవ్రతను బట్టి బొమ్మలో అలలు తయారవుతాయి, దీంతోపాటు ఆ నీటిలో ఉన్న ఆబ్జెక్టులు అవరోధాలు సృష్టించడం ద్వారా నిజమైన నీటి గుంటలో లాగే ఏర్పడిన అలలు ఆగిపోతాయి.

ప్రత్యేక లక్షణాలు [మార్చు]

సర్ఫేస్ అనేది ఒక 30-ఇంచుల (76 cm) డిస్‌ప్లే, బల్ల ఆకారంలో ఉండే ఈ భాగం, 22 ఇంచుల (56 cm) ఎత్తు, 21 ఇంచుల (53 cm) లోతు, మరియు 42 ఇంచుల (107 cm) వెడల్పుతో ఉంటుంది.[14]. సర్ఫేస్ టేబుల్ పైతలం ఆక్రిలిక్‌తో చేసినది కాగా, దాని లోపలి చట్రం స్టీల్ పొడితో తయారై ఉంటుంది. సాఫ్ట్ వేర్ ప్లాట్‌ఫాం అనేది విండోస్ విస్టా యొక్క కస్టమ్ వెర్షన్‌పై నడుస్తుంది. అలాగే, దీని వైర్ ఎథెర్నెట్ 10/100, వైర్‌లైస్ 802.11 b/g, మరియు బ్లూటూత్ 2.0 కనెక్టివిటీని కలిగి ఉంటుంది.[14] సర్ఫేస్ అఫ్లికేషన్లను రాసే సమయంలో విండోస్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్ లేదా మైక్రోసాఫ్ట్ XNA సాంకేతికతల్లో ఏదో ఒకదాన్ని ఉపయోగిస్తారు.[15]

మైక్రోసాఫ్ట్ యొక్క MSDN కాన్ఫరెస్ సమయంలో, బిల్‌గేట్స్ మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ కింది వాటిని సమకూర్చుకోవడం కోసం "అత్యుత్తమ" నిపుణులను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు:

  • రెండు ATX మదర్‌బోర్డుల పరిమాణంలో ఉండే ఒక కస్టమ్ మదర్‌బోర్డ్ ఆకారపు భాగంతో పాటు ఇంటెల్ కోర్ క్వార్డ్ జెయాన్ "వుడ్‌క్రెస్ట్" @ 2.66 GHz
  • 4GB DDR2-1066 రామ్
  • 1TB 7200RPM హార్డ్ డ్రైవ్

ప్రస్తుతం వాణిజ్యపరమైన వెర్షన్ కింది ప్రత్యేక లక్షణాలతో లభిస్తోంది[16]:

  • ఇంటెల్ కోర్ 2 డ్యుయో @ 2.13 GHz
  • 2GB DDR2 రామ్
  • 250GB SATA హార్డ్ డ్రైవ్

అఫ్లికేషన్ల అభివృద్ధి [మార్చు]

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ అఫ్లికేషన్లు విండోస్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్ లేదా XNAలో రాయబడుతాయి. అభివృద్ధి విధానం అనేది చాలా వరకు సాధారణ విస్టా అభివృద్ధి లాగే ఉంటుంది. అయితే, సర్ఫేస్ యొక్క అద్వితీయమైన ఇంటర్‌ఫేస్ కారణంగా కస్టమ్ WPF నియంత్రణలు మాత్రం సర్ఫేస్ బృందం ద్వారా తయారు చేయబడుతాయి. WPFలో అప్పటికే నిష్ణాతులైన నిపుణులు, పెద్ద స్థాయి హోటళ్లు, జూదశాలలు మరియు రెస్టారెంట్లలో నియోగించడం కోసం అవసరమైన సర్ఫేస్ ఏప్స్ ను రాసేందుకు SDKను ఉపయోగించుకోగలరు.[17]

సంబంధిత మైక్రోసాఫ్ట్ పరిశోధన ప్రాజెక్టులు [మార్చు]

సెకండ్‌లైట్‌గా అనువదించిన ఒక సంబంధిత సాంకేతికత గురించిన సమాచారాన్ని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ప్రచురించింది[18]. ఇప్పటివరకు పరిశోధన దశలో భాగంగా[19], ప్రధాన డిస్‌ప్లే పైన లేదా పై భాగంలో ఉండే భౌతిక ఆబ్జెక్టుల్లో ఈ ప్రాజెక్ట్ సెకండరీ ఇమేజెస్‌ని హెచ్చింపు చేసింది.

వీటిని కూడా చూడండి [మార్చు]

  • టచ్ స్కేప్
  • డైమన్డ్ టచ్చ్
  • రియాక్ టేబుల్
  • జెస్చర్(సంజ్ఞ) టేబుల్
  • స్మార్ట్ సర్ఫేస్‌ ( మాలేషియన్ సంస్థ )
  • స్మార్ట్ టేబుల్
  • లెమర్ ఉత్పాదక పరికరం
  • MPX
  • బహు-స్పర్శ
  • ఫిలిప్స్ ఎంటర్టేబుల్
  • టోర్చ్ లైట్
  • విండోస్ 7
  • సర్ఫేస్‌ కంప్యుటింగ్
  • దూర ద్రుష్టి

సూచికలు [మార్చు]

  1. Script error
  2. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; att-release అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. http://blogs.msdn.com/surface/archive/2008/09/08/Live-from-MSNBC_2C00_-it_2700_s-Microsoft-Surface.aspx
  4. http://www.pcworld.com/article/160473/article.html?tk=nl_dnxnws
  5. "Microsoft Surface Fact History". Microsoft. Retrieved 2007-05-30. 
  6. సవరణ :“ద ఐల్యాండ్” డిడ్ నాట్ ఫీచర్ ఏ సర్ఫేస్ - ఐస్టార్టెడ్సంథింగ్
  7. Microsoft (2007-05-29). "Look What's Surfacing at Microsoft". Press release. http://www.microsoft.com/presspass/features/2007/may07/05-29Surface.mspx. Retrieved 2007-05-30.
  8. Microsoft (2007-05-29). "Microsoft Launches New Product Category: Surface Computing Comes to Life in Restaurants, Hotels, Retail Locations and Casino Resorts". Press release. http://www.microsoft.com/presspass/press/2007/may07/05-29MSSurfacePR.mspx. Retrieved 2007-05-30.
  9. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఇప్పుడు AT&T కేంద్రాల్లో
  10. హరాస్ ఎంటర్టైన్మెంట్ రయో ఐబార్ లో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ఏర్పాటు చేసి అథిదులకు అత్యాధునికమైన మరియు పూర్తిగా నిమగ్నమయ్యే విధముగా కొత్త అనుభవాన్ని కలిగించారు.
  11. డిస్నీస్ ఇన్నోవేషన్స్ డ్రీం హొం మైక్రోసాఫ్ట్ మరియు HP కు ఒక పెద్ద ప్రకటన వలే ఉన్నదిబట్ ఐ స్టిల్ వాంట్ ఇట్
  12. http://www.microsoft.com/Presspass/press/2008/aug08/08-13SheratonMSSurfacePR.mspx షెరటన్ హొటల్స్ మరియు రిసోర్ట్స్ లోబి ని మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ తో ఆధునీకరించారు.
  13. "Microsoft Surface brings computing to the table". Retrieved 2007-05-30. 
  14. 14.0 14.1 14.2 "Microsoft Surface Fact Sheet". Microsoft. Retrieved 2007-05-30. 
  15. "Development Frameworks". Microsoft. Retrieved 2008-05-15. 
  16. ఉత్పత్తుల యొక్క విషయ జాబిత
  17. మైక్రోసాఫ్ట్స సర్ఫేస్ వెనక ఏమేమి దాగి ఉన్నాయి ? మైక్రోసాఫ్ట్ తో విపులంగా జాబులు మరియు జవాబులు
  18. http://research.microsoft.com/en-us/projects/hands-on-computing/default.aspx#secondlight
  19. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ భవిష్యత్తు పై వాటిల్లిన అనుమానం తొలగిస్తూ

బాహ్య లింకులు [మార్చు]

మూస:Microsoft