మైదుకూరు
| ?మైదుకూరు మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | మైదుకూరు |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
72,356 (2001) • 36899 • 35457 • 57.58 • 72.68 • 41.91 |
మైదుకూరు (ఆంగ్లం: Mydukur), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ పట్టణము రాయలసీమ కూడలి గా ప్రసిద్ది కెక్కినది. తిరుపతి , కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణము ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ది కెక్కినది.
విషయ సూచిక |
[మార్చు] గ్రామ చరిత్ర
ఈ పట్టణము లోని ప్రసిద్ద మాధవరాయ స్వామి పేరు మీదుగా ఈ పట్టణానికి మాధవకూరు , క్రమేణా మైదుకూరు అనే పేరు స్ఠిరపడినది అని చెబుతారు.
[మార్చు] పాడి పంటలు
ఈ ప్రాంతం లో ఎక్కువగా వరి, కృష్ణాపురం ఉల్లి , పసుపు , ప్రొద్దు తిరుగుడు, మిరప, టమేటా పంటలు సాగు చేస్తారు. ఇక్కడ పండంచే కృష్ణాపురం ఉల్లి కి సింగపూర్ , శ్రీలంక తదితర దేశాలలో మంచి గిరాకీ ఉన్నది. ఈ ప్ర్రాంతంలో పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ది చెందింది. ప్రతి శనివారం జరిగే 'సంత' లో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం మైదుకూరు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] ప్రధాన సమాచారము
- పిన్ కోడ్ సంఖ్య - 516172
- దూరవాణి సంఖ్య - 08564
[మార్చు] దర్శనీయ ప్రదేశాలు
- శ్రీ షిర్దీసాయిబాబా దేవాలయము , కడప మార్గము
- షాహి మసీదు , కడప మార్గము
- మాధవరాయ స్వామి దేవాలయము, నంద్యాల మార్గము
- సి.యస్.ఐ. షాలోము చర్చి, సాయినాధపురము
- శ్రీ రాములవారి గుడి, నంద్యాల మార్గము
- పంచముఖ ఆంజనేయ దేవాలయము, పార్వతీ నగర్, నంద్యాల మార్గము
- వాసవి కన్యక పరమెస్వరి ఆలయము,నంద్యాల మార్గము
[మార్చు] విద్యా సంస్థలు
[మార్చు] ప్రభుత్వ విద్యాసంస్థలు
- మండల పరిషత్ ప్రాధమిక పాఠసశాల, కడప మార్గము
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కడప మార్గము
- రవీంద్ర జూనియర్ కళాశాల , కడప మార్గము
- బాలశివ కళాశాల, వనిపెంట మార్గము
[మార్చు] ప్రైవేటు విద్యాసంస్థలు
- శాంతినికేతన్ ఉన్నత పాఠశాల, బద్వేలి మార్గము.
- శారదా ఉన్నత పాఠశాల, కడప మార్గము
- వశిష్ట ఉన్నత పాఠశాల, బద్వేలి మార్గము.
- శివసూర్య ఉన్నత పాఠశాల, ప్రొద్దుటూరు మార్గము.
- ఆర్.వి.ఎస్.ఆర్.యమ్ ఉన్నత పాఠశాల, కడప మార్గము
- టీ.వీ.ఎస్.ఎం. ఉన్నత పాఠశాల ,బద్వేలి మార్గము.
- సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ,బద్వేలి మార్గము.
- మేధా జూనియర్ కళాశాల, కడప మార్గము.
[మార్చు] ఆసుపత్రులు
- ప్రభుత్వ 30 పడకల వైద్యశాల , నంద్యాల మార్గము
- రంగసింహ వైద్యశాల, బద్వేలి మార్గము.
- మానస (బద్వెలి సుబ్బరాయుడు ) వైద్యశాల, ప్రొద్దుటూరు మార్గము.
- షాహి వైద్యశాల , ప్రొద్దుటూరు మార్గము.
- నాగన్న చిన్నపిల్లల వైద్యశాల, కడప మార్గము.
[మార్చు] రక్తనిధి కేంద్రము
- శ్రీ వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ వారు గత 9 సంవత్సరములుగా 1000 మందికి రక్తదానాన్ని అందించారు.[1]. అత్యవసర పరిస్థితులలో రక్తం కావలసినవారి ఈ కేంద్ర సభ్యులైన ఆకుల వెంకట శివరాం (9885040477) ని కాని లేదా దాసారెడ్డిగారి ఓబయ్య (9030631910) నికాని సంప్రదించగలరు. ఈ బృందసభ్యులు అన్ని వేళలా రక్తదానానికి అందుబాటులో ఉంటూ ఎందరో ప్రాణాలకు ఊపిరి పోసారు. జిల్లా వ్యాప్తముగా అనేక పురస్కారాలను ఆందుకొన్నారు.
[మార్చు] బ్యాంకులు
- భారతీయ స్టేట్ బ్యాంక్, కడప మార్గము
- ఆంధ్రా బ్యాంక్, సాయిబాబ వస్త్ర సముదాయము, కడప మార్గము
- సిన్డికేట్ బ్యాంక్,బద్వేలి మార్గము
- వైఎస్ఆర్ జిల్లా సహకార బ్యాంక్, కడప మార్గము
[మార్చు] అన్నశాలలు
- గుడ్ బాయ్ అన్నశాల, కడప మార్గము
- మానస అన్నశాల, కడప మార్గము
- జి.ఆర్.జి .రెడ్ది అన్నశాల, కడప మార్గము
- రాఘవేంద్ర అన్నశాల,బద్వేలి మార్గము
[మార్చు] వసతి గృహాలు
- ప్రతాప్ వసతి గృహము,బద్వేలి మార్గము
- శ్రీలేఖ వసతి గృహము,బద్వేలి మార్గము
- విజయ వసతి గృహము, కడప మార్గము
- వేంకటేశ్వర వసతి గృహము,బద్వేలి మార్గము
[మార్చు] చలనచిత్ర ప్రదర్శనశాలలు
- భారత్
- వేంకటేశ్వర
- విజయ్
- కిరణ్
- దేవి
[మార్చు] రవాణా వ్యవస్థ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ, కడప మార్గము
[మార్చు] మండల పరిధి లోని గ్రామాలు
- పప్పన పల్లె
- సుంకులు గారి పల్లె
- వనిపెంట
- కుమ్మరి కొట్టాలు
- అన్నలూరు
- ఆదిరెడ్డిపల్లె
- గడ్డమయ్యపల్లె
- గంజికుంట
- లింగాలదిన్నె
- మిట్టమానిపల్లె
- కేశాపురం
- ముదిరెడ్డిపల్లె
- ఎన్.మైదుకూరు
- నంద్యాలంపేట
- శెట్టివారిపల్లె
- శివాపురం
- సోమయాజులపల్లె
- తిప్పిరెడ్డిపల్లె
- పాత మామిల్ల పల్లి
- ఉత్సలవరం
- క్రిష్ణాపురము
[మార్చు] రాజకీయ సమాచారము
- ప్రస్తుత ప్రజా ప్రతినిధి గా డి.ఎల్.రవీంద్రా రెడ్ది , కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నిక కాబడ్దారు. ఈయన 2014 వరకు ఈ పదవి లో కొనసాగుతాడు. ఈయన ప్రస్తుతము రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖా మంత్రి గా పనిచేస్తున్నాడు.
- 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్.రవీంద్రా రెడ్ది, తెలుగుదేశం తరపున ఎస్.రఘురామిరెడ్డి , ప్రజారాజ్యం తరపున ఇరగం రెడ్డి తిరిపేలరెడ్డి త్రిముఖ పొటీలో పాల్గొన్నారు.వీరిలో డి.ఎల్.రవీంద్రా రెడ్ది 7000 ఓట్ల తేడా తో తన ప్రత్యర్థులపై విజయం సాధించారు.
[మార్చు] రిఫరెన్సులు
[మార్చు] బయటి లింకులు
|
|||||||