మౌరిటానియ
| الجمهورية الإسلامية الموريتانية Al-Jumhūriyyah al-Islāmiyyah al-Mūrītāniyyah Republik bu Lislaamu bu Gànnaar République Islamique de Mauritanie Islamic Republic of Mauritania
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| నినాదం شرف إخاء عدل (Arabic) (English: Honor, Fraternity, Justice) |
||||||
| జాతీయగీతం National Anthem of Mauritania |
||||||
| రాజధాని (మరియు అతిపెద్ద నగరం) |
Nouakchott |
|||||
| అధికార భాషలు | Arabic1 | |||||
| ప్రజానామము | Mauritanian | |||||
| ప్రభుత్వం | Islamic republic2 | |||||
| - | President | Mohamed Ould Abdel Aziz | ||||
| - | Prime Minister | Moulaye Ould Mohamed Laghdaf | ||||
| Independence | from France | |||||
| - | Date | 28 November 1960 | ||||
| - | జలాలు (%) | 0.03 | ||||
| జనాభా | ||||||
| - | 2009 అంచనా | 3,291,000[1] (135th) | ||||
| - | 1988 జన గణన | 1,864,236[2] | ||||
| జీడీపీ (PPP) | 2009 అంచనా | |||||
| - | మొత్తం | $6.326 billion[3] | ||||
| - | తలసరి | $2,037[3] | ||||
| జీడీపీ (nominal) | 2009 అంచనా | |||||
| - | మొత్తం | $3.029 billion[3] | ||||
| - | తలసరి | $975[3] | ||||
| Gini? (2000) | 39 (medium) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | ||||||
| కరెన్సీ | Ouguiya (MRO) |
|||||
| కాలాంశం | (UTC+0) | |||||
| - | వేసవి (DST) | not observed (UTC+0) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .mr | |||||
| కాలింగ్ కోడ్ | +222 | |||||
| 1According to article 6 of Constitution: The national languages are Arabic, Pulaar, Soninke, and Wolof; the official language is Arabic 2Not recognized internationally. Deposed leaders President Sidi Ould Cheikh Abdallahi and Prime Minister Yahya Ould Ahmed El Waghef no longer have power as they were arrested by military forces. |
||||||
అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్ అఫ్ మౌరిటానియ అని పిలువబడే మౌరిటానియ అరబ్బీ: موريتانيا (మురిటనియ; మూస:Lang-woసోనిన్కే:మురుటానే ; పులార్: మొరిటని మూస:Lang-fr) ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. ఈ దేశాన్ని పడమరలో అట్లాంటిక్ మహా సముద్రం, ఉత్తరంలో పశ్చిమ సహారా ఎడారి,ఈశాన్యంలో అల్జీరియ దేశం తూర్పు మరియు ఆగ్నేయంలో మాలి దేశం, నైరుతిలో సెనెగల్ దేశం ఆనుకొని ఉన్నాయి. ఈ దేశం యొక్క పేరు రోమన్ తాలూకా అయిన మౌరెటనియ గుర్తుగా పెట్టారు. ప్రస్తుతము ఈ ఆధునిక దేశం పాత రోమన్ తాలూకా కన్నా ఎన్నోరెట్లు పెద్దది. ఈ దేశ రాజధాని మరియు పెద్ద పట్టణం నౌఅక్చ్చోట్, అట్లాంటిక్ తీరాన ఉన్నది.
6 ఆగస్ట్ 2008లో జనరల్ మొహమద్ ఔల్ద్ అబ్దేల్ అజీజ్ నేతృత్వంలో సైన్యం తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టింది. 16 ఏప్రిల్ 2009న జనరల్ అజీజ్ సైన్యం నుంచి రాజీనామా చేసి దేశ అధ్యక్షుడి పదవి కోసం జూలై 19 ఎన్నికల్లో పోటి చేసి గెలిచారు. మౌరిటానియ లో 20 % మంది ప్రజల ఆదాయం రోజుకు 1.25 డల్లర్లు కన్నా తక్కువ[5].
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] పురాతన చరిత్ర
- ప్రధాన వ్యాసం: History of Mauritania
బఫౌర్స్ ప్రాధమికంగా వ్యవసాయదారులు, వీరు తమ చారిత్రిక దేశ దిమ్మరుల జీవన శైలిని వదిలిన మొట్టమొదటి సహారా ప్రజలు. సహారా తరుగుదల వల్ల వారు దక్షిణం వైపు వలస వచ్చారు.
వారిని అనుసరించి పశ్చిమ అఫ్రికాకి వలస వచ్చినవారు మధ్య సహారా వారె కాకుండా చాలా మంది ఉన్నారు,కానీ 1076లో ఇస్లామిక్ యుద్ధ సన్యాసులు(అల్మోరావిడ్/2} లేదా మురాబిటున్) దాడి చేసి పురాతన ఘనా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. తరువాతి 500 సంవత్సరాలు అరబ్ వారికి స్థానిక ప్రజల(బెర్బెర్లు మరియు బెర్బెర్లు కాని వారు)నించి ఎదురైన తీవ్ర వ్యతిరేకతను తట్టుకుని మౌరిటానియలో ఆధిపత్యం చెలాయించారు. బెని హసన్ జాతి వారు ఎమిని మక్యిల్ అరబ్ ఆక్రమణదారుల పైన జరిపిన ప్రఖ్యాత మౌరిటనియాన్ ముప్పై సంవత్సరాల యుద్ధం సత్ఫలితాలను ఇవ్వలేదు, ఫలితంగా వారు ఓడిపోయారు.
బెని హసన్ యోధుల వారసులు ఇస్లాం సంఘంలో పెద్ద జాతిగా పరిగణించబడ్డారు. ఇస్లాం సంప్రదాయాన్ని రక్షించి మరియు బోధించే మరబౌట్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చెయ్యటం ద్వారా బెర్బర్లు తమ ప్రభావాన్ని నిలుపుకున్నారు. చాలా మటుకు బెర్బెర్ తెగ వారు ఎమిని(కొన్నిసార్లు అరబ్)వారమని పేర్కొన్నప్పటికీ: దీనిని బలపరచడానికి చారిత్రిక ఆధారాలు తక్కువ, కొన్ని పరిశోధనలు రెండింటి మధ్య సంబంధం ఉందని పేర్కొన్నాయి.[6] బెర్బెర్ ప్రభావం ఉన్న అరబిక్ భాష హస్సనియా, దీని పేరు బెని హసన్ పేరు నుంచి వచ్చింది, ఈ భాష అధిక శాతం దేశ దిమ్మర జనాభాతో వాడుకలోకి వచ్చింది.
[మార్చు] ఆధునిక చరిత్ర
- ప్రధాన వ్యాసం: History of Mauritania
19వ శతాబ్దం ప్రదమార్దంలో ఫ్రాన్సు రాజ్యం మెల్లగా సెనెగల్ నదీ ప్రాంతం నుంచి పైకి ప్రస్తుత మౌరిటానియలో చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుంది. 1901లో, జేవియర్ కొప్పోలని రాచకార్యానికి నేతృత్వం వహించాడు. జావియ తెగ వారితో వ్యూహాత్మక సంధి ద్వారా మరియు సైనిక ఒత్తిడితో హస్సనే యోధులను వశపరుచుకున్నాడు. ఫ్రెంచ్ పాలనను మౌరిటానియ సామంత రాజ్యాల పైన త్వరగా వ్యాప్తి చేయగలిగాడు.తరర్జా,బ్రాక్న మరియు తాగంట్ సామంతులు సంధుల ద్వారా వెంటనే పరదేశ పాలనకు తలోగ్గారు(1903-04), కాని ఉత్తర ప్రాంత సామంత రాజ్యం అయిన అద్రార్ పరదేశ పాలనకు విరుద్దంగా పోరాటం(జిహాద్)చేస్తున్న శాయఖ్మా అల్-అయినిన్ సహకారంతో చాలా కాలం విరోధించారు. అది కూడా 1912 సైనిక చర్యతో ఓడిన తరువాత మౌరిటానియ రాజ్యంలో చేర్చబడింది మరియు 1904లో సరిహద్దులను గీసారు. తద్ఫలితంగా మౌరిటానియ ఫ్రెంచ్ పాలనలో ఉన్న పశ్చిమ ఆఫ్రికా భాగంలో 1920న చేరింది.
ఫ్రెంచ్ పాలనలో బానిసత్వం పైన ఆంక్షలు విధించబడ్డాయి, అంతే కాకుండా తెగల మధ్య యుద్దాలు ముగిసాయి. పరదేశి పాలనలో చాలా మటుకు జనాభా దేశ దిమ్మరులుగానే ఉన్నారు, కానీ పుర్వంలో వెలి వేయబడ్డవారు, మెల్లిగా మౌరిటానియకు వెనక్కి వచ్చారు. 1960లో ఆ దేశం స్వతంత్రం అయినప్పటికి, ఇప్పటి రాజధాని అయిన నౌఖ్చోట్ ను ఒక చిన్న పల్లె అయిన కాసర్ దగ్గర స్థాపించారు, అప్పటికి అక్కడి 90% జనాభా దేశ దిమ్మరిలుగానే ఉన్నారు.
1970వ దశకంలో అతి పెద్ద సాహేల్ కరువు మౌరిటానియకు పెద్ద సమస్యలు తెచ్చిపెట్టింది. స్వతంత్రం రావడంతో అనాదిగా ఉన్న సహారా-ఆఫ్రికా ప్రజలు(హాల్పులార్,సోనిన్కే, మరియు వలోఫ్) మౌరిటానియలో సెనెగల్ నది ఉత్తర ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరి విద్యాభ్యాసం ఫ్రెంచ్ భాషలో జరిగింది. ఫ్రెంచ్ ఆచార వ్యవహారాలను అనుకరించి వీరు కొత్త దేశంలో సైనికులు, గుమాస్తాలు,పెభుత్వ నిర్వాహక వ్యవస్థలో ఉద్యోగాలు పొందారు. ఫ్రెంచ్ సైన్యం ఉత్తరాన చిత్తడి నేలలలో మొండిగా ఉన్న మూరిష్ కి చెందిన హస్సనే తెగలను అణిచి వేయడంతో ఇది సాధ్యపడింది మరియు దక్షిణ జనాభాలు మరియు మూరల మధ్య తగాదాలను సృష్టించారు. ఉత్తర దక్షిణ ప్రాంతాల తెగల మధ్య హరాటిన్ తెగ ఉండేది, వీరి జనాభాలో దాదాపుగా అందరూ అరబ్ బానిసలు, వీరు ఆఫ్రికా నల్ల జాతీయులు, వీరు చిత్తడి నేల ప్రాంతంలో జీవించేవారు.వీరిని నిమ్న కులంగా పరిగణించేవారు.[7] ఆధునిక సమాజ బానిసత్వం ఈ దేశంలో ఒక మాములు వ్యవహారం.[8] కొన్ని గణాంకాల ప్రకారం దాదాపు 600,600 లేదా 20% మంది మౌరిటానియ ప్రజలు ఇంకా బానిసత్వంలో మగ్గుతున్నారు.[9][10] ఈ సామజిక అసమానత్వం ముఖ్యంగా దేశ ఉత్తర ప్రాంతనికి చెందిన "బ్లాక్ మూర్స్"(హరాటిన్)తెగలలో కనిపిస్తుంది.ఈ ప్రాంతంలో "వైట్ మూర్స్" పెత్తనం చెలాయిస్తారు. కానీ దక్షిణ ప్రాంత నిమ్న జాతులకు చెందిన ఆఫ్రికన్ నల్ల వారి జీవన శైలిని ఇటువంటి సామజిక రుగ్మతలు ప్రభావితం చేసాయి.
ఈ మార్పునకు మూరులు స్పందించారు, మౌరిటానియని అరబ్ జీవన శైలికి మార్చాలన్న అరబ్ జాతీయుల ఒత్తిడి కూడా పని చేసింది. అరబ్ జాతీయులు తమ చట్టాలను మరియు భాషను వీరి పైన రుద్దారు. దీని వల్ల దేశంలో ఒక రకమైన అసమానత్వం పెరిగింది, మూర్లు మౌరిటానియని ఒక అరబ్ దేశంగా భావించారు మరియు వారి అధికార వాంఛ వల్ల ఇబ్బందులు ఎదురు అయ్యాయి, దేశం యొక్క భిన్న ఆచార, సంస్కృతులనూ మరియు సాంఘిక అసమానతలను తొలగించడానికి వివిధ పధకాలు ప్రేవేశపెట్టినప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.
ఏప్రిల్ 1989(ది "1989 ఇవెంట్స్" మరియు "మౌరిటానియ-సెనెగల్ బోర్డర్ వార్")లో జరిగిన మత ఘర్షణల వల్ల మతాల మధ్య అగాధం ప్రస్ఫుటంగా కనిపించింది, ఇవి ప్రస్తుతం తగ్గాయి. 1980 దశకం చివరిలో దాదాపు 70,000 మంది మౌరిటానియకి చెందిన ఆఫ్రికా నల్ల జాతీయులను వెలివేసారు.[11] మతాల మధ్య ఉద్రిక్తతలు మరియు పాత సమస్య అయినప్పటికీ ప్రస్తుతము కొనసాగుతున్న బానిసత్వం ప్రస్తుత రాజకీయవాదులకు ఒక ఆసరా. అయినా, అన్ని వర్గాల నుంచి చెప్పుకోదగ్గ ప్రజలు భిన్నమైన సామజిక ఐక్య దేశం కోరుకుంటున్నారు.
ప్రభుత్వ పాలనా యంత్రాంగం సాంప్రదాయ పాలన, ప్రత్యేక సంస్థలు,మరియు ప్రభుత్వ-వ్యక్తిగత సంస్థల మిశ్రమం. దేశ ఆంతరంగిక శాఖ ప్రాంతాల పాలనను పర్యవేక్షిస్తుంది, ఫ్రెంచ్ పాలనా విధానాన్ని సవ్యంగా అమలుపరిచే విధంగా కృషి చేస్తుంది. ఈ వ్యవస్థ కింద, రాజధాని జిల్లా అయిన నౌక్చొట్ తో కలిపి మౌరిటానియను పదమూడు ప్రాంతాలుగా(విలాయ ) విభజించారు. దేశ పాలన మొత్తం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ పైన ఆధారపడి ఉంటుంది, కానీ 1992 నుంచి జాతీయ మరియు పురపాలక ఎన్నికలు జరపడం వల్ల కొద్ది మేర అధికార వికేంద్రికరణంకుఅవకాశం కుదిరింది.
1976లో మౌరిటానియ మరియు మొరాకో కలిపి పశ్చిమ సహారాను పంచుకున్నాయి. పూర్వ సామ్రాజ్య శక్తి అయిన స్పెయిన్ కోరిన మీదట మౌరిటానియ సహారా ప్రాంతంలో మూడింట ఒక వంతు ప్రదేశాన్ని తీసుకున్నారు. అల్గిరియా సైన్య ,ఆయుధ సహకారం, మరియు మొరాకో వ్యతిరేకి అయిన స్థానిక హెగెమొన్ సహకారం ఉన్నప్పటికీ పోలిసారియోలో పెద్ద సంఖ్యలో సైనిక నష్టాల తరువాత మౌరిటానియ 1979లో ఆ ప్రాంతం నుంచి వెనుతిరిగింది. ఆ ప్రాంతంను మొరాకో కైవసం చేసుకుంది. బలహీనమైన ఆర్ధిక వ్యవస్థ కారణంగా మౌరిటానియ ఆ ప్రాంతంలో ప్రాభవం కోల్పోయింది. సరిహద్దు వివాదాలను సైనిక చర్యతో కాకుండా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తుంది. చాలా మటుకు పశ్చిమ సహారా ప్రాంతాము మొరాకో అధీనంలో ఉన్నప్పటికీ, ఆ ప్రాంత ప్రజలు తమ మనోభావలను స్వేచ్చగా వ్యక్త పరచాలాని ఐక్యరాజ్యసమితి కోరుతుంది: తోందరలో ఒక ప్రజా అభిప్రాయ సేకరణ చెయ్యాలని యోచిస్తోంది. పురాతన సహ్రవిలు వేరుగా ఏర్పరిచిన సహ్రవి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్లో ఉండటానికి ఇష్టపడతారా లేక మొరాకో వైపు మొగ్గచుపుతరా అని నిర్ధారణ కావలసి ఉంది. మొరాకో ప్రభుత్వం ఈ ప్రజా అభిప్రాయ సేకరణని జరపనివ్వలేదు.
[మార్చు] ఔల్ద్ దాద్దః శకం (1960-78)
స్వతంత్రం తరువాత, ఫ్రెంచ్ వారిచే నియమింపబడ్డ రాష్ట్రపతి మొక్తర్ ఔల్ద్ దద్దః మౌరిటానియను 1964లో ఏక రాజకీయ పక్ష ఏలుబడిలో ఉండేటట్టు రాజ్యాంగం తాయారు చేసారు,అధికారవంతమైన రాష్ట్రపతి పాలన అమలుపరిచారు. దద్దః యొక్క సొంత పార్టీ డు పిపల్ మౌరిటానియన్(PPM) ఏక పార్టీ ఏలుబడి విధానం వల్ల అధికారంలోకి వచ్చింది. మౌరిటానియ ఇంకా పశ్చిమ శైలి బహుళ రాజకీయ పక్ష ప్రజాతంత్రానికి సిద్ధంగా లేదని రాష్ట్రపతి తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ఏక రాజకీయ పక్ష వ్యవస్థలో 1966,1971,మరియు 1976 ఎన్నికలలో దద్దః పోటి లేకుండా గెలిచారు. "గ్రేటర్ మౌరిటానియ" ఏర్పాటుకు పశ్చిమ సహారాలో దక్షిణ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం వల్ల దేశం దాదాపు కూలిపోయే భయం ఏర్పడింది. దీని వల్ల దద్దఃను 10 జూలై 1978న రక్త రహిత సైనిక తిరుగుబాటు చేసి పదవి నుంచి తొలగించారు.
[మార్చు] CMRN మరియు CMSN సైనిక ప్రభుత్వాలు (1978-84)
కొలోనెల్. ముస్తఫా ఔల్ద్ సలేక్ నేతృత్వంలో CMRN జుంటా ఒక బలమైన శక్తిగా ఎదగలేకపోయింది. సహ్రవి ఆందోళనకారులతో పోలిసారియో ప్రాంతంలో జరిపిన సంఘర్షణతో దేశాన్ని అస్తిరత్వం నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. ఆ ప్రభుత్వం కూలిపోయింది, చురుకైన కోలోనల్. మొహమ్మద్ ఖౌన ఔల్ద్ హైదల్లః నేతృత్వంలో CMSN అధికారంలోకి వచ్చింది. హైదల్లః ఒక బలమైన వ్యక్తిగా ఎదిగాడు, పశ్చిమ సహారా నుంచి వైదొలగి పోలిసారియో ప్రాంతంలో శాంతిని నెలకొల్పాడు మరియు మౌరిటానియ ముఖ్య సహాయక దేశం అల్జీరియాతో సత్సంబంధాలు ఏర్పరిచాడు. కానీ మిగతా దేశాలు అయిన మొరాకో మరియు దాని ఐరోపా మిత్ర దేశం ఫ్రాన్సుతో సంబంధాలు చెడిపోయాయి. అస్థిరత కొనసాగింది, హైదల్లా సంస్కరణ ఆశలకు విఘాతం కలిగింది. ఈయన ప్రభుత్వం పై చాలాసార్లు సఫలం కాని సైనిక తిరుగుబాట్లు జరిగాయి, అంతే కాకుండా సైనిక కుట్రలతో ఇబ్బంది పడింది. అతని రాజకీయం, మరియు సైనిక వ్యతిరేకుల పైన రాజీపడని ధోరణి మరియు కటినంగా వ్యవహరించే తీరు, కొంత మందిని కారాగారంలో బంధించటం లేదా చంపటం వల్ల అయన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది.
1948లో ఆయన్ని పదవి నుంచి కలనల్. మాఔయ ఔల్ద్ సిద్'అహ్మద్ తాయా తొలగించారు. ఈయన సైనిక నియంత్రణ తగ్గించకుండా రాజకీయ ఉద్రిక్త వాతావరణాన్ని కొంచం చల్లార్చారు. 1980 దశకం చివర్లో మౌరిటానియ అల్జీరియా ఫై సానుకులతను తగ్గించి మొరాకోతో సంబంధాలను బలపరిచారు. 1990 దశకం చివరిలో మరియు 21 శతాబ్దం మొదట్లో మొరాకోతో సంబంధాలు బలపడ్డాయి. పాశ్చాత్య దేశాలు మరియు పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఉన్న అరబ్ రాజ్యాల సమర్దనను పొందడానికి మౌరిటానియ ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది. అయినప్పటికీ, పశ్చిమ సహారా పోలిసారియో నుంచి వెలివేయబడ్డ ప్రభుత్వంగా దానికి వచ్చిన గుర్తింపు తోలగిపోలేదు, అయినప్పటికీ అల్జీరియాతో సత్సంబంధాలు నెరుపుతుంది. ఇది పశ్చిమ సహారా వివాదంలో 1980 నుంచి తటస్థత ఖచ్చితంగా పాటిస్తుంది.
[మార్చు] ఔల్ద్ తాయా పరిపాలన (1984-2005)
ది పార్టి రిపబ్లికైన్ డెమోక్రటిక్ ఎట్ సోషల్ (PRDS), మాఔయ ఔల్ద్ సిద్'అహ్మద్ తాయా పూర్వం నేతృత్వం వహించిన రాజకీయ పక్షం,మౌరిటానియ రాజకీయాలని ప్రభవితం చేసింది. ఇది దేశం యొక్క మొదటి బహు రాజకీయ పక్ష 1992 ఎన్నికలలో గెలిచింది. జూలై 1991లో జరిపిన ప్రజా అభిప్రాయ సేకరణలో ప్రజలు రాజ్యాంగాన్ని ఆమోదించారు. రక్తపాత రహిత సైనిక తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిన తయా డిసెంబర్ 12 1984న మొట్టమొదటి దేశ ప్రధానమంత్రి అయ్యారు, ఈయన 1992 మరియు 1997 ఎన్నికలలో గెలుపొందారు, సైనిక చర్య తరువాత మౌరిటానియను పరిపాలించిన సైనిక అధికారుల కమిటికి జూలై 1978 నుండి 1992 వరకు నాయకత్వం వహించారు.
సైనిక పరిపాలనలో రాజకీయ పక్షాలను చట్టవిరుద్ధంగా చూసారు, 1991 నుంచి ఆ పక్షాలకు చట్ట బద్ధత కల్పించారు. ఏప్రిల్ 1992 కల్లా ప్రజాపాలనను పునరుద్ధరించారు, 16 పెద్ద రాజకీయ పక్షాలకు గుర్తింపు ఇచ్చారు; 2004లో 12 పెద్ద పక్షాలు క్రియాశీలకంగా ఉన్నాయి. చాలా మటుకు ప్రతిపక్షాలు మొదటి 1992 ఎన్నికలను భాహిష్కరించారు. దాదాపు దశాబ్దం పాటు విధాన సభలో PRDS అధికారంలో ఉంది. ప్రతిపక్షాలు 1994 జనవరి-ఫిబ్రవరి పురపాలక ఎన్నికలలో పాల్గొన్నాయి, తరువాత దేశ అధ్యక్ష ఎన్నికలలో పాల్గొన్నాయి, ఏప్రిల్ 2004లో ప్రాంతీయంగా మరియు విధాన సభలో మూడు స్థానాలతో ప్రాతినిధ్యం పొందారు.
జూన్ 8 2003న పూర్వ మరియు ప్రస్తుత సైనిక అధికారులు కలిసి అధికారం హస్తగతం చేసుకోవడానికి రక్తపాతంతో కూడిన ఒక అసఫల సైనిక తిరుగుబాటు చేసారు. తిరుగుబాటు ప్రయత్నం చేసిన నాయకులను ఇప్పటికీ బంధించలేదు.
నవంబర్ 7, 2003న జరిగిన అధ్యక్ష ఎన్నిక 1992లో మౌరిటానియ ప్రజాతంత్రాన్ని అమలుపరుస్తున్న నాటి నుండి ఇప్పటికి మూడో ఎన్నిక. ఆరుగురు అభ్యర్ధులు పోటి చేయాగా వారిలో మౌరిటానియ చరిత్రలో మొట్టమొదటి మహిళా మరియు మొదటి హరటిన్(పూర్వ బానిస కుటుంబం) అభ్యర్ధులు వివిధ రంగాలు మరియు రాజకీయ అంశాలకు ప్రతినిధిత్వం వహిస్తున్నారు. పదవిలో ఉన్న ప్రస్తుత రాష్ట్రపతి మాఔయ ఔల్ద్'సిద్ అహ్మద్ తయా ఎన్నికలలో అధికారిక లెక్కల ప్రకారం అత్యధికంగా 67.02% వోట్లతో తిరిగి ఎన్నోకోబడ్డారు, ఈ ఎన్నికలలో మహమ్మద్ ఖౌన ఔల్ద్ హైదల్ల ఓడిపోయారు.
1980 చివర్లో,ఔల్ద్ తయా ఇరాక్ తో దగ్గర సంబంధాలు నెలకొల్పాడు మరియు అరబ్ జాతీయ విధానాన్ని అవలంబించాడు. ఆ సమయలో 1989 సెనెగల్ తో భయంకర సంఘర్షణలు మొదలయ్యాయి. రెండు దేశాలు తక్కువ సంఖ్యలో ఉన్న వివిధ మతాలవారిని వెలివేయడంతో సమస్య మొదలయ్యాయి. 1991 గల్ఫ్ యుద్ద సమయంలో ఇరాక్ కు అనుకూలంగా వ్యవహరించడంతో పాశ్చాత్య దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి, మౌరిటానియ ప్రపంచ దేశాలలో ఏకాకి అయ్యింది. 1990 మధ్య కాలంలో తన విదేశాంగ విధానాన్ని అమెరికా, ఐరోపాలకు అనుకూలంగా మార్చడంతో ఆ దేశం పైన ఆంక్షలు తొలగించి సహాయక కార్యక్రమాలతో పాశ్యాత్య దేశాలు సహకరించాయి.
28 అక్టోబర్ 1999న మౌరిటానియ విదేశాంగ మంత్రి అహ్మద్ సిద్'అహ్మద్ ఇజ్రాయల్ మంత్రి డేవిడ్ లెవితో వాషింగ్టన్ డి.సి, అమెరికాలో సంపూర్ణ దౌత్య సంబంధాలు నెలకొల్పుతున్నట్టు ఒప్పందం చేసుకున్నారు. ఒప్పంద పత్రాల పైన సంతకాలు అమెరికా రాష్ట్ర విభాగంలో ఆ దేశ కార్యదర్శి మడెలిన్ అల్బ్రయట్ సమక్షంలో జరిగాయి. అరబ్ దేశాల సమూహంలో ఇజిప్ట్, పాలస్తీనా,జోర్డాన్ మాత్రమే ఇజ్రాయిల్ ని అధికారికంగా గుర్తించిన దేశాలు. వాటి సరసన మౌరిటానియ కూడా చేరింది. ఔల్ద్ తయా ఉగ్రవాద విరుద్ద కార్యక్రమాలలో అమెరికాకి సహకరించడం మొదలుపెట్టారు. ఈ చర్యలు మనవ హక్కుల సంఘాలకు ఆగ్రహం తెప్పించాయి. వారి ప్రకారం ఈ చర్యల వల్ల ఆ ప్రాంతంలో ఉగ్రవాదం పెరుగుతుంది మరియు ఉగ్రవాద చర్యలకు గురవుతుంది.[12][13] (మౌరిటానియ విదేశీ సంబంధాలు కూడా చూడండి)
[మార్చు] ఆగష్టు 2005 సైనిక తిరుగుబాటు
ఆగష్టు 3, 2005న కలనల్.ఎలి ఔల్ద్ మొహమ్మద్ వళ్ నేతృత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటు మాఔయ ఔల్ద్ సిద్'అహ్మద్ తయా యొక్క ఇరవై ఒక్క సంవత్సరాల పరిపాలనకు తెరదించింది.
ఆగష్టు 3న రాష్ట్రపతి అంగరక్షకులతో కలిపి మౌరిటానియ సైన్యం రాజధాని నౌఅక్చోట్ లోని కీలక ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రపతి తయా సౌది రాజు ఫహద్ అంత్యక్రియలకు హాజరు అవ్వడానికి వెళ్లినప్పుడు సైన్యం తిరుగుబాటు చేసింది, ఈ చర్యలో ఎవరి ప్రాణాలు పోలేదు. కొంత మంది అధికారులు తమని తాము న్యాయానికి మరియు ప్రజతంత్రానికి మిలటరీ పరిషత్తు అని చెప్పుకుంటూ ఒక ప్రకటన చేసారు:
- "జాతీయ ఆయుధ బలగాలు మరియు రక్షణ బలగాలు కొన్ని సంవత్సరాల నుండి ప్రజలను ఇబ్బందులు పెడుతూ వారిని అణిచివేస్తున్న పనికి మాలిన ప్రభుత్వ పాలనను ఖచ్చితంగా తీయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాయి".[14]
ఆ సైనిక పరిషత్తు తరువాత కలనల్ వళ్ ను అధ్యక్షుడుగా మరియు జాతీయ పోలీస్ దళం, సురేటె నేషనల్ కి సంచాలాకునిగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. మిగతా పదహారు అధికారులను సభ్యులుగా నమోదు చేసారు. కలనల్ వళ్ ఒకప్పుడు పదవీచ్యుతుడు అయిన రాష్ట్రపతికి ముఖ్య అనుచరుడుగా పేర్కొనేవారు, ఈయన పూర్వ రాష్ట్రపతి పదవిలోకి రావడానికి కారణమైన తిరుగుబాటులో ఆయనకి సహాయకుడిగా ఉన్నారు,తరువాత రాష్ట్రపతి భద్రతా దళానికి నేతృత్వం వహించారు.
మౌరిటానియ ప్రజలు ఈ పాలనను స్వాగతించారు[citation needed],కానీ అంతర్జాతీయ దేశాలు ఈ పరిస్థితులను జాగ్రత్తగా గమనించారు, ఈ తిరుగుబాటుకు తరువాతి కాలంలో ఆమోదం లభించింది. సైనిక జుంటా మాట ఇచ్చినట్టుగానే రెండు సంవత్సరాలలో ఎన్నికలు నిర్వహించింది. జూన్ 26, 2006న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో మౌరిటానియ ప్రజలు అత్యధికంగా(97%) రాష్ట్రపతి పదవి కాలాన్ని తగ్గిస్తూ తాయారు చేసిన కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించారు. జుంటా కి నేతృత్వం వహిస్తున్న కలనల్ వళ్ ప్రజాభిప్రాయానికి కట్టుబడి ఉంటాను అని పదవిని శాంతియుతంగా వేరొకరికి అప్పుచెపుతానని మాట ఇచ్చారు. ఇజ్రాయిల్ ను గుర్తించిన మూడు అరబ్ దేశాలలో మౌరిటానియ ఒకటి, కొత్త ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్ తో సత్సంబంధాలు కొనసాగించింది, ఈ చర్య విమర్శలకు తావు ఇచ్చింది, తయా ఏలుబడిలో పశ్చిమ దేశాల అనుగ్రహం పొందడానికి చేసిన ప్రయత్నం వలె ఉందని వారు వాదించారు.
నవంబర్ 16 మరియు డిసెంబర్ 3, 2006లో విధాన సభ మరియు పురపాలక ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
[మార్చు] 2007 రాష్ట్రపతి ఎన్నికలు
1960 తరువాత పూర్తి ప్రజాతంత్ర పద్దతిలో రాష్ట్రపతి ఎన్నికలు మొదటిసారిగా మార్చ్ 11 2007లో జరిగాయి. ఈ ఎన్నిక ద్వారా 2005లో మౌరిటానియ సైనిక పరిపాలన నుంచి ప్రజపాలనకు అధికారం బదిలీ అయ్యింది. స్వతంత్ర దేశ చరిత్రలో మొట్టమొదటి సారి రాష్ట్రపతిని బహుళ అభ్యర్ధి ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు.[15]
సిది ఔల్ద్ చేఖ్ అబ్దల్లహి,తన సమీప అభ్యర్ధి అహ్మద్ ఔల్ద్ దద్దః పైన రెండో రౌండ్లో గెలిచారు.
[మార్చు] 2008 సైనిక తిరుగుబాటు
- ప్రధాన వ్యాసం: 2008 Mauritanian coup d'état
రాష్ట్రపతి అంగరక్షకులు రాష్ట్రపతి భవనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆగస్ట్ 6 2008లో రాజధాని నౌక్చోత్ట్ లోని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలను సైనిక పటాలాలు చుట్టిముట్టాయి. ఆ రోజున అధికార పక్షంకి చెందిన నలభై మంది విధాన సభ సభ్యులు రాజీనామా చేసారు. రాష్ట్రపతి తన రక్షణ అధికారి మరియు ఇంకొకరిని పదవి నుంచి తొలిగించారు, అప్పుడు సైన్యం ప్రభుత్వ టెలివిజన్ భవనాన్ని అదుపులోకి తీసుకుంది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మరియు అంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రిని నిర్బందించారు.[16]
ఈ తిరుగుబాటుకు జనరల్ మొహమ్మద్ ఔల్ద్ అబ్దేల్ అజీజ్ నేతృత్వం వహించారు, ఈయన మౌరిటానియ మాజీ సైనిక అధ్యక్షుడు మరియు రాష్ట్రపతి రక్షకదళానికి కూడా అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్రపతి ఈయన్ని పదవి నుంచి తొలగించారు. రాష్ట్రపతి సిది ఔల్ద్ చేఖ్ అబ్దల్లహి,ప్రధాన మంత్రి యహ్య ఔల్ద్ అహ్మద్ వాఘ్ఫ్, మరియు అంతరంగిక మంత్రులను ద్రోహులైన సైనిక అధికారులు నిర్బంధించారు అని ఒక ప్రకటనలో మౌరిటానియ అధికార ప్రతినిధి అయిన అబ్దౌలయే మమదౌబ పేర్కొన్నారు. వారందరూ రాజధాని నౌక్చోత్ట్ లోని రాష్ట్రపతి భవనంలో గృహ నిర్బంధించబడ్డారు అని ప్రకటించారు.[17][18][19] చూడడానికి విజయం సాధించిన ఈ అనూహ్య విప్లవంలో, BASEP(రాష్ట్రపతి రక్షక దళం)కు చెందిన రక్షణ ప్రతినిధులు మా ఇంటికి వచ్చి నాన్నగారిని తీసుకుని వెళ్లారు అని అబ్దల్లహి కుమార్తె అమల్ మింట్ చేఖ్ అబ్దల్లహి చెప్పారు.[20] కొద్దిసేపటి తరువాత రాష్ట్రపతి శాసనం చేసి కుట్రదారులు అందరిని పదవుల నుంచి తొలగించారు. వారిలో జనరల్ ముహమ్మద్ ఔల్ద్ అబ్ద్ అల్-అజీజ్, జనరల్ ముహమ్మద్ ఔల్ద్ అల్-ఘాజ్వని, జనరల్ ఫిలిప్ స్విక్రి, మరియు బ్రిగేడియర్ జనరల్(అకిద్)అహ్మద్ ఔల్ద్ బాక్రి ముఖ్యులు.[21]
[మార్చు] తిరుగుబాటు తరవాత
"దేశంలో చాలా మంది ప్రజలు తిరుగుబాటు ప్రయత్నంను సమర్ధిస్తున్నారు మరియు ప్రస్తుత ప్రభుత్వం "అధికార వాంఛ ప్రభుత్వం" మరియు రాష్ట్రపతి చట్ట సభలో బలవంతంగా ఆధిక్యతను సాధించారు"అని మౌరిటానియ చట్ట సభ సభ్యుడు అయిన మొహమ్మద్ అల్ ముఖ్తర్ ప్రకటించారు.[22] 2007 ఎన్నికలలో అబ్దల్లహి విరోధి అయిన అహ్మద్ ఔల్ద్ దద్దః మద్దత్తు కూడా ఈ తిరుగుబాటుకు ఉంది. ఏది ఏమి అయినప్పటికీ ఔల్ద్ అబ్ద్ అల్-అజీజ్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఏకాకిని చేసాయి, అంతే కాకుండా దౌత్య సంబంధాల పైన ఆంక్షలు విధించాయి మరియు సహాయక కార్యక్రమాలు కూడా నిలిపివేసాయి. అల్జీరియా, అమెరికా, ఫ్రాన్సు,మరియు ఇతర ఐరోపా దేశాలు తిరుగుబాటుని ఖండించి, అబ్దేల్లహిని రాష్ట్రపతిగానే గుర్తిస్తున్నాయి, అయితే తిరుగుబాటుదారులకు మొరాకో, లిబియా మరియు ఇరాన్ దేశాల మద్దత్తు లభించింది. కొన్ని పక్షాలు అబ్దేల్లహికి మద్దత్తుగా కలిసి తిరుగుబాటు పైన తమ అలజడి చేసారు.దీనివల్ల జుంటా ప్రదర్శనలును రద్దు చేసింది మరియు ప్రతిపక్షంకు చెందిన వారి పైన దాడులు చేసింది. దేశీయ అంతర్జాతీయ ఒత్తిడులు పని చేసాయి, తన స్వగ్రామంలో గృహ నిర్బంధంలో ఉన్న అబ్దేల్లహిని విడుదల చేసారు. ఇస్రాయిల్ ప్రభుత్వాన్ని 1999లో గుర్తించిన మౌరిటానియ 2008 /2009 గాజా దండయాత్రలో కొత్త ప్రభుత్వం ఇస్రాయిల్తో సంబంధాలను తెంచుకుంది. ఈ చర్య వల్ల అరబ్ దేశాలలో కొద్దిగా గుర్తింపు పెరిగింది, ఇరాన్ మరియు లిబియాలు సహాయం చేస్తామని మాట ఇచ్చాయి. 2009 తోలినాళ్ళలో అబ్ద్ అల్-అజీజ్ ప్రభుత్వం బలహీనంగా, ఏకాకిగా కనిపించింది. మౌరిటానియ ఇస్రాయిల్ తో సంబంధాలు పూర్తిగా మరియు ఖచ్చితంగా తెంచుకున్నట్టు మౌరిటానియ మహిళా విదేశాంగ మంత్రి నహ హమ్ది ఔల్ద్ మౌక్నాస్ మార్చ్ 2010లో ప్రకటించారు.[23]
అప్పటి నుంచి అబ్దల్లహిని మార్చడానికి ఎన్నికలు జరపడానికి అబ్ద్ అల్-అజీజ్ ప్రయత్నించినప్పటికీ జాతీయ అంతర్జాతీయ ఒత్తిడుల కారణంగా వాయిదా వేస్తున్నారు. 2009లో ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తులు మరియు అంతర్జాతీయ పక్షాలతో జుంటా చర్చలు జరిపింది. దానివల్ల పరిస్థితుల్లో అనూహ్య మార్పులు సంభవించాయి. అబ్దల్లహి రాజీనామా చేసాడు, కానీ ప్రతిపక్షాలు అతన్ని దూరంగా పెట్టాయి మరియు ఫ్రాన్సు, అల్జిరియలు అబ్ద్ అల్-అజీజ్ కు మద్దత్తుగా నిలిచాయి. అమెరికా తిరుగుబాటును ఖండిస్తూ వచ్చింది కానీ ఎన్నికలకు విరుద్దంగా ఏమీ అనలేదు. అబ్దేల్లహి రాజీనామా, సైన్యం బలపరిచిన మహమ్మద్ ఔల్ద్ అబ్ద్ అల్-అజీజ్ని ప్రజాతంత్ర ఎన్నికల్లో రాష్ట్రపతి అవ్వడానికి మార్గం సుగమం చేసింది. ఈ ఎన్నికల్లో ఆయన జూలై 18న 52% ఆధిక్యతతో నెగ్గారు. అబ్దల్లహి పూర్వ సమర్ధకులు దీన్ని ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించి, ఈ ఫలితాలను గుర్తించమని చెప్పారు. జుంటా ఎన్నికలను ప్రభావితం చేసింది, అంతర్జాతీయ దేశాలు ప్రతిపక్షాలను మోసం చేసాయి అని ఫిర్యాదు చేసారు. చిన్న చిన్న అభ్యంతరాల మినహా ఎన్నికలను పాశ్చత్య,అరబ్ మరియు ఆఫ్రికా దేశాలు గుర్తించాయి.ఆ దేశం పైన విధించిన ఆంక్షలను తొలగించి మౌరిటానియతో సహకరించడం కొనసాగించాయి. వేసవికాలం చివరికల్లా అబ్ద్ అల్-అజీజ్ జాతీయ,అంతర్జాతీయ మద్దత్తుతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు, అయినప్పటికీ ప్రభావ వంతమైన పక్షాలు రాజకీయవేత్తలు, ప్రత్యేకంగా చట్ట సభ సభాపతి అయిన మేసౌద్ ఔల్ద్ బౌల్ఖేర్ అబ్ద్ అల్-అజీజ్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
[మార్చు] ప్రాంతాలు మరియు విభాగాలు
- ప్రధాన వ్యాసాలు: Regions of Mauritania & Departments of Mauritania
మౌరిటానియ పన్నెండు ప్రాంతాలుగా (రీజియన్స్ ) విభజింపబడింది. వీటిని విలాయ అంటారు మరియు రాజధాని జిల్లా నౌక్చోత్ట్ , వీటిని మరలా 44 విభాగాలుగా(మౌఘతా ) విభజించారు. ఆ ప్రాంతాలు మరియు రాజధాని జిల్లా(అక్షర క్రమంలో) వాటి రాజధానులు ఈ విధంగా ఉన్నాయి:
| ప్రాంతం | రాజధాని | ||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అద్రార్ | అతార్ | అస్సాబా | కిఫా | బరకన | అలెగ్ | దాఖ్లేట్ నౌఅదిబౌ | నౌఅదిబౌ | గోర్గోల్ | కయడి | గుయ్దిమక | సేలిబబి | హద్ ఎచ్ చర్గుయ్ | నీమ | హద్ ఎల్ ఘర్భి | అయౌన్ ఎల్ అత్రౌస్ | ఇంచిరి | అక్జౌజ్ట్ | నౌక్చోత్ట్ (capital district) | తగంట్ | తిడ్జిక్డ్జ | టిరిస్ జేమ్మౌర్ | ఎఫ్ డెరిక్ | త్రార్జా | రోస్సో | |
[మార్చు] భౌగోళిక అంశాలు
- ప్రధాన వ్యాసం: Geography of Mauritania
>
మూస:Convert/LonAoffDbSoffమూస:Convert/test/A[24]బొలివియ తరువాత మౌరిటానియ ప్రపంచంలో 29వ అత్యంత పెద్ద వైశాల్యం కల దేశం. దీని వైశాల్యంను ఈజిప్ట్ వైశాల్యంతో పోల్చవచ్చు.
మౌరిటానియ ఉపరితలం సాధారణంగా మైదానంలాగా ఉంటుంది,>
10,30,631 square kilometers (3 sq mi)మూస:Convert/test/Aవిశాల మైదానాలు ఎండిపోయి ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న కొండలు భూమి పైకి పొడుచుకుని ఉంటాయి. విశాల మైదానలని, ఆగ్నేయంలో ఒక వరుస క్రమంలో ఈ కొండలు విడదీస్తాయి. ఈ కొండ చర్యలు ఇసుకరాయి పీట భూములను వేరు చేస్తున్నాయి, వీటిలో పెద్దది అద్రార్ పీట భూమి, దీని ఎత్తు>
500 meters (1 ft)మూస:Convert/test/A. కొన్ని కొండల అడుగు భాగాన స్ప్రింగ్-ఫెడ్ ఎండమావులు ఉన్నాయి. కొన్ని శిఖరాలలో సహజ వనరులు పుష్కలంగా ఉండొచ్చు. ఇవి పీట భూమి పైన అక్కడక్కడ ఉంటాయి,చిన్న శిఖరాలను గుఎల్బ్స్, పెద్దవాటిని కేదియాలు అంటారు. ఏకే కేంద్రక గుఎల్బ్ ఎర్ రిచాట్(దీనిని రిచాట్ నిర్మాణము అనికూడా అంటారు)ఉత్తర-మధ్య ప్రాంతంలో ఇది ఒక గొప్ప విశేషం. జౌరిరాట్ పట్టణం దగ్గర ఉన్నకేడియట్ ఏజ్ జిల్ అత్యంత ఎత్తు అయినది, మరియు దీని పొడవు>
1,000 meters (3 ft)మూస:Convert/test/A.
మౌరిటానియ లో దాదాపు మూడొంతులు ఎడారి ఉంది. తీవ్ర కరువు వల్ల 1960 మధ్యకాలం నుంచి ఎడారి పెరుగుతుంది. పడమర వైపు,సముద్రం మరియు పీట భూముల మధ్యలో బంక నేలలు(రేగ్స్) మరియు ఇసుక తిన్నెలు(ఏర్గ్స్)ఉన్నాయి,గట్టి గాలుల వల్ల ఇవి కదులుతూ ఉంటాయి. ఉత్తర దిశగా ఇసుక తిన్నెల పరిమాణం మరియు కదలిక పెరుగుతూ ఉంటుంది.
[మార్చు] ఆర్థిక వ్యవస్థ
- ప్రధాన వ్యాసం: Economy of Mauritania
మౌరిటానియలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆఫ్రికా దేశాలు అన్నిటిలోకి అత్యల్ప వార్షిక ఆదాయం కల్గిన దేశం. 1970 1980ల కరువుల మూలంగా దేశ దిమ్మేరులు,వ్యవసాయదారులు పట్టణాలకి వలస పోయినప్పటికీ, చాలా మంది ప్రజలు వ్యవసాయం,పశువుల నిల్వల మీదే ఆధారపడ్డారు. మౌరిటానియలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. దేశ ఎగుమతులలో 50% ఇనుప ఖనిజానిదే. అంతర్జాతీయంగా లోహం మరియు బంగారం,రాగి ధరలు పెరగడంతో, సంస్థలు మారుమూల ప్రాంతాలలో కూడా గనులు తెరుస్తున్నాయి. దేశ తీర ప్రాంతం ప్రపంచం లోకెల్లా మత్స్య సంపద అధికంగా ఉన్న దేశం, కానీ విదేశీయులు పరిమితి మించి వేట ఆడడం వల్ల దేశానికీ కీలకమైన ఆర్ధిక వనరును కోల్పోయే భయం ఉంది.[citation needed] దేశంలోని సముద్ర మధ్యలో ఉన్న నౌకాశ్రయంని మొదటగా నౌక్చోత్ట్ వద్ద నిర్మించారు. ఈ మధ్య కాలంలో కరువులు మరియు అస్తవ్యస్త ఆర్ధిక విధానాల వల్ల విదేశీ అప్పు పెరిగింది. మార్చ్ 1999లో మౌరిటానియ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు-IMF తో సంయుక్తంగా 54 మిల్లియన్ డాలర్ల ఎంహన్సుడ్ స్తక్చర్ల్ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటీ(ESAF). 1999-2002లకు ఆర్ధిక గమ్యాలు తాయారు చేసారు. ప్రైవేటీకరణ ఒక కీలకాంశం. ESAF వార్షిక ఆదాయ వృద్ది గమ్యాలు 4%-5% సాధించే అవకాశం ఉంది.
2001 సముద్ర గర్భంలో, చిన్గ్యుట్టి నిల్వలలో చమురును గుర్తించారు. చమురు మౌరిటానియ ఆర్ధిక రంగానికి తోడ్పడే అవకాశం ఉన్నప్పటికీ, ఇది దేశానికీ యెంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. మౌరిటానియ "పేదరికంతో ఉన్న ఒక నిరాశ కల్గిన దేశం, అరబ్ మరియు ఆఫ్రికన్ దేశాల ముంగిట సహాయం కోసం చేతులు చాస్తుంది,ఆఫ్రికాలో కొత్తగా మరియు చిన్న పరిమాణంలో చమురు ఉత్పత్తి చేస్తోన్న దేశం" అని అభివర్ణించారు.[25] ఇంకా చమురు నిల్వలు తౌదెని నదీ పరివాహిక ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది, కానీ అక్కడి భయంకర పరిసరాల వల్ల వెలికి తీయడం ఖర్చుతో కూడుకున్న పని.[26]
ప్రభుత్వానికి ముందున్న ప్రధాన సమస్య ఆర్ధిక రంగాన్ని ప్రైవేటీకరించటం.
[మార్చు] జనాభా మార్పులు మరియు పరిశీలన
- ప్రధాన వ్యాసాలు: Demographics of Mauritania, Islam in Mauritania & Christianity in Mauritania
- జనాభా
- 3,205,060 (జూలై 2010 అంచనా ప్రకారం)[27]
- జాతి సమూహాలు
- 40% మూరలు మరియు నల్లవారి సంకరజాతి; 30% మూర్లు; 29% నల్ల వారు;[27] 1% ఫ్రెంచ్ వారు
- మతం
- దాదాపు 100% ముస్లింలే, అందులో చాలా మంది సున్ని తెగ వారు ఉన్నారు. దేశంలో ఒకే ఒక్క చిన్న కాథలిక్ సమూహం ఉంది, రోమన్ కాథలిక్ డియోసెస్ నౌఖ్చోత్ట్.
- భాషలు
- హస్సనియ అరబిక్ యాస (అధికారిక మరియు జాతీయ);
వాడుకలో ఉన్న మిగతా భాషలు పులార్, సోనిన్కే,ఇమర్గ్యున్ బాష, వలోఫ్ మరియు ఫ్రెంచ్ (మీడియా మరియు విద్యాధిక సమాజంలో, ఆఫ్రికా ఫ్రెంచ్ చూడండి).
[మార్చు] ఆరోగ్యం
- ప్రధాన వ్యాసం: Health in Mauritania
2008 అంచనా ప్రకారం మనిషి జీవన ఆయుర్దాయం 53.91 సంవత్సరాలు.[27] 2004లో ఆరోగ్యం ఫై తలసరి కర్చు 43 యు.ఎస్ డాలర్లు(PPP).[28] 2004లో ప్రజా సంక్షేమానికి చేసిన ఖర్చు వార్షిక ఆదాయంలో 2% మరియు ప్రైవేటు రంగంలో 0.9%.[28] 21 శతాబ్దం ఆరంభంలో దేశంలో ప్రతి 100,100 మంది ప్రజలకు 11 డాక్టర్లు ఉండేవారు.[28] శిశు మరణాలు పుట్టిన పిల్లల్లో 7,8% ఉండేది.[28]
మౌరిటానియ ప్రజల దృష్టిలో అందం అంటే లావుగా ఉండడం, సన్నగా ఉన్న వాళ్ళని జబ్బు మనుషులు కింద జమ కడతారు. అందువల్ల మౌరిటానియలో ఉబకాయ ఆడవారు చాలా ఎక్కువ.
[మార్చు] సంస్కృతి
దేశ పేరు లాటిన్ పదం మౌరేతనియ నుంచి వచ్చింది. దీని అర్ధం మౌరి యొక్క భూమి.
మౌర్ మత పెద్దల సహకరంతో ఫ్రెంచ్ వారు మౌరిటానియను 1860లో ఆక్రమించుకున్నారు. రాజ్యాలైన ఫౌత తోరో వాలో మరియు అరబ్-బెర్బెర్ సంస్థానాలు తరర్జా, బ్రాక్న, తాగనేట్, మరియు అద్రార్ సంస్థానాల వినాశనం తరువాత మౌరిటానియ దేశంగా ఏర్పడ్డది. దీని వల్ల దేశంలో రెండు ప్రధానమైన మత సమూహాలు ఉన్నాయి:నల్ల ఆఫ్రికన్ జాతి వారు మరియు అరబ్ బెర్బెర్లు. నల్ల ఆఫ్రికన్ సమూహంలో ఫులని,సోనిన్కే,మరియు బంబార తెగలు ఉన్నారు. మౌరుల్లో అరబ్-బెర్బెర్లు(బెయ్దన్) మరియు హారతిన్ అని కూడా పిలువబడే నల్ల మౌర్లు ఉన్నారు. హరతిన్లు నల్ల ఆఫ్రికన్లు వీరిని శ్వేత మౌర్లు బానిసలను చేసుకున్నారు. శ్వేత మరియు నల్ల మౌర్లు తమని తాము అరబ్ వారి మని చెప్పుకుంటున్నారు. అరబ్ మౌర్లు కాని వారు ఆఫ్రికన్లు అని చెప్పుకుంటారు. అన్నింటి కన్నా ముఖ్యమైన సార్వజనికంగా ఉండేది సున్ని ఇస్లాం.
- మౌరిటానియ సంగీతం
- మౌరిటానియలో ఇస్లాం
- మౌరిటానియ లో మత స్వేఛ్చ పరిస్థితులు
- మౌరిటానియ మరియు మడగాస్కర్ ప్రపంచంలో ఈ రెండు దేశాలు మాత్రమే సంఖ్యా ఆధారిత డబ్బుని వాడవు. ఔగుయ మూలాధారం విలువ ఐదు ఖౌములు
- ఇక్కడ చాలా లఘు చిత్రాలు మరియు చలనచిత్రాల చిత్రీకరణ జరిగింది. వాటిలో ఫోర్ట్ సగాన్నే (1984),లైఫ్ విత్ అవుట్ డెత్ (1997), ది ఫిఫ్త్ ఎలెమెంట్ (1997),ది బుక్స్ అండర్ ది సాండ్ (1997),విన్గ్ద్ మైగ్రేషన్ (2001),మరియు హీరేమకోనో (2002) ముఖ్యమైనవి.
[మార్చు] విద్య
- ప్రధాన వ్యాసం: Education in Mauritania
1999 నుంచి ప్రాధమిక విద్య అంతా అరబిక్ లో చెపుతారు, ఫ్రెంచ్ ని రెండో సంవత్సరంలో నేర్పుతారు, మరియు అన్ని విజ్ఞాన శాస్త్రాలని అందరికి ఫ్రెంచ్ లో నేర్పిస్తారు.[29] ఇంగ్లీష్ మరియు వేల్దియ భాషల వాడకం పెరుగుతుంది.[citation needed] ఈ దేశంలో నౌక్చోత్ట్ విశ్వవిద్యాలయం మరియు ఇతర ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. 2000-2007 ప్రభుత్వ ఖర్చులో విద్యపైన 10.7% ఖర్చుచేసారు.[28]
[మార్చు] వీటిని కూడా చూడండి
- ప్రధాన వ్యాసాలు: Outline of Mauritania & Index of Mauritania-related articles
- మౌరిటానియ లో బానిసత్వం
[మార్చు] గమనికలు
- ↑ Department of Economic and Social Affairs Population Division (2009). "World Population Prospects, Table A.1" (PDF). Retrieved on 2009-03-12.
- ↑ Mauritania : Location, Map, Area, Capital, Population, Religion, Language - Country Information. తీసుకొన్న తేదీ: 2008-08-06.
- ↑ 3.0 3.1 3.2 3.3 Mauritania. International Monetary Fund. తీసుకొన్న తేదీ: 2010-04-21.
- ↑ Human Development Report 2009. The United Nations. Retrieved 15 October 2009.
- ↑ UNDP: Human development indices - Table 3: Human and income poverty (Population living below national poverty line (2000-2007)) (PDF). తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ Chaabani H; Sanchez-Mazas A, Sallami SF (2000). "Genetic differentiation of Yemeni people according to rhesus and Gm polymorphisms". Annales de Génétique 43 (3-4): 155–62. DOI:10.1016/S0003-3995(00)01023-6. PMID 11164198. Retrieved on 2008-08-06.
- ↑ మౌరిటానియ పార్లమెంట్ సభ్యులు మౌరిటానియ బానిస చట్టాన్ని ఆమోదించారు. బిబిసి వార్తలు ఆగస్టు 26, 2009
- ↑ ఇంకా సమాచార కోసం బానిసల యజమాని రాసిన గ్రంధం "ఎన్ స్లేవ్ద్, ట్రు స్టోరీస్ అఫ్ మోడరన్ డే స్లేవరీ. దీనిని అమెరిక బానిస విరుద్ద సంస్థకు చెందిన జేస్సే సేజ్ మరియు లిఒర కస్టేన్ సంకలనం చేసారు.
- ↑ ది అబోలిషణ్ సీసన్ బిబిసి ప్రపంచ కార్యక్రమాలు
- ↑ మౌరిటానియ బానిసత్వాన్ని పోయిన నెల చట్ట విరుద్దం చేసింది సౌత్ ఆఫ్రికన్ అంతర్జాతీయ వ్యవహారాల శాఖ సెప్టెంబరు 8, 2009.
- ↑ మౌరిటానియ: జాతిపరమైన అసమానతలు మౌరిటానియ ఎన్నికలను వెంటాడాయి. IRIN. మార్చ్ 5, 2007.
- ↑ "Crackdown courts U.S. approval", CNN, 24 November 2003. Retrieved on 2008-08-06.
- ↑ "MAURITANIA: New wave of arrests presented as crackdown on Islamic extremists", IRIN Africa, 12 May 2005. Retrieved on 2008-08-06.
- ↑ "Mauritania officers 'seize power'", BBC News, 4 August 2005. Retrieved on 2008-08-06.
- ↑ "Mauritania vote 'free and fair'", BBC News, 12 March 2007. Retrieved on 2008-08-06.
- ↑ tehran times : 48 lawmakers resign from ruling party in Mauritania. తీసుకొన్న తేదీ: 2008-08-06.
- ↑ (AFP) – Aug 6, 2008 (2008-08-06). afp.google.com, Coup in Mauritania as president, PM arrested. Afp.google.com. తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ news.bbc.co.uk, Troops stage 'coup' in Mauritania. BBC News (2008-08-06). తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ ap.google.com, మౌరిటానియలో మార్గమధ్యంలో ఉన్న అధికారం: ప్రెసిడెంట్ కార్యాలయం[dead link]
- ↑ McElroy, Damien (2008-08-06). telegraph.co.uk,Mauritania president under house arrest as army stages coup. Telegraph.co.uk. తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ Vinsinfo. themedialine.org, Generals Seize Power in Mauritanian Coup. Themedialine.org. తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ ap.google.com, మౌరిటానియలో రేనేగేడ్ సైన్యాధికారుల స్థాయి అధికారం[dead link]
- ↑ Mauritania Affirms Break with Israel | Middle East | English. .voanews.com (2010-03-21). తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ CIA - The World Factbook - Rank Order - Area. తీసుకొన్న తేదీ: 2008-08-06.
- ↑ అధికారం ముగిసిన ఒక రోజు తరువాత మౌరిటానియ యొక్క నూతన అధికారగణం సాధ్యమయినంత త్వరగా స్వేచ్చాయుత ఎన్నికలకు భరోసా ఇస్తుంది", సంబంధిత ముద్రణాలయం
- ↑ Taoudeni Basin Overview. Baraka Petroleum. తీసుకొన్న తేదీ: 2009-03-14.[dead link]
- ↑ 27.0 27.1 27.2 CIA - The World Factbook - Mauritania. తీసుకొన్న తేదీ: 2010-11-07.
- ↑ 28.0 28.1 28.2 28.3 28.4 Human Development Report 2009 - Mauritania. Hdrstats.undp.org. తీసుకొన్న తేదీ: 2010-07-04.
- ↑ Education system in Mauritania. Bibl.u-szeged.hu. తీసుకొన్న తేదీ: 2010-07-04.
[మార్చు] సూచనలు
- సిఐఎ వాస్తవాల పుస్తకం, https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/mr.html
- యు ఎస్ స్టేట్ డిపార్టుమెంటు /0}, http://www.state.gov/r/pa/ei/bgn/5467.htm
- ఎన్సైక్లోపెడియా బ్రిటాన్నికా, మౌరిటానియ -దేశ పుట
[మార్చు] బాహ్య లింకులు
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి
- ప్రభుత్వం
- రిపబ్లిక్ ఇస్లామిక్ డి మౌరిటనియే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్
- అసెంబ్లీ నాశనల్ మౌరిటానియన్నెఅధికారిక వెబ్ సైట్
- దేశ అధ్యక్షుడు మరియు మంత్రిమండలి సబ్యులు
- సాధారణ సమాచారం
- మౌరిటానియ అల్-బాబ్ నుంచి
- దేశ వివరాలు బిబిసి వార్తా సంస్థ నుంచి
- మౌరిటానియ ఎన్సైక్లోపెడియా బ్రిటాన్నికా నుంచి
- మూస:CIA World Factbook link
- మౌరిటానియ యుసిబి పుస్తకాలయం ప్రభుత్వ ప్రచురణలు నుంచి
- మౌరిటానియ at the Open Directory Project
- మూస:Wikiatlas
- ప్రసార సాధనాల్లో వార్తలు
- పతాక శిర్షిక లింకులు ఆల్ ఆఫ్రికా.కాం
- మూస:Fr icon మూస:Ar icon మూస:En icon మఘరేబియ వార్తలు మరియు మఘ్రేబ్ దృష్టికోణం
- పర్యాటకరంగం
| Geographic locale | ||||||
|
||||||
| International membership |
|
మూస:Member states of the Arab Maghreb Union మూస:Arab League మూస:African Union మూస:Islamic republics మూస:Organization of the Islamic Conference (OIC) మూస:La Francophonie |
| Languages |
|
మూస:Afro-Asiatic-speaking nations మూస:Niger-Congo-speaking nations |
- All articles with dead external links
- Articles with dead external links from July 2010
- Articles with invalid date parameter in template
- Articles with dead external links from September 2010
- Wikipedia pages with incorrect protection templates
- All articles with unsourced statements
- Articles with unsourced statements from June 2008
- Articles with unsourced statements from February 2010
- Articles with unsourced statements from May 2010
- ఆఫ్రికా
- మౌరిటానియ
- ఆఫ్రికా దేశాలు
- ఆఫ్రికా యూనియన్ సభ్యదేశాలు
- అరబ్ లీగ్ సభ్య దేశాలు
- అరబిక్-మాట్లాడే దేశాలు
- అట్లాంటిక్ సముద్రం సరిహద్దు గల దేశాలు
- ఫ్రెంచ్-మాట్లాడే దేశాలు
- అభివృద్ధి అత్యల్పంగా ఉన్న దేశాలు
- ఇస్లామిక్ గణతంత్రాలు
- ఇస్లామిక్ దేశాలు
- లా ఫ్రాంకోఫోనీ యొక్క సభ్య రాష్ట్రాలు
- సైనిక నియంతృత్వం
- ఉత్తర ఆఫ్రికా
- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ సభ్యులు
- తిరుగుబాటు ద్వారా రాజకీయ పెరుగుదల
- 1821లో ఏర్పడిన రాష్ట్రాలు మరియు ప్రాదేశిక ప్రాంతాలు