యక్షగానం

వికీపీడియా నుండి

పగడము, తలకు ధరించే ఒక ఆభరణం. శిరోధార్యాలలో మగవారు పగడము మరియు కిరీటం ధరిస్తారు స్త్రీలు చిన్న పగడాలను ధరిస్తారు.

యక్షగానం (కన్నడం:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, వెషభూషణలకు ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ. కరావళి జల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలోనూ శివమొగ్గ మరియు కేరళ లోని కాసరగోడు జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు.

యక్షగాన ప్రదర్శన సాయంత్రవేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికిగా అన్నట్టు ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు . నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై శవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కవగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా , వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుసారంగా నాటకులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది.

[మార్చు] ప్రధాన అంశాలు

  • ప్రసంగము

యక్షగానము నందు ఏదైనా ఒక కథానికను ఎంచుకొని దాన్ని జనలకు గాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథానికను ప్రసంగ మని పిలుస్తారు. ఉదాహరణకు మహాభారతమునందు భీముడు మరియు దుర్యోధనుని మధ్య గధాయుద్ధ కథను ఎంచుకొన్నచో దానిని "గధాయుద్ద ప్రసంగము" అంటారు. ఎక్కవ పౌరాణిక ప్రసంగాలనే ఎంచుకున్నా. యక్షగానమందు ప్రసంగము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికమూ లేక సామాజికమూ అవ్వచ్చు.

  • వేషభూషణ
  • భాగవతారు
  • మాతుగారికె
  • హిమ్మేళ

[మార్చు] ప్రముఖ యక్షగాన కళాకారులు

  • భాగవతార్లు: నెబ్బూరు నారాయణ, డి. ఉప్పూరు నారణప్ప, కడతోక మంజునాథ భాగవతార్, డి. గుండ్మి కాళింగ నావుడ, సుబ్రహ్మణ్య ధారేశ్వర, నారాయణ శబరాయ, బలిప నారాయణ భాగవతారు, దామోదర మండెచ్చ, పోళ్య లక్ష్మీనారాయణ శెట్టి, కొళగి కేశవ హెగ్డే, లీలావతి బైపాడిత్తాయ (ఏకైక వృత్తిపర మహిళా భాగవతారు), పద్యాణ గణపతి భట్, దినేశ అమ్మణ్ణాయ, పుత్తిగె రఘురామ హొళ్ళ.
  • హిమ్మేళ కళాకారులు: డి. నెడ్లె నరసింహ భట్, కె.హరినారాయణ బైపాడిత్తాయ, కుద్రేకూడ్లు రామ్ భట్, కేశవ బైపాడిత్తాయ, మోహన బైపాడిత్తాయ, పద్యాణ శంకరనారాయణ భట్, అడూరు గణేశ్ రావు.
  • పాత్రధారులు: ది. కెరెమనె శివరామ హెగ్డే, కెరెమనె మహాబల హెగ్డే, కెరెమనె శంభు హెగ్డే, చిట్టాణి రామచంద్ర హెగ్డే, కొండదకుళి రామచంద్ర హెగ్డే, ఐరోడి రామ గాణిగ, మంటప ప్రభాకర ఉపాధ్యాయ, గోడె నారాయణ హెగ్డే, బళ్కూరు కృష్ణయాజీ, జలవళ్ళి, కణ్ణిమనె గణపతి హెగ్డే, భాస్కర జోషి, కుంబ్లే సుందరరావు, వాసుదేవ సామగ, బణ్ణద మహాలింగ, చంద్రగిరి అంబు, సుబ్రహ్మణ్య హెగ్డే చిట్టాణి, సిద్ధకట్టె చెన్నప్ప శెట్టి, కె. గోవింద భట్, కోళ్యూరు రామచంద్రరావు.
  • తాళ మద్దెల: శేణి గోపాలకృష్ణ భట్, మల్పె లక్ష్మీనారాయణ సామగ, డా.ప్రభాకర జోషి, కీరిక్కాడు మాస్టర్ విష్ణు భట్, దేరాజె సీతారామయ్య, డా. రమానంద బనారి, యు. బి. గోవింద భట్, జబ్బర్ సమో సంపాజె, ఎం.ఆర్.అమాచి
పేజీకి సంభందించిన లింకులు