మోనికా సెలెస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మోనికా సెలెస్
Monica Seles interview.jpg
దేశం అమెరికా, సెర్బియా
నివాసం ఫ్లోరిడా, అమెరికా
పుట్టిన రోజు (1973-12-02) డిసెంబరు 2, 1973 (వయస్సు: 41  సంవత్సరాలు)
జన్మ స్థలం నొవిసాద్, యుగస్లోవియా ప్రస్తుతం సెర్బియా
ఎత్తు 178 cm (5 ft 10 in)
బరువు 70 kg (150 lb)
Turned Pro 1989
Retired 2008 ఫిబ్రవరి 14
Plays కుడి; రెండుచేతులతో
Career Prize Money $14,891,762
Singles
కరియర్ రికార్డ్: 595-122
Career titles: 53
అత్యున్నత ర్యాంకింగ్: No. 1 (March 11, 1991)
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు
Australian Open విజయం (1991, 92, 93, 96)
French Open 'ఫైనల్స్ (1992)
Wimbledon W (1997)
U.S. Open విజయాలు (1991, 92)
Doubles
Career record: 89-45
Career titles: 6
Highest ranking: No. 16 (ఏప్రిల్ 22, 1991)

Infobox last updated on: ఆగస్ట్ 24, 2007.


1973, డిసెంబర్ 2న పూర్వపు యుగస్లోవియా దేశంలో జన్మించిన మోనికా సెలెస్ (Monica Seles) ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి. 1994లో అమెరికా పౌరసత్వం పొందినది. మోనికా సెలెస్ తన క్రీడాజీవితంలో మొత్తం 9 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను సాధించింది. 1990లో 16 ఏళ్ల వయస్సులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌ను గెలిచి ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 1991 మరియు 1992లలో ఈమె అగ్రశ్రేణి క్రీడాకారిణిగా చెలామణి అయింది. 1991 మార్చిలో ప్రపంచ నెంబర్ వన్ హోదా కూడా పొందినది. ఆ స్థానంలో 178 వారాలపాటు కొనసాగింది. కాని 1993లో హాంబర్గ్ లో ఒక ఆగంతకుడు వీపుపై కత్తితో దాడిచేయడంతో ఆ తరువాత రెండేళ్ళు టెన్నిస్‌కు దూరం ఉండాల్సివచ్చింది. రెండేళ్ళ పునరాగమనం అనంతరం కూడా సెలెస్ చెప్పుకోదగ్గ విజయాలను నమోదుచేసింది. 1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్‌లో విజయం సాధించింది. 2008 ఫిబ్రవరి 14న మోనికా సెలెస్ టెన్నిస్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.[1]

ప్రారంభ రోజులు[మార్చు]

మోనికా సెలెస్ పూర్వపు యుగస్లోవియా (ప్రస్తుత సెర్బియా) దేశంలోని నొవిసాడ్‌లో డిసెంబర్ 2, 1973న హంగేరియన్ జాతి తల్లిదండ్రులకు జన్మించింది. ఆరేళ్ళ ప్రాయంలోనే టెన్నిస్ నేర్వడం ప్రారంభించింది. అప్పుడు తండ్రే ఆమె శిక్షకుడు. తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే ఆమె తన మొదటి టోర్నమెంటులో విజయం సాధించింది. ఆ వయస్సులో ఆమెకు స్కోరింగ్‌పై కూడా అవగాహన లేకపోవడం విశేషం. 1985లో 11 సంవత్సరాల ప్రాయంలో ఫ్లోరిడా లోని మియామిలో జరిగిన ఆరెంజ్ బౌల్ టోర్నమెంటులో విజయం పొందినది. 1986లో మోనికా సెలెస్ కుటుంబం యుగస్లోవియా నుంచి అమెరికాకు వెళ్ళడం జరిగింది. ఆమె అక్కడే టెన్నిస్ శిక్షణ పొందడం ప్రారభించింది.

మోనికా సెలెస్ తన మొట్టమొదటి ప్రొఫెషనల్ టెన్నిస్‌ను 1988లో 14 యేళ్ల వయస్సులో ఆడింది. ఆ మరుసటి యేడాది పూర్తికాలపు ప్రొఫెషనల్ పర్యటనలో చేరి అదే ఏడాది ఫైనల్లో క్రిస్ ఎవర్ట్ ను పరాజయం చేసి తొలి విజయాన్ని కూడా నమోదుచేయగలిగింది. 1989 జూన్ ఫ్రెంచ్ ఒపెన్‌ ఆడి తన మొదటి గ్రాండ్‌స్లాం టొర్నమెంటులోనే సెమీఫైనల్స్ వరకు దూసుకెళ్ళింది. సెమీస్‌లో అప్పటి ప్రపంచ నెంబర్ వన్ స్టెఫీ గ్రాఫ్ చేతిలో 6-3, 3-6, 6-3 తేడాతో ఓడిపోయింది. పర్యటనకు వెళ్ళిన తొలి ఏడాదే ప్రపంచ ర్యంకింగ్‌లో 6 వ స్థానం పొందగలిగింది.

గ్రాండ్‌స్లామ్ విజయాలు[మార్చు]

1989 : 1989లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంటులో పాల్గొని అందులో సెమీఫైనల్స్ వరకు వెళ్ళి స్టెఫీగ్రాఫ్ చేతిలో పరాజయం పొందినది. ఆ తరువాత వింబుల్డన్ మరియు అమెరిక ఓపెన్ టెన్నిస్‌లలో 4వ రౌండ్ వరకు వెళ్ళగలిగింది.

1990 : 1990లో జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొని తొలిసారిగా గ్రాండ్‌స్లాం టైటిల్ గెలిచింది. ఫైనల్లో ప్రత్యర్థి స్టెఫీ గ్రాఫ్‌ను 7-6, 6-4 వసర సెట్లతో ఓడించింది. ఆ తర్వాత వింబుల్డన్ టొర్నమెంటులో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది. చివరగా జరిగిన అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో 3వ రౌండ్ వరకు చేరింది.

1991 : 1991లో మోనికా సెలెస్ తొలిసారిగా తన క్రీడాజీవితంలోనే అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించింది. ఆ ఏడాది పాల్గొన్న 3 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ విజయం సాధించింది. ఆస్ట్రేల్యన్ ఓపెన్‌లో జానా నొవొత్నాను, ఫ్రెంచ్ ఓపెన్‌లో అరంటా సాంఛెజ్ ను, అమెరిక ఓపెన్‌లో మార్టినా నవ్రతిలోవాను ఓడించి టైటిళ్ళను గెలిచింది.

1992 : 1992లో కూడా సెలెస్ అత్యుత్తమ ప్రతిభను కొనసాగించింది. ఈ ఏడాది కూడా 3 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళను గెలవడమే కాకుండా మరో గ్రాండ్‌స్లాం (వింబుల్డన్)లో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను మేరీ జో ఫెర్నాండెజ్ పై గెలవగా, ఫ్రెంచ్ ఓపెన్‌ను స్టెఫీ గ్రాఫ్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకొంది. అమెరిక ఓపెన్‌లో అరంటా సాంఛెజ్ ను 6-3, 6-3 స్కోరుతో వరస సెట్లతో ఓడించింది.

1993 : 1993లో మొదట జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్టెఫీ గ్రాఫ్‌పై 4-6, 6-3, 6-2 స్కోరుతో గెలిచి శుభారంభం చేసింది. కాని ఏప్రిల్ లో జరిగిన ఘోర ఉదంతం ఆమె క్రీడాజీవితం విచ్ఛిన్నమైంది. జర్మనీ లోని హాంబర్గ్ లో ఆడుతున్న సమయంలో వెనుకనుంచి ఒక ఆగంతకుడు ఆమె వీపుపై కత్తితో పొడిచి తీవ్రగాయం చేశాడు. దీనితో ఆమె రెండేళ్ళ పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండాల్సివచ్చింది. ఈ ఉదంతం తర్వాత టెన్నిస్ కోర్టులలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు.[2]. ఈ ఉదంతం తర్వాత జర్మనీలో మరోసారి ఆడనని మోనికా సెలెస్ ప్రకటించింది.[3]

1994 : 1994, మే 17న లో సెలెస్ అమెరికా పౌరసత్వం పొందింది.

1995 : 1995లో పునరాగమం తర్వాత అమెరిక ఓపెన్ టెన్నిస్‌లో పాల్గొని ఫైనల్స్ వరకు ప్రవేశించింది. ఫైనల్లో స్టెఫీ గ్రాఫ్ చేతిలో 7-5, 6-4 తేడాతో పరాజయం పొందినది.

1996 : 1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొని మళ్ళీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలవడం మోనికా సెలెస్‌కు ఇది నాలుగవ సారి. ఫైనల్లో జర్మనీకి చెందిన ఆంకే హుబర్ తో 6-4, 6-1 స్కోరుతో ఓడిపోయింది. ఇదే ఆమె చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో రెండో రౌండ్ లోనే నిష్క్రమించింది. అమెరికన్ ఓపెన్‌లో మాత్రం 4వ సారి ఫైనల్లో ప్రవేశించి మళ్ళీ స్టెఫీ గ్రాఫ్ చేతిలో 7-5, 6-4 తెడాతో ఓడిపోయింది.

1997 : 1997లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొని సెమీఫైనల్లోకి వెళ్ళగలిగింది. వింబుల్డన్‌లో మాడోరౌండ్‌లోనే పరాజయం పొందగా, అమెరిక ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరింది.

1998 : 1998లోకూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరింది. ఫైనల్లో అరంటా సాంఛెజ్ తో 7-6(5), 0-6, 6-2 స్కోరుతో ఓడిపోయింది. మోనికా సెలెస్‌కు ఇదే ఆఖరు గ్రాండ్‌స్లామ్ ఫైనల్. వింబుల్డన్ మరియు అమెరిక ఓపెన్‌లలో క్వార్టర్ ఫైనల్స్ వరకు మాత్రమే చేరగలిగింది.

1999 : 1999లో ఆస్ట్రేలియన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్‌లలో సెమీఫైనల్స్ వరకు చేరింది. వింబుల్డన్‌లో మూడవ రౌండ్‌లో ఓడిపోగా, అమెరిక ఓపెన్‌లో క్వార్టర్ ఫైనస్ వరకు వెళ్ళింది.

2000 : 2000లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనలేదు. మిగితా మూడు టోర్నమెంట్లలోనూ క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరగలిగింది.

2001 : 2001లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనస్ వర్కు చేరింది. ఫ్రెంచ్ మరియు వింబుల్డన్‌లలో పాల్గొనలేదు. అమెరిక ఓపెన్‌లో 4వ రౌండ్ వరకు వెళ్ళింది.

2002 : 2002లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్స్ వరకు చేరింది. ఫ్రెంచ్, వింబుల్డన్ మరియు అమెరికన్ ఓపెన్‌లలో క్వార్టర్ ఫైనల్స్ వర్కు చేరగలిగింది.

2003 : 2003 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లోనూ, ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనూ నిష్క్రమించింది. పాదానికి గాయం కారణంగా ఆడలేకపోయింది. అప్పటినుంచి ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దూరమైంది.[4]

ఒలింపిక్ క్రీడలలో[మార్చు]

2000లో సిడ్నీలో జరిగిన ఒలింపిక్ క్రీడలలో మోనికా సెలెస్ పాల్గొని సింగిల్స్‌లో కాంస్యపతకం సాధించింది.

గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ విజయాల పట్టిక[మార్చు]

సంవత్సరం టోర్నమెంట్ ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1990 ఫ్రెంచ్ ఓపెన్ Germany స్టెఫీ గ్రాఫ్ 7-6(6), 6-4
1991 ఆస్ట్రేలియన్ ఓపెన్ Czechoslovakia జానా నొవొత్నా 5-7, 6-3, 6-1
1991 ఫ్రెంచ్ ఓపెన్(2వ సారి) Spain అరంటా సాంఛెజ్ వికారియో 6-3, 6-4
1991 అమెరిక ఓపెన్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు మార్టినా నవ్రతిలోవా 7-6(1), 6-1
1992 ఆస్ట్రేలియన్ ఓపెన్(2వ సారి) అమెరికా సంయుక్త రాష్ట్రాలు Mary Joe Fernandez 6-2, 6-3
1992 ఫ్రెంచ్ ఓపెన్(3వ సారి) Germany స్టెఫీ గ్రాఫ్ 6-2, 3-6, 10-8
1992 అమెరిక ఓపెన్(2వ సారి) Spain అరంటా సాంఛెజ్ వికారియో 6-3, 6-3
1993 ఆస్ట్రేలియన్ ఓపెన్(3వ సారి) Germany స్టెఫీ గ్రాఫ్ 4-6, 6-3, 6-2
1996 ఆస్ట్రేలియన్ ఓపెన్(4వ సారి) Germany ఆంకే హుబర్ 6-4, 6-1

సింగిల్స్ లో ప్రదర్శించిన ప్రతిభ- కాలరేఖ[మార్చు]

టోర్నమెంట్ కెరీర్
విజయాలు పరాజయాలు
కెరీర్
విజయాల నిష్పత్తి
1988 1989 1990 1991 1992 1993 1994 1995 1996 1997 1998 1999 2000 2001 2002 2003
గ్రాండ్‌స్లామ్ టోర్నమెంటులు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 43-4 4 / 8 A A A W W W A A W A A SF A QF SF 2R
ఫ్రెంచ్ ఓపెన్ 54-8 3 / 11 A SF W W W A A A QF SF F SF QF A QF 1R
వింబుల్డన్ టోర్నమెంట్ 30-9 0 / 9 A 4R QF A F A A A 2R 3R QF 3R QF A QF A
అమెరిక ఓపెన్ 53-10 2 / 12 A 4R 3R W W A A F F QF QF QF QF 4R QF A
గ్రాండ్‌స్లామ్ విజయ నిష్పత్తి N/A 9 / 40 0 / 0 0 / 3 1 / 3 3 / 3 3 / 4 1 / 1 0 / 0 0 / 1 1 / 4 0 / 3 0 / 3 0 / 4 0 / 3 0 / 2 0 / 4 0 / 2
గ్రాండ్‌స్లామ్ విజయాలు=పరాజయాలు 180-31 N/A 0-0 11-3 13-2 21-0 27-1 7-0 0-0 6-1 17-3 11-3 14-3 16-4 12-3 7-2 17-4 1-2

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Seles Announces Retirement From Professional Tennis
  2. http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/30/newsid_2499000/2499161.stm
  3. Wood, Stephen (16 November, 2000). "WTA under fire from Seles". BBC Sport (BBC). 
  4. Monica Seles playing activity WTA Tour website