Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,02,160 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
కోరింగ వన్యప్రాణి అభయారణ్యం

కోరింగ వన్యప్రాణి అభయారణ్యం లేదా కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ లో, కాకినాడ జిల్లా, కోరంగి వద్ద ఉన్న అతిపెద్ద మడ అడవుల అభయారణ్యం. కాకినాడ నుంచి కోనసీమ జిల్లా పరిధిలోని భైరవపాలెం వరకు సుమారు అరవై వేల ఎకరాల్లో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులు గోదావరి నదీ ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. అందంగా, గుబురుగా పెరిగే మడ వృక్షాలు సముద్రపు కోతలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. ఈ అభయారణ్యం పలు రకాలైన జంతువులకు, జలచరాలను ఆశ్రయం ఇస్తోంది. కోరంగి అభయారణ్యం మడ అడవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడనుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అటవీశాఖ వారి లెక్కప్రకారం 235 చ. కి. మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మడ అడవులు దేశంలోనే రెండవ పెద్ద మడ అడవులుగా స్థానం సంపాదించుకున్నాయి. చిత్తడినేలలో పెరిగే చెట్లయొక్క వేర్ల వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. భూమిలోనికి ఉండే వేర్లవల్ల ఈ చెట్లకి కావలసినంత ఆక్సిజన్‌ తీసుకొనే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఇక్కడి నేలలు నిరంతరం నీటిలో మునిగి ఉంటాయి. వేర్ల ద్వారా గాలిపీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగరసంగమ ప్రదేశంలో ఏర్పడ్డ చిత్తడి (బురద) నేలల్లోనే పెరుగుతాయి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... హైదరాబాదులోని సారథి స్టూడియోస్ స్థాపించింది చల్లపల్లి జమీందారుగా పేరు గాంచిన యార్లగడ్డ శివరామప్రసాద్ అనీ!
  • ... లండన్ కేంద్రంగా వెలువడే నేచర్ (పత్రిక) ప్రపంచ వ్యాప్తంగా అత్యధికులు చదివే వైజ్ఞానిక పత్రిక అనీ!
  • ... ఈ భూమ్మీద తిరుగాడే అత్యంత ఎత్తైన జంతువు జిరాఫీ అనీ!
  • ... తమిళనాడులోని కల్పాక్కం పట్టణం అణు సంబంధిత పరిశ్రమ, పరిశోధనకు పేరు గాంచిందనీ!
  • ... నెక్నాంపూర్ చెరువు పునరుద్ధరణ "భారతదేశంలో చెరువుల పునరుద్ధరణలో ఉత్తమ నమూనాగా" నీతిఆయోగ్‌ చేత గుర్తించబడిందనీ!
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 22:
ఈ వారపు బొమ్మ
సా.శ 150 నాటి అమరావతి బౌద్ధ శిల్పం, చెన్నై ప్రభుత్వ సంగ్రహాలయం

సా.శ 150 నాటి అమరావతి బౌద్ధ శిల్పం, చెన్నై ప్రభుత్వ సంగ్రహాలయం

ఫోటో సౌజన్యం: రిచర్డ్ మోర్టెల్
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.