వికీపీడియా నుండి
(ఆంగ్లం : Muharram) (అరబ్బీ : محرم ), లేదా ముహర్రం, ముహర్రమ్-ఉల్-హరామ్, అని పిలువబడే ఈ ముహర్రం, ఇస్లామీయ కేలండర్ లోని మొదటినెల, మరియు ఇస్లామీయ సంవత్సరాది, (తెలుగు నెలలలోని చైత్రమాసము లాగా).
నిజానికి ఇది, ఇస్లాం పూర్వం, అరబ్బులలో సాంప్రదాయకమైన అరబ్బీ కేలండర్ యొక్క మొదటినెల. ప్రాచీన కాలంలోని అరబ్బులు (అరేబియాలోని యూదులు మరియు క్రైస్తవులతో సహా) ఈ కేలండర్ ను వాడేవారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం, అనగా ముహర్రం యొక్క పదవతేదీని, అనేక సాంప్రదాయక గుర్తులకనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. ఇస్లామీయ కేలండర్ వాడుకలోనికి వచ్చిన తరువాత కూడా, ఇది తొలిసంవత్సరాదిగా పండుగగా జరుపుకొనేవారు. పద్నాలు గు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం' .ఈ పేరు వినగానే పీర్లు, నిప్పులగుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' చదవటాలు గుర్తుకొస్తాయి. మరో కోణం నుంచి పరిశీలిస్తే పద్నాలుగు శతాబ్దాల క్రితం హజ్రత్ ముఆవియా అనే ముస్లిం పాలకుడు ప్రజలే పాలకుడిని ఎన్నుకోవాలనే ఇస్లాం ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని వ్యతిరేకించి తన కుమారుడై న యజీద్‌ను రాజు ప్రకటించాడు. దీనిని అప్ప టి ప్రజలు, ధర్మశాస్త్రవేత్తలు అందరూ వ్యతిరేకించారు.రాజ్యాధికారం వారసత్వపు హక్కు కాదని రాజరిక అనువంశిక విధానం ఇస్లామీయ ప్రజాస్వామిక సూత్రాలకే విరుద్ధమని చెప్పిన ఇస్లాం ధర్మశాస్త్రవేత్తల్ని దుష్టుడైన యజీద్ నిర్బంధించాడు. ఇది రాచరిక వ్యవస్థ పునరుథ్థానంగా భావించిన ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుసైన్ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రతిఘటించడానికి సిద్ధపడ్డారు. ప్రవక్త మనుమడైన ఇమామ్ హుసైన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడతారని భావించిన యజీద్ కుతంత్రంతో ఇమామ్‌ను హతమార్చాలని యోచిస్తూ చర్చలకు రమ్మని వర్తమానం పంపిస్తాడు.యజీద్ 'కర్బలా' మైదానంలో ఇమామ్ హుసైన్ ను చంపిస్తాడు.ప్రజలు తిరుగుబాటు చేసి యజీద్ ప్రభుత్వన్ని కూలదోస్తారు.
ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధం లో, ముహర్రం పదవరోజైన ఆషూరా నాడు అమరుడైన తరువాత, ముహర్రం నెలను, "షహీద్ " (అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ, పండుగగా జరుపుకొనడం మానేసారు. మొహర్రం, పండుగలా కాకుండా, వర్థంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాం లో ఈ ముహర్రంనెల మరియు "ఆషూరా", కర్బలా యుద్ధం లో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోకదినాలుగా గడుపుతారు. మాతమ్ (శోక ప్రకటన) జరుపుతారు. షియాలు ఎక్కువగా ఉన్నచోట్ల, ఉదాహరణకు లక్నో మరియు హైదరాబాదు లాంటి చోట్ల, మొహర్రం పెద్ద ఎత్తున జరుపుకుంటారు.
[మార్చు] పీర్లపండుగ
ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల ఈ ముహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు.
[మార్చు] ఇవీ చూడండి
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *  |
|
|
|
 |
|
[మార్చు] బయటి లింకులు