యానాం
| ?యానాం పాండిచ్చేరి • భారతదేశం |
|
| Nickname: ప్రెంచి యానాం | |
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 30 కి.మీ² (12 చ.మై) |
| జిల్లా(లు) | Yanam జిల్లా |
| జనాభా • జనసాంద్రత |
32,362 (2001) • 1,079/కి.మీ² (2,795/చ.మై) |
| భాష(లు) | తెలుగు (de-facto) French (de-jure) |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను |
• 533 464 • +91 (0)884 |
యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని ఒక జిల్లా మరియు ఆ జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో 30 చ.కి.మీల విస్తీర్ణములో ఉంటుంది. ఇక్కడ నివసించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు, లేదా ప్రెంచ్ మాట్లాడతారు.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికము మరియు వాతావరణము
రేఖాంశము: 16°42'ఉత్తరం - 16°46'ఉత్తరం.
అక్షాంశము: 82°11'తూర్పు - 82°19'తూర్పు.
యానాంలో ఉష్ణోగ్రత వేసవిలో 27°సెం. నుండి 45°సెం. వరకు మరియు చలికాలములో 17°సెం. నుండి 28°సెం. వరకు ఉంటుంది. ఎండా కాలంలో ఇక్కడ వాతావరణంలోని తేమ శాతం 68% నుండి 80% వరకు ఉంటుంది. ఈ జిల్లా గోదావరి నది డెల్టాలో ఉంది, ఈ పట్టణము గోదావరి నది కోరింగ నదితో కలిసే చోట ఉంటుంది, బంగాళా ఖాతతీరము నుండి 9 కిలోమీటర్లు దూరములో ఉన్నది.
[మార్చు] విశేషాలు
- యానాం పట్టణమే కాకుండ, అగ్రహారము, దరియలతిప్ప, ఫారంపేట, గ్వెరెంపేట, జాంబవన్‌పేట, కనకాలపేట, కురసంపేట మరియు మెత్తకూరు మొదలైన గ్రామాలు ఈ జిల్లా యొక్క అధికార పరిధిలో ఉన్నాయి.
- 45 కోట్ల రూపాయల ఖర్చుతో యానాంలో ఈఫిల్ టవర్ కట్టబోతున్నారు.http://epaper.sakshi.com/Details.aspx?id=355564&boxid=28742358
[మార్చు] ప్రజా ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని గ్రేటర్ కాకినాడలో కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి.కాకినాడ-పుదుచ్చేరిల మధ్య జల మార్గానికి జాతీయ హోదా కల్పించే బిల్లుకు లోక్‌సభ,రాజ్య సభ ఆమోదం లభించింది. దాదాపు 970కిమీల పొడవు కలిగిన ఈ జలమార్గంలో 888 కిమీలు మన రాష్ట్ర పరిధిలో ఉంది.కొన్ని చోట్ల బకింగ్ హామ్ కాలువకు, బంగాళా ఖాతానికి మధ్య వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది.ఈ జాతీయ జలమార్గం ఏర్పాటు ద్వారా కాకినాడ కాలువ, ఏలూరు కాలువ, కొమ్మమూరు కాలువ, బకింగ్ హామ్ కాలువ, దీని పరిధిలోకి వస్తాయి.మూడు రోజులపాటు 50 లక్షల వ్యయంతో నిర్వహించే ఎనిమిదో యానాం ప్రజా ఉత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య 6.1.2010 న ప్రారంభించారు.యానాం ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చిన జలదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని రూ.40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు.భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కోటి రూపాయల వ్యయంతో తయారు చేసి న 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్ చేశారు.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.
[మార్చు] చరిత్ర
1723లో భారతదేశంలో యానాం మూడవ కాలనీగా ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. అయితే ఆర్ధికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించక పోవటం వలన ఈ కాలనీని ఫ్రెంచివారు 1727లో వదిలేసారు. తరువాత 1742లో దీనిని మరలా ఆక్రమించి మొగలు సామ్రాజ్యాధిపతులు వద్దనుండి ఒక ఫర్మానా ద్వారా అదికారాన్ని పొందారు. అయితే వారి అంగీకారమును వారు ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశమును మొదట విజయనగర రాజు, బొబ్బిలి యుద్ధంలో తనకు సహాయ పడినందుకుగాను, ఫ్రెంచి జెనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇక్కడ బుస్సీ పేరుతో ఒక వీధి కూడా ఉండి. అంతే కాదు అదే వీధిలో ఉండే ఒక భవంతిలో బుస్సీ నివశించేవాడనికూడా అంటారు. యానాంకు పడమరలో నీలిపల్లి అనే గ్రామంలో ఆంగ్లేయుల పాలనలో ఉండేది. ఆందుకని యానాము 18వ శతాబ్దంలో అడపాదడపా ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాము, ముసాఫర్ జంగ్, ఫ్రెంచివారి వాదనలను అంగీకరిస్తూ ఈ ప్రదేశమును వారికి అప్పగించాడు.
ఆంగ్లేయులనుండి భారత దేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చినా యానాం జూన్ 13 1954 వరకు ఫ్రెంచు వారి ఆధీనంలోనే ఉండి పోయింది. యానాంలో 1954 లో జరిగిన "భారత సైనిక దాడి" యానాం గతినే మార్చివేసినది. నవంబరు 1 1954 న ఫ్రెంచి స్థావరాలను భారతదేశమునకు వాస్తవికాంతరణ (దె-ఫాక్తో త్ర్రాన్స్ఫర్) చేయబడినది. కాని విధితాంతరణ (దె-జూర్ త్రాన్స్ఫర్) మాత్రము ఆగష్టు 16 1962 లొ జరిగినది. ప్రతీ సంవత్సరము, ఈ దినమును విధితాంతరణ దినముగా (దె-జూర్ త్రాన్స్ఫర్ డే) వేడుకలు జరుపుకుంటారు.
- ప్రధాన వ్యాసం: యానాం విమోచనోద్యమం
[మార్చు] పుణ్య క్షేత్రాలు
[మార్చు] వేంకటేశ్వర స్వామి దేవాలయం
విష్ణావాలయం వీధి (ర్యూ విషెను) లొ ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ దేవాలయం లో ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలు ఉన్నాయి. అందువలన ఇక్కడ వేంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ గుడిని 15 వశతాబ్ధం లొ రాజమండ్రి ని రాజధాని గా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్యులరాజులు సమయంలొ కట్టించారు. ఈ దేవాలయం భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మునుపు బాల్యవివాహాలు నిషేధించడానికి పూర్వం , బాల్యవివాహాలకు వేదిక గా ఉండేది. బ్రిటిషు వారి పరిపాలనలొ రాజా రామ్మోహన రాయ్ వంటి సంఘసంస్కర్తల వలన శారదా చట్టం అమలులోకి వచ్చాక బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి.
యానాం ప్రెంచ్ వారి పరిపాలన జరుపుతున్న సమయంలో ఈ దేవాలయం బాల్య వివాహాలకు ఎంత ప్రసిద్ధి చెందినదంటే ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. ఇక్కడి కి మద్రాసు రాష్ట్రం, హైదరాబాదు నుండి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. వందలకొద్ది వివాహాలు జరగడం వల్ల ఈ ఊరిని కళ్యాణపురం అని పిలిచేవారు.
[మార్చు] మసీదు
1848 సంవత్సరం లొ ఈ మసీదు (మస్జిద్) నిర్మాణానికి ప్రెంచ్ ప్రభుత్వం స్థలాన్నివిరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదు గా నిర్మితమైనది. తరువాత కాలంలో 1956 సంవత్సరం లో మసీదుకి పునరుద్దరణ పనులు జరిగాయి. 1978 సంవత్సరం లొ మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు. 1999-2000 సంవత్సరానికి ఈ మసీదు చాలా ఉన్నత మసీదు గా తీర్చి దిద్దారు. ఒకే సమయంలొ 200 మంది భక్తులు ఈ మసీదులొ ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉన్నది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు చాలా జరుపబడతాయి. తల్లరేవు, కొలంక, శుంకంరపాలెం నుండి కూడా భక్తులు వచ్చి ప్రార్థన జరుపుకొంటారు.
[మార్చు] కాథలిక్ చర్చి
ఈ ప్రెంచి కతోలిక చర్చి ప్రెంచి పరిపాలనను గుర్తు చేస్తు గుర్తింపుగా ఉంటుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండం వారి శైలిలో నిర్మితమైనది. ఈ చర్చి నిర్మాణానికి కావలసిన సరంజామ, లోపలి సామాన్లు, అలంకరణ వస్తువులు ఫ్రాఁస్ నుండి దిగుమతి చేసుకొనబడినవి. 1846 సంవత్సరం లో ప్రెంచి మతసంస్థల ద్వారా ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఈ చర్చికి నిర్మాణం రాయి పాద్రే మిచెల్ లెక్‌నెమ్ ద్వారా వెయ్యబడింది, ఆయన 1930 సంవత్సరం ఏప్రియల్ 30 వ తేదిన చర్చి నిర్మాణం పూర్తి కాకుండానే మరణించాడు. 1846 సంవత్సరానికి చర్చి నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ చర్చి ఆకర్షణ ఏమి అనగా ఈ చర్చికి దగ్గరలొ మరో చిన్న కొండ పై గుడి ఉన్నది, దీని ప్రెంచి పరిపాలకులు నిర్మించారు.
ఈ కొండ పై నున్న గుడి ప్రక్కన మరో కొండ పై చర్చిని ఆంగ్లేయ ఇంజినీర్లు నిర్మించారు. 1943 సంవత్సరం లొ విలియమ్ అగస్తస్ అనే ఓడ తుపాను వల్ల ఒక ఇసుక ద్వీపం లొకి చిక్కుకొని పోయింది. ఎంత ప్రయత్నం జరిపిన వెయ్యు టన్నులు ఉన్న ఈ ఓడ ని ఒడ్డుకి చేర్చలేక పోయారు. ఈ ఓడ అదే ప్రదేశాం లొ ఒక సంవత్సరం పాటు ఉన్నది. అప్పుడుఅమెరికా నుండి ఇక్కడకి ఎంపికైన స్వైని అనే ఇంజనీరు మేరీమాత ని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఆ ఓడ ఒడ్డుకి చేర్చబడింది కావున మేరిమాత గుర్తింపు గా ఈ చర్చి ని కొండ మీద కట్టించారు. ఈ చరిత్ర అంతా కొండ మీద ఉన్న చర్చి గోడల మీద వ్రాయబడి ఉన్నది. [1]
[మార్చు] యానాం ప్రముఖులు
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మూలాలు
- ↑ www.yanam.nic.in