మైఖేల్ మధుసూదన్ దత్

వికీపీడియా నుండి
మైఖేల్ మధుసూదన్ దత్
MichaelMadhusudanDatta.jpg
మైఖేల్ మధుసూదన్ దత్
జననం: {{{birth_date}}}
వృత్తి: కవి, నాటక రచయిత

మైఖేల్ మధుసూదన్ దత్ (దత్త), (బెంగాళీ: মাইকেল মধুসূদন দত্ত మైఖేల్ మొధుసూదొనొ దొత్తొ) (1824-1873), 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాళీ కవి మరియు నాటక రచయిత. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని జెస్సోర్ సమీపములోని సాగర్‌దారి గ్రామంలో మధుసూదన్ దత్ గా జన్మించాడు. బెంగాళీ నాటకరంగ ఆద్యులలో ఒకడు. ఈయన ప్రసిద్ధ కృతి మేఘ్‌నాథ్ బద్ద్ కావ్య (బెంగాళీ: মেঘনাদবধ কাব্য), దుఃఖభరిత కావ్యం. తొమ్మిది అంకాలతో శైలిలోనూ, వస్తువులోనూ బెంగాళీ సాహిత్యంలో అద్వితీయమైనది ఈ కావ్యం. ఈయన బాధలు మరియు ప్రేమ ప్రలాపాల గురించి స్త్రీ గొంతుకతో అనేక కవితలు కూడా వ్రాశాడు.

బాల్యంనుండే, మధుసూదన్ ఆచార వ్యవహారాలలో ఆంగ్లేయునివలె ఉండాలని ఉవ్విల్లూరాడు. హిందూ జమిందారీ కుటుంబంలో పుట్టిన ఈయన, తన కుటుంబం యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవాన్ని స్వీకరించి మైఖేల్ అనే పేరు పెట్టుకున్నాడు. అయితే ఆ తరువాత జీవితంలో తన ఆంగ్లేయ మరియు పాశ్చాత్య మోజుకు పశ్చాత్తాపపడి తన మాతృభూమికి మద్దతునిచ్చాడు. ఆ దశలోని ఈయన వ్రాసిన కవితలు, గేయాలలో అది ప్రతిఫలించింది.

మధుసూదన్ దత్త్ ను బెంగాళీ సాహిత్వపు గొప్ప కవులలో ఒకడిగా మరియు బెంగాళీ సానెట్ పితగా పరిగణిస్తారు. ఈయన అమృతాక్షర ఛందస్సు (బ్లాంక్ వర్స్) బాగ ఆపోసనపట్టాడు. మధుసూదన్ దత్త్ జూన్ 29, 1873న కలకత్తాలో మరణించాడు

[మార్చు] ప్రముఖ కృతులు

  • తిలోత్తమ, 1860
  • మేఘ్‌నాథ్ బద్ద్ కావ్య (మేఘనాధుని పతనం), 1861
  • రత్నావళి
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు
వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు