యండమూరి వీరేంద్రనాథ్
| యండమూరి వీరేంద్రనాథ్ | |
| జన్మ నామం | యండమూరి వీరేంద్రనాథ్ |
|---|---|
| జననం | నవంబరు 14 1948 (వయసు 64)[1] |
| నివాసం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా |
| ఇతర పేర్లు | యండమూరి |
| వృత్తి | చార్టర్డ్ అకౌంటెంట్ రచయిత సినిమా, టి.వి దర్శకుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు |
| మతం | హిందూ |
| భార్య/భర్త | అనుగీత[2] |
| సంతానం | ప్రణీత్ [2] |
| తండ్రి | యండమూరి చక్రపాణి |
| తల్లి | నరసమాంబ |
| వెబ్‌సైటు | yandamoori.com |
యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు.తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు[3]. ఇతడు తెలుగులో సుప్రసిద్ద నవలా రచయత. యండమూరి రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.
విషయ సూచిక |
బాల్యం, విద్యాభ్యాసం [మార్చు]
యందమూరి వీరేంద్రనాథ్ తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు. తండ్రి ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వల్ల ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగాడు. అందు వల్ల ఆయన బాల్యం అనేక ప్రాంతాల్లో గడిచింది. ప్రాథమిక విద్య కాకినాడ, రాజమండ్రి లోనూ ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బీకాం కాకినాడ లోనూ చదివాడు. 1972 లో సీఏ పట్టా పుచ్చుకున్నాడు.
ఉద్యోగం [మార్చు]
వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన యండమూరి ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో, పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ విభాగానికి అధిపతిగా పనిచేశాడు. పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
కుటుంబం [మార్చు]
ఆయనకు 10-03-1974 లో అనుగీత తో వివాహం జరిగింది. వారి కుమారుడి పేరు ప్రణీత్.
పురస్కారాలు [మార్చు]
- రఘుపతి రాఘవ రాజారాం నాటకానికి 1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు
- 1996 లో వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహికకు ఉత్తమ దర్శకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం.
రచనా శైలికి ఉదాహరణలు [మార్చు]
వివిధ నాటకాలు,నాటికలు నవలలు,సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో ఈయన వ్రాసిన ఈ పంక్తులు,చెప్పిన మాటలు ఈయన శైలి ఏమిటో చెబుతాయి.
- ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే... ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు... చాలు!
- ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!
- నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం,అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.
- మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ...అన్నీ ఉంటాయి.
- వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?
- దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీఅంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.
- దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒకగీతకి కేవలం అటూ ఇటూ ఉండటాంవల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.
- కన్నీరా! క్రందకి జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!
- జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.
- ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తిశిఖరాలని ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతోసహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.
- విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?
- దెయ్యాలు శ్మశానంలో ఉండవు. మనిషి మనసులోనే ఉంటాయి. భయం అన్న పేరుతో.
- అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్న ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది.
యండమూరి నవలలు [మార్చు]
- వెన్నెల్లో ఆడపిల్ల
- పర్ణశాల
- భార్యా గుణవతి శత్రు
- తులసి దళం
- తులసి
- ఆనందో బ్రహ్మ
- ఋషి
- అభిలాష
- డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు (డబ్బుడబ్బు)
- డబ్బు మైనస్ డబ్బు
- అగ్ని ప్రవేశం
- స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్
- రుద్రనేత్ర
- ఆఖరిపోరాటం
- చెంగల్వపూదండ
- అనైతికం
- అంకితం
- అంతర్ముఖం
- అష్టావక్ర
- అతడు ఆమె ప్రియుడు
- అతడే ఆమె సైన్యం
- చీకట్లో సూర్యుడు
- ధ్యేయం
- దుప్పట్లో మిన్నాగు
- క్షమించు సుప్రియా
- లేడీస్ హాస్టల్
- మంచు పర్వతం
- మంచుపూల వర్షం [4], [5]
- ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్ [6]
సూచికలు [మార్చు]
- మరణ మృదంగం
- మరో హిరోషిమా
- నల్లంచు తెల్లచీర
- ఒకరాధ ఇద్దరు కృష్ణులు
- ఒక వర్షాకాలపు సాయంత్రం
- 13-14-15
- ప్రార్ధన
- ప్రేమ
- ప్రియురాలు పిలిచె
- రాధ-కుంతి
- రాక్షసుడు
- రెండు గుండెల చప్పుడు
- ఋషి
- సంపూర్ణ ప్రేమాయణం
- సిగ్గేస్తోంది
- స్వర బేతాళం
- ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
- థ్రిల్లర్
- యుగాంతం
సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు [మార్చు]
- దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచుతెల్లచీర నవల వ్రాయబడినది. రెండింటి మద్య చాలా తేడాలు(పాత్రలు,కథ) వున్నాయి.
వ్యక్తిత్వ వికాస రచనలు [మార్చు]
- విజయానికి అయిదు మెట్లు
- విజయానికి ఆరవ మెట్టు [7]
- విజయ రహస్యాలు
- మీరు మంచి అమ్మాయి కాదు
- మిమ్మల్ని మీరు గెలవగలరు, మిమ్మల్ని మీరు గెలవగలరు (అర్కీవ్.అర్గ్ లో పుస్తకం)
- విజయంలో భాగస్వామ్యం
- విజయం వైపు పయనం [8]
- మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా?
- గ్రాఫాలజీ
- తప్పు చేద్దాం రండి
ఇతర రచనలు [మార్చు]
- చదువు ఏకాగ్రత
- మంచి ముత్యాలు (కొటేషన్స్)
- పడమటి కోయిల పల్లవి (కవిత్వం)
- పిల్లల పేర్ల ప్రపంచం
- పాపులర్ రచనలు చేయడం ఎలా?
- మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే? మిమ్మల్ని పిల్లలు ప్రేమించాలంటే (అర్కీవ్.అర్గ్ లో పుస్తకం)
- మంచి రచనలు చేయడం ఎలా?
సినిమా మాటలు రచయతగా [మార్చు]
సినీ దర్శకుడిగా [మార్చు]
ఇవికూడా చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- యండమూరి వీరేంద్రనాథ్ :అధీకృత వెబ్‌సైటు లింక్
- yandamoori.com : యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు కావాలంటే
- ఇంటర్రన్ట్ మూవీ డేటా బేస్ : imdb-లింక్
- ఏవికేఎఫ్.ఆర్గ్ : యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు
మూలాలు [మార్చు]
- ↑ "జీవిత సంగ్రహం". yandamoori.com. 2008-07-12. Retrieved 12 జులై,2008.
- ↑ 2.0 2.1 "యండమూరి జీవిత సంగ్రహం", yandamoori.com, 2008-07-12. Retrieved on జులై,12, 2008.
- ↑ యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం
- ↑ యండమూరి వీరేంద్రనాథ్....మంచుపూల వర్షం
- ↑ యండమూరి...మంచుపూల వర్షం
- ↑ అభిషిక్తం....ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్
- ↑ చిన్న కథలు....విజయానికి ఆరవ మెట్టు
- ↑ విజయం వైపు పయనం..దిగులు అంటే ఏమిటి
|
||||||||