మొగల్తూరు

వికీపీడియా నుండి
  ?మొగల్తూరు మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో మొగల్తూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో మొగల్తూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°25′N 81°36′E / 16.4167, 81.6
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము మొగల్తూరు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 6
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
73,136 (2001)
• 37071
• 36065
• 67.01
• 73.66
• 60.19


మొగల్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము.

విషయ సూచిక

[మార్చు] గ్రామం స్వరూపం, జనాభా

మొగల్తూరు గ్రామం 16.4167° N 81.6000° E.[1] అక్షాంశ రేఖాంశాల వద్ద ఉంది. సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 1 మీటర్. ఈ వూరి పాత పేరు కేతకీపురం.

[మార్చు] వ్యవసాయం, నీటి వనరులు

వరి ముఖ్యమైన పంట. కొద్ది పాటి ప్రాంతాలలొ మామిడి కూడ పండించబడుతుంది.

[మార్చు] పరిశ్రమలు

మొగల్తూరులో పీచు (coir) పరిశ్రమ అధికంగా ఉంది.

[మార్చు] విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు

ఈ గ్రామం నరసాపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

[మార్చు] ప్రముఖులు

మొగల్తూరులో విష్ణుకుండినుల కాలానికి చెందిన ఒక చారిత్రికమైన మట్టి కోట ఉంది. ఇది కలిదిండి జమీందారుల స్వస్థలం. వారి ఏలుబడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో విస్తరించి ఉండేది. కాలక్రమంలో చాలా కోటలు శిధిలాలయి పోయాయి కాని మొగల్తూరు కోట ఇంకా నిలిచి ఉంది. రాజ కుటుంబీకులు అక్కడ నివశిస్తున్నారు. చివరి రాజు కొడుకు కలిదిండి కుమార వెంకటేశ్వర రాజా బహదూర్ 90 సంవత్సరాలపైబడిన వయస్సులో 2007 జూలై 4న మరణించారు. ప్రస్తుతం ప్రముఖులైన కలిదిండి దేవీ ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీకాంత రాజా బహదూర్, కలిదిండి రామరాజా బహదూర్ ఈ కుటుంబానికి చెందినవారే. వంశపారంపర్యంగా అంతర్వేది కళ్యాణ మహొత్సవాన్ని, రధోత్సవాన్ని కలిదిండి రాజ కుటుంబ వారసులే నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత రాజ వంశ వారసుడైన రాజా కలిదిండి సత్యనారయణ సింహ జగపతి రాజా బహదూర్ అంతర్వేది దేవస్థానానికి వంశపారంపర్య ధర్మకర్త గా ఉన్నారు.

1924లో బారిష్టర్ పార్వతీశం అనే హాస్య నవల ద్వారా ప్రసిద్ధుడైన మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ ఊరిలో జన్మించాడు.ప్రబాస్ కూడ ఇక్కడే జ

ప్రస్తుత సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, కృష్ణంరాజు వంటి వారి స్వస్థలం మొగల్తూరే.

[మార్చు] మండలంలో గ్రామాలు

[మార్చు] వనరులు, మూలాలు

మొగల్తూరు చరిత్ర


"http://te.wikipedia.org/w/index.php?title=మొగల్తూరు&oldid=554607" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు