యుకే పోస్ట్ కోడులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

యునైటెడ్ కింగ్డం లో వాడే తపాలా సంక్షిప్త గుర్తులు పోస్ట్ కోడులని అని పిలవబడుతాయి.[1] వీటిలో అక్షరాంకిక మూర్తులు ఉంటాయి. అక్టోబర్ 1959 నుండి 1974వ సంవత్సరము మధ్య 15 సంవత్సరాల కాలములో రాయల్ మెయిల్ దీనిని ప్రవేశ పెట్టింది.[2] పూర్తి పోస్ట్ కోడును ఒక "పోస్ట్ కోడు యూనిట్" గా పిలుస్తారు. ఇది సాధారణంగా పరిమిత చిరునామాల సంఖ్యను గాని ఒక పెద్ద బట్వాడా కేంద్రాన్ని గాని సూచిస్తుంది.[1] పోస్ట్ కోడు యూనిట్ లో ఐదు నుండి ఏడు మూర్తులు ఉంటాయి. ఇవి రెండు భాగాలుగా విభజించబడి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. మొత్తము సుమారు 1.8 మిలియను పోస్ట్ కోడు యూనిట్లు ఉన్నాయి.[1] పోస్ట్ కోడు యూనిట్ లోని మొదటి భాగము "పోస్ట్ కోడు జిల్లా" [1]అని గాని బాహ్యకోడు అని గాని పిలవబడుతుంది. ఇది సాధారణంగా ఒక పోస్ట్ పట్టణమును గాని దానిలో ఒక భాగమును గాని సూచిస్తుంది. ఒకే విధమైన ఒకటి లేదా రెండు మూర్తులు పూర్వప్రత్యయంగా ఉన్న పోస్ట్ కోడు జిల్లాలను 124 పోస్ట్ కోడు ప్రాంతాలుగా గ్రూప్ చేయబడ్డాయి.[1] పోస్ట్ కోడులను తపాలాలను ఆటోమెటిక్కుగా సార్టింగ్ చేయడానికే కాక అనేక వివిధ అవసరాల కోసం కూడా వాడబడుతున్నాయి; మరియు భీమా ప్రీమియంలు లెక్కించటానికి, మార్గాలను ప్లాన్ చేసే సాఫ్ట్ వేర్ లలో ప్రదేశాలను గుర్తించడానికి మరియు జనగణన లెక్కింపులో క్రింద స్థాయి సమాహారం చేయడానికి కూడా వాడబడుతుంది. పోస్ట్ కోడు వివరాలు మరియు సుమారు 27.5 మిలియను బట్వాడా కేంద్రాల యొక్క పూర్తి చిరునామా వివరాల, పోస్ట్ కోడు అడ్రెస్ ఫైల్ అనే డేటాబేస్ లో భద్రపరచబడి, క్రమముగా అప్డేట్ చేయబడుతాయి.[1] అంతకు ముందు లండన్ మరియు ఇతర పేద నగరాలలో ఒక తపాలా జిల్లాల విధానం 1857 నుండి అమలులో ఉంది. 1917లో లండన్ లో ఈ విధానం సవరించబడి, సబ్డివిషన్లకు సంఖ్యలు ఇవ్వబడింది. సవరించబడిన ఈ విధానం ఇతర నగరాలకు కూడా విస్తరించబడింది. ఈ జిల్లాలు కూడా దేశీయ పోస్ట్ కోడు విధానములో తరువాత చేర్చబడ్డాయి.

అవలోకనం[మార్చు]

పోస్ట్ కోడులు అక్షరాంకిక మూర్తులు ఉంటాయి. ఐదు నుండి ఏడు మూర్తులు ఉంటాయి (బైటి మరియు లోపలి భాగాలుగా విభజించబడి, ఈ రెండు భాగాల మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది). ఉదాహరణకు: హౌస్ అఫ్ కామన్స్ యొక్క కోడు SW1A 0AA. 1959[3]-1974 మధ్య కాలములో రాయల్ మెయిల్ దీనిని ప్రవేశ పెట్టింది.[2][4] పోస్ట్ కోడులను తపాలాలను ముఖ్య ఉద్దేశమైన ఆటోమెటిక్కుగా సార్టింగ్ చేయడానికే కాక అనేక వివిధ అవసరాల కోసం కూడా వాడబడుతున్నాయి- పోస్ట్ కోడు లాటరీను చూడండి.


పోస్ట్ కోడు యొక్క 'వేలుపరి' భాగము, తపాల జిల్లా ను సూచిస్తుంది- ఉదాహరణకు రెడ్ హిల్ ప్రాంతానికి RH అని ఉంటుంది. తరువాత అంకె తపాలా పట్టణమును సూచిస్తుంది- అంటే స్థానిక ప్రాంతములో సేవలు అందిస్తున్న బట్వాడా కార్యాలయం అన్నమాట. RH1 అంటే రెడ్ హిల్ ప్రాంతమే, RH10 అంటే క్రాలే. పెద్ద పట్టణాలలో, ఒకటి కంటే ఎక్కువ అంకెలు కోడు యొక్క వెలుపల భాగములో ఉండవచ్చు - క్రాలే లో RH10 మరియు RH11 రెండూ ఉంటాయి. దీనికి భిన్నమైన పరిస్థితి కూడా చాలా అరుదుగా ఉండవచ్చు. అంటే ఒక తపాల జిల్లా, ఒకటికంటే ఎక్కువ తపాలా పట్టణాలలో ఉండవచ్చు. 'లోపలి' భాగము, పట్టణము / బట్వాడా కార్యాలయ ప్రాంతము లోని ప్రాంతాలని సూచిస్తుంది. దీంట్లో మొదటి భాగమైన ఒక అంకె, సెక్టార్ ను మరియు ఆఖరి రెండు అక్షరాలు ఆ ప్రాంతములోని ఒక ఆస్తిని లేదా ఆస్తుల గ్రూపు ను సూచిస్తుంది. అతి పెద్ద కార్యాలయ విషయములో, కోడు యొక్క 'లోపలి' భాగము, ఆ కార్యాలయములోని ఒక భాగాన్ని గాని ఒక సంస్థను గాని (ముఖ్యంగా ఆ సంస్థకు పెద్ద సంఖ్యలో టపాలు వస్తే) సూచిస్తుంది. కొన్ని సందర్భాలలో (ఉదాహరణనకు DVLA), 'లోపలి' కోడు ఒకే సంస్థ యొక్క వేరు వేరు భాగాలను సూచించవచ్చు.[5]


వ్యాపార తపాలాలలో ఐదు-అంకెల శ్రేణిని కూడా వాడవచ్చు. ఇది మెయిల్ సార్ట్ అని పిలవబడుతుంది - ఐతే, 'కనీసం 4,000 లెటర్-సైజు ' శాల్తీలు ఉంటేనే ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు.[6] ఇటువంటి పెద్ద సంఖ్యలో ఉత్తరాలు తపాలా చేసినప్పుడు, తపాలా యొక్క రకము మరియు ఎంత వరకు ముందుగానే సార్ట్ చేయబడి ఉన్నాయనే అంశాలను బట్టి రాయతీలు ఇవ్వబడుతాయి.

అభివృద్ధి[మార్చు]

1950ల ఆఖరిలో ఎలెక్ట్రోమెకానికల్ సార్టింగ్ యంత్రాల వాడకములో పోస్ట్ ఆఫీస్ ప్రయోగం చేసింది.[7] ఈ పరికరాలు ఒక కవరును కర్మచారికి అందిస్తుంది. అతను ఒక బిన్ లో ఆ కవరును సార్ట్ చేయాలని సూచించడానికి ఒక బటన్ ను నొక్కుతాడు. ఈ ప్రక్రియను మరింత మెరుగు పరచడానికి పోస్ట్ కొడులను ప్రవేశ పెట్టాలని సూచించబడింది. దీని మూలాన సార్ట్ చేసే కర్మచారి వివిధ ప్రాంతాలకు సరైన సార్టింగ్ ను గుర్తులో పెట్టుకోవలసిన అవసరం లేకుండా పోతుంది.[8] తపాలా కోడుల వాడకము గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఒక సర్వే జనవరి 1959లో పోస్ట్ ఆఫీస్ నిర్వహించి, ఆ ఫలితాలను విశ్లేషించింది. తరువాయి మెట్టు, కోడుతో ఉన్న చిరునామాలను ప్రయోగించడానికి ఒక పట్టణమును ఎన్నుకోవడం. అప్పట్లో ఆరు మూర్తులు ఉన్న ఒక అక్షరాంకిక కోడును వాడాలని నిర్ణయించారు. మొదటి మూడు మూర్తులు ప్రాంతాలను మరియు తరువాత మూడు అంకెలు వ్యక్తిగత చిరునామాను సూచించే విధముగా ఈ కోడు రూపొందించబడింది.[9] జూలై 28 నాడు, దీనికి నార్విచ్ పట్టణము ఎన్నుకోబడిందని అప్పటి పోస్ట్ మాస్టర్ జనెరల్ ఎర్నెస్ట్ మార్పెల్స్ ప్రకటించారు. ప్రతి యొక్క 150,000 ప్రైవేట్ మరియు వ్యాపార చిరునామాలకు అక్టోబర్ లోపల ఒక కోడు ఇవ్వబడుతుందని ఆయన ప్రకటించారు. అప్పటికి ఎనిమిది ఆటోమేటిక్ తపాలా సార్టింగ్ యంత్రాలు కలిగి ఉన్న కారణంగా నార్విచ్ ఎన్నుకోబడింది.[10] ఈ కోడులు ముందు NOR అనే అక్షరాలు చేర్చబడ్డాయి.


ఈ తపాలా కోడింగ్ విధానము "కొన్ని సంవత్సరాలలో" దేశ వ్యాప్తంగా విస్తరించబడుతుందని అక్టోబర్ 1965 న ధృవీకరించబడింది.[11] మే 1, 1967 నాడు క్రోయ్డోన్ కు పోస్ట్ కోడులు ప్రవేశపెట్టబడింది. కేంద్ర క్రోయ్డోన్ ప్రాంతానికి కోడు CRO తో మొదలయింది. పరిసర తపాలా పట్టణాలకు కోడులు CR2, CR3 మరియు CR4 తో మొదలయ్యాయి.

£24 మిలియనుల వ్యయముతో కూడిన ఈ పది సంవత్సరాల ప్రణాళిక ఈ విధముగా మొదలయింది. రెండు సంవత్సరాల లోపల ఈ క్రింద పట్టణాలలో కోడింగ్ అమలు చేయబడుతుందని అంచనా వేశారు. అవి అబెర్డీన్, బెల్ఫాస్ట్, బ్రైటన్, బ్రిస్టల్, బ్రోమ్లె, కార్డిఫ్, కోవెన్ట్రి, మాంచెస్టర్, న్యూకాసిల్ అపాన్ టైనే, న్యూపోర్ట్, రీడింగ్, షెఫీల్డ్, సౌతాంటన్ మరియు లండన్ యొక్క పశ్చిమ జిల్లా.[12]

1967 సంవత్సరము నాటికి అబెర్డన్, సౌతాంటన్, బ్రైటన్ మరియు డేర్బి లలో కోడులు ప్రవేశపెట్టబడ్డాయి.[13]

1970 సంవత్సరం నాటికి పశ్చిమ మరియు ఉత్తర-పశ్చిమ లండన్ ప్రాంతాలలో కోడులు ప్రవేశపెట్టబడ్డాయి.[14]


డిసెంబర్ 1970 క్రిస్మస్ తపాలాలలో "పోస్ట్ కోడును వాడాలని గుర్తు పెట్టుకోండి" అనే సమాచారం ముద్రించబడింది. ఐతే ఆ సమయానికి కొన్ని సార్టింగ్ కార్యాలయాలలో మాత్రమే కోడులు వాడకములో ఉండేవి.[15]


1971లో, చిరునామాలలో ఉన్నవారికి వారి పోస్ట్ కోడు వివరాలు అందడం మొదలయింది. హౌస్ అఫ్ కామన్స్ లో ఈ కోడింగ్ ప్రక్రియ గురించి అడిగినప్పుడు, ఈ ప్రక్రియ 1972 నాటికి పూర్తి చేయబడుతుందని అనుకుంటున్నట్లు అప్పటి పోస్ట్ మాస్టర్ జనెరల్ సర్ జాన్ ఈడెన్ తెలిపారు.[16] 1974లో ఈ పధకం పూర్తి చేయబడి నార్విచ్ యొక్క కోడు మార్చబడింది. ఐతే క్రాయ్డన్ లో ప్రయోగించిన పధకం తుది డిజైనుకు దగ్గరలో ఉంది. CRO అనే కోడు CR0 (జిల్లా జీరో) గా మార్చబడింది.[17] నార్విచ్ మరియు క్రాయ్డన్ ప్రాంతాలలో మాదిరిగా కేంద్ర న్యూ పోర్ట్ ప్రాంతానికి మొదట్లో NPT అనే కోడు ఇవ్వబడి, పరిసర ప్రాంతాలకు NP1–NP8 అని కోడులు ఇవ్వబడ్డాయి. ఈ పధ్ధతి 1984 ఆఖరి వరకు కొనసాగుతూ ఉంది. తరువాత ఆచరణ కారణాల వల్ల (NPT ప్రమాణానికి అనుగుణంగా లేకపోవడం, NP7 ను పోలి ఉండడం వంటి కారణాలు) ఈ ప్రాంత కోడు NP9 అని మార్చబడింది.[18] గిరోబ్యాంక్ యొక్క GIR 0AA అనే కోడు మాత్రమే ఈ నాటికీ పాటించబడుతున్న పూర్తీగా అక్షరాలతో కూడిన బాహ్య కోడ్.

== పూర్వపు తపాలా జిల్లాలు==

లండన్[మార్చు]

లండన్ తపాలా పట్టణం, గ్రేటర్ లండన్ యొక్క విస్తీరణములో 40% ను ఆక్రమిస్తుంది. ప్రవేశ పెట్టబడిన మొదట్లో, ఇది పది ప్రాంతాలుగా విభజించబడి, ఆయా ప్రాంతాలలు సూచించే విధముగా కోడులు ఉండేవి: EC, WC, N, NE, E, SE, S, SW, W మరియు NW. తరువాత S మరియు NE సెక్టారులు తొలగించబడ్డాయి. 1917లో యుద్ద కాలపు చర్యలో భాగంగా, పనితీరును పెంచడానికి జిల్లాలు మరింత విభజించబడి, విభజించబడిన ప్రతి ఉప జిల్లాకు ఒక అంకె కేటాయించబడింది. ప్రధాన కార్యాలయం నేరుగా సేవలు అందించే ప్రాంతాలను "1" అని గుర్తించి, ఇతర బట్వాడా కార్యాలయాలను ప్రాంతాలవారీగా అక్షర క్రముములో అంకెలు కేటాయించబడ్డాయి(ఉదా.ఈస్ట్ ఫించ్లె కు N2, ఫించ్లె కు N3, ఫిన్స్బురి పార్క్ కు N4 వంటివి).

=[మార్చు]

ఇతర పెద్ద పట్టణాలు===

బర్డ్బ్రూక్ రోడ్, గ్రేట్ బార్, బిర్మింఘం లోని వీడి గుర్తు. పాత "బిర్మింఘం 22" (పైన) మరియు ఆధునిక "B44" పోస్ట్ కోడులు.

లండన్ లో విజయవంతంగా తపాలా జిల్లాలను ప్రవేశ పెట్టిన తరువాత, ఈ వ్యవస్థ యునైటెడ్ కింగ్డం లోని ఇతర పెద్ద పట్టణాలకు విస్తరింపపబడింది. 1864/65లో తూర్పు, ఉత్తర, దక్షిణ మరియు పశ్చిమ జిల్లాలుగా లివర్పూల్ పట్టణం విభజించబడింది. 1867/68లో మాంచెస్టర్ మరియు సాల్ఫోర్డ్ పట్టణాలు ఎనిమిది జిల్లాలుగా విభజించబడి వాటికి అంకెలు కేటాయించబడ్డాయి.[17]


1917లో, డబ్లిన్ అంకెలతో కూడిన తపాలా జిల్లాలుగా విభజించబడింది. స్వతంత్ర రిపబ్లిక్ ఆఫ్ ఆయర్లాండ్ యొక్క తపాలా శాఖా ఇప్పటికి వీటిని కొంత సవరణ చేసి వాడుతూనే ఉంది. 1923లో, లండన్ లో ఉన్నమాదిరిగానే గ్లాస్గో కూడా విభజించబడింది. జిల్లాలకు అంకెలు కేటాయించబడి, దానికి ముందు, దిశను సూచించే అక్షరము ఉంచబడింది (C, W, NW, N, E, S, SW, SE).[17]


పలు పెద్ద నగరాలను అంకెలతో సూచించబడ్డ అనేక జిల్లాలుగా విభజించడాన్ని జనవరి 1932లో పోస్ట్ మాస్టర్ జెనెరల్ ఆమోదించారు.[17] "యునైటెడ్ కింగ్డం లోని ప్రతి పెద్ద నగరాలలో" జిల్లాలను ప్రవేశ పెట్టడాన్ని పోస్ట్ ఆఫీస్ నవంబర్ 1934లో ప్రకటించింది. ఎన్నుకోబడిన పది ప్రాంతాలలో ఉన్న ప్రతి ఇంటికి మరియు వ్యాపారాలకు, వారి స్థలము ఉన్న జిల్లా యొక్క అంకెను తెలియచేస్తూ కరపత్రాలు పంపిణి చేయబడ్డాయి. ఈ కరపత్రాలలో విభాగాల యొక్క మ్యాప్ కూడా ఇవ్వబడింది. వీటి ప్రతులు స్తానిక ప్రధాన తపాలా కార్యాలయాలలో అందుబాటులో ఉంచబడింది. అన్ని వ్యక్తిగత మరియు వ్యాపార ఉత్తరాల పైన జిల్లా అంకెను వ్రాయమని జనము "ప్రత్యేకంగా కోరబడ్డారు".[19] జిల్లా అంకెలను వాడకాన్ని ప్రోత్సాహించడానికి మరుసటి సంవత్సరం ఒక ప్రచార పర్వాన్ని నిర్వహించింది. "త్వరితంగా మరియు నిశ్చయంగా మీ ఉత్తరాలు చేరాలంటే, తపాలా జిల్లా అంకెను ఎల్లప్పుడూ వాడండి" అనే నినాదాన్ని ఈ ప్రచారానికి వాడారు. ఆ ప్రాంతాలలో ప్రతి పోస్ట్ బాక్సులకు ఒక పోస్టర్ అంటించబడింది. దాంట్లో ఆ జిల్లా యొక్క సంఖ్య వ్రాయబడి, ప్రజల సహకారం కోరబడింది. సంఖ్య ఇవ్వబడిన జిల్లాలలోని ప్రతి తపాలా కార్యాలయలములోను ఈ వివరాలు ప్రదర్శించబడ్డాయి. చిరునామాలలో జిల్లా సంఖ్యను తప్పక చేర్చమని క్రిస్మస్ కార్డులు మరియు స్టేషనరీలను ముద్రించేవారు కోరబడ్డారు. రాబోయే సాధారణ ఎన్నికలో అభ్యర్ధులు పోస్ట్ చేయబోయే 100 మిలియను తపాలాలలో తప్పక జిల్లా సంఖ్యను కలపని ఎన్నికల ఏజెంట్లు కోరబడ్డారు. అంటే కాక ఆ పది ప్రాంతాలలో ఉన్న ప్రతి వీధికి సంబంధించిన సరైన జిల్లా సంఖ్యను తెలియచేస్తూ ఒక తాజా బుక్లెట్ వ్యాపారస్తులకు అందచేయబడింది.[20]


ఆ పది ప్రాంతాలు ఇవే:[20]


ప్రతి ప్రాంతము కూడా సంఖ్యతో కూడియా తపాలా జిల్లాలుగా విభజించబడ్డాయి. ఉదా. లివర్పూల్ లోని టాక్స్టేత్, లివేర్పూల్ 8 అని సూచించబడింది. ఒక సంఖ్య వరుసయే మాంచెస్టర్ మరియు సల్ఫోర్డ్ కు వాడబడింది. ఉత్తరాలలో మాంచెస్టర్ 1 లేదా సాల్ఫోర్డ్ 4 అని సూచించాలి. కొన్ని బర్మింగ్హాం కోడులు మరింత విభజించబడి, ఒక అక్షరముతో సూచించబడ్డాయి. గ్రేట్ బార్, బర్మింగ్హాం 22 లేదా బర్మింగ్హాం 22a [21] - పాత వీధి-పేరు తెలిపే గుర్తులలో ఇప్పటికి వీటిని చూడవచ్చు.

=[మార్చు]

దేశీయ విధానముగా రూపుదిద్దడం===

దేశీయ పోస్ట్ కోడు విధానమును ప్రవేశ పెట్టినప్పుడు, అప్పటికి అమలులో ఉన్న తపాలా జిల్లాలు క్రొత్త దేశీయ విధానములో చేర్చబడ్డాయి. టాక్స్ టేత్ (లివర్పూల్ 8), L8 అని మొదలయ్యాయి. మాంచెస్టర్ మరియు సల్ఫోర్డ్ లోని జిల్లాలకు "M" అనే పోస్ట్ కోడులు ఇవ్వబడ్డాయి. "సాల్ఫోర్డ్ 4", M4 గా మారింది. కొన్ని వీధి గుర్తులలో ఇప్పటికి అడుగున "సాల్ఫోర్డ్ 4" వంటి అక్షరాలు చూడవచ్చు. గ్లాస్గో లో పోస్ట్ కోడులు 'G' తో మొదలయ్యాయి: C1, G1 గాను, W1, G11 గాను, N1, G21 గాను, E1, G31 గాను, S1, G41 గాను, SW1, G51 గాను మారాయి. లండన్ లో 1917 తపాలా జిల్లాలు నేరుగా క్రొత్త పోస్ట్ కోడు జిల్లాలుగా మార్చబడ్డాయి. గ్రేటర్ లండన్ లోని ఇతర 60% ప్రాంతాలకు దేశీయ విధానము క్రింద పోస్ట్ కోడులు ఇవ్వబడ్డాయి.


లండన్ లోని హాక్నీ ప్రాంతములో కొన్ని పాత వీధి గుర్తులలో ఇప్పటికి ఈశాన్య (NE) పోస్ట్ కోడు కనిపిస్తూ ఉంది!

== ఆచరణ మరియు అమలు==

ఆకృతి[మార్చు]

యునైటెడ్ కింగ్డం యొక్క పోస్ట్ కోడు ప్రాంతాలు

U.K. పోస్ట్ కోడుల ఆకృతి ఈ క్రింద విధముగా ఉంటుంది (GIR 0AA మినహా): ఇక్కడ A ఒక అక్షరాన్ని మరియు 9 ఒక అంకెను సూచిస్తుంది.

ఆకృతి ఉదాహరణ ప్రాంతాలు
A9 9AA M1 1AA B, E, G, L, M, N, S, W పోస్ట్ కోడు ప్రాంతాలు
A99 9AA M60 1NW
AA9 9AA CR2 6XH B, E, G, L, M, N, S, W, WC మినగా ఇతర పోస్ట్ కోడు ప్రాంతాలు
AA99 9AA DN55 1PT
A9A 9AA W1A 1HQ E1W, N1C, N1P, W1

పోస్ట్ కోడు జిల్లాలు (దట్టమైన ప్రాంతాలలో ఎక్కడయితే కోడులు అయిపోయాయో)

AA9A 9AA EC1A 1BB WC పోస్ట్ కోడు ప్రాంతము; EC1–EC4, NW1W, SE1P, SW1 పోస్ట్ కోడు జిల్లాలు

(ఎక్కువ దట్టమైన ప్రాంతాలలో కోడ్లు అయిపోవటం)


ఇది ఎడము నుండి కుడి వైపు క్రమముగా పెరుగుతూ ఉన్న ఒక స్థాయిపరంగా విధానము:

కలి స్పేస్ కు ముందు ఉన్న రెండు నుండి నాలుగు మూర్తులు బాహ్య కోడు లేదా బయట కోడు అని పిలవబడుతుంది. ఈ కోడు సార్టింగ్ కార్యాలయము నుండి బట్వాడా కార్యాలయముకు తపాలును పంపించడానికి వాడబడుతుంది:

మొదటి అక్షరం లేదా మొదటి రెండు అక్షరాలు పోస్ట్ కోడు ప్రాంతమును సూచిస్తాయి.

0 నుండి 99 వరకు ఉన్న తదుపరి సంఖ్య ఆ ప్రాంతములోని పోస్ట్ కోడు జిల్లాను సూచిస్తుంది.

ఒక అంకె మాత్రమే ఉన్న జిల్లాలు కలిగిన ప్రాంతాలు: BR, FY, GY, HA, HD, HG, HR, HS, HX, JE, LD, SM, SR, WC, WN, ZE.

రెండు అంకెలు మాత్రమే ఉన్న జిల్లాలు కలిగిన ప్రాంతాలు: AB, LL, SO.

కొన్ని ప్రాంతాలలో మాత్రమే 0 (జీరో)జిల్లా ఉంది:BL, CM, CR, FY, HA, PR, SL, SS; ఈ ప్రాంతాలలో జిల్లా 10 అనే సంఖ్య లేవు. ఐతే జిల్లా 0 ను ఆ ప్రాంతాలలో పదో జిల్లాగా భావించబడి జిల్లా 9 తరువాత సార్ట్ చేయబడుతుంది.

కేంద్ర లండన్ ప్రాంతములో, ఎక్కువ జనసముదాయం కలిగిన ఒక-అంకె పోస్ట్ కోడులు ఉన్న జిల్లాలు మరింత విభజించబడి, అంకె తరువాత, స్పేస్ కు ముందు ఒక అక్షరాన్ని వాడబడుతుంది. ఈ పధ్ధతి EC1–EC4 (EC50 తప్ప) జిల్లాలు అన్నిటికి మరియు SW1, W1, WC1, WC2 జిల్లాలకు వర్తిస్తుంది; మరియు E1 లో ఒక భాగం (E1W), N1 (N1C and N1P), NW1 (NW1W) మరియు SE1 (SE1P) జిల్లాలకు వర్తిస్తుంది. ABCDEFGHJKMNPRSTUVWXY లో ILOQZ ఐదు అక్షారాలు తప్ప ఇతర అన్ని అక్షారాలు ప్రస్తుతం ఆఖరి అక్షరముగా ఒకటి లేదా ఎక్కువ విభజించబడిన జిల్లాలో వాడబడుతున్నాయి.

"పోస్ట్ కోడు జిల్లా" అనే పదం సాధారణ వాడకములో బహు అర్తాలు కలిగే విధముగా వాడబడుతుంది. ఈ పధం ఒక (పూర్వ) జిల్లాలోని అన్ని అక్షరక్రము కలిగిన మరియు అక్షరము లేని భాగాలను గాని అటువంటి భాగాలలో ఒక భాగాన్ని గాని సూచించవచ్చు. ఉదాహరణకు N1 అంటే, సందర్భముగా బట్టి NI1 మరియు N1P లను కలిపి సూచించవచ్చు. N1C ఒక జిల్లాను గాని N1 జిల్లాలో ఒక భాగాన్ని గాని సూచించవచ్చు.

బయట కోడు అనంతరం ఒక స్పేస్ ఉంటుంది.

స్పేస్ తరువాత ఉన్న మూడు మూర్తులు లోపలి కోడు లేదా లోన కోడు గా పిలవబడుతుంది. ఇది తుది బట్వాడా కార్యాలయములో తపాలాను సర్ట్ చేయడానికి వాడబడుతుంది:

స్పేస్ తరువాత మొదటి మూర్తి 0 నుండి 9 లోపల ఉన్న ఒక అంకె. ఇది పోస్ట్ కోడు సెక్టార్ ను సూచిస్తుంది. మొదట్లో రాయల్ మెయిల్ 9 తరువాతనే 0 ను సార్ట్ చేసేవారు. అందువల్ల ఇది మొదటి సెక్టారుగా కాకుండా పదో సేక్తారుగా భావించబడింది.

చివరి రెండు అక్షరాలూ పోస్ట్ కోడు యూనిట్ అని అనబడుతుంది. లోపలి కోడు లోని అక్షరాలు CIKMOV ఆరు అక్షరాలు తప్ప ABDEFGHJLNPQRSTUWXYZ లో మిగిలిన అన్ని అక్షరాలు వాడబడుతాయి.


ప్రతి పోస్ట్ కోడు యూనిట్ సాధారణంగా ఒక వీధి లేదా వీధిలోని ఒక భాగము లేదా ఒక చిరునామా ను సూచిస్తుంది. పోస్ట్ కోడుల ఈ అంశం రూట్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ కు ఉపయోగంగా ఉంటుంది.

భాగం

భాగం ఉదాహరణ లైవ్ కోడులు[22] నిర్మూలించబడిన కోడులు[23] ఇతర కోడులు
(GIR 0AA , SAN TA1 , BX )[24]
మొత్తం
పోస్ట్ కోడు area బయట కోడు YO 124 0 3 127
పోస్ట్ కోడు జిల్లా బయట కోడు YO31 2,971 103 4 3,078
పోస్ట్ కోడు సెక్టార్ లోపలి కోడు YO31 1 10,631 1,071 4 11,706
పోస్ట్ కోడు యూనిట్ లోపలి కోడు YO31 1EB 1,762,464[23] 650,417 4 2,412,885
పోస్ట్ కోడు చిరునామాలు సుమారు 27,000,000 [25]


బయట కోడులో ఉన్న అక్షరాలు అది ఉన్న చోటును సుమారుగా సూచిస్తుంది. ఉదాహరణకు, L అనగా లివర్పూల్, EH అనగా ఎడిన్బర్గ్ మరియు AB అనగా అబెర్డీన్; పూర్తి జాబితాకు యునైటెడ్ కింగ్డం లోని పోస్ట్ కోడు ప్రాంతాల జాబితా ను చూడండి . లండన్ కు బయట ఉన్న పలు పోస్ట్ కోడు ప్రాంతాలు, నగరానికి బయట ఉన్న అనేక నగరాలను ప్రాంతాలను సూచిస్తాయి. ఉదాహరణకు, BT అనే కోడు బెల్ఫాస్ట్ ను సూచించినా, అది పూర్తి ఉత్తర ఐర్లాండ్ కు వర్తిస్తుంది.

=[మార్చు]

భౌగోళికేతర కోడులు ===

అనేక పోస్ట్ కోడులు భౌగోళిక ప్రాంతమును నేరుగా సూచిస్తూ ఉంటాయి. ఐతే కొన్ని మాత్రము రూటింగ్ కొరకు మాత్రమే వాడబడుతాయి. వీటిని నేవిగేషన్ కు గాని దూరాన్ని కనుక్కునే ప్రయోగాలకు గాని వాడలేము.[26] భౌగోళికేతర పోస్ట్ కొడులను ఎక్కువగా డైరెక్ట్ మార్కెటింగ్ మరియు PO బాక్స్ లకు వాడుతారు. కొన్ని పోస్ట్ కోడు సెక్టార్లు లేదా జిల్లాలు భౌగోళేతర పోస్ట్ కొడుల కోరకు కేటాయించబడ్డాయి. అవి: BS98, BS99, BT58, E98, NE98, NE99 మరియు WC99.


బూటిల్ లో ఉన్న గిరోబాంక్ యొక్క ప్రధాన కార్యాలయం, GIR 0AA అనే భౌగోళేతర పోస్ట్ కొడులను వాడుతుంది. దీని ఆకృతి ప్రత్యేకంగా ఉంటుంది. BX అనే మరొక భౌగోళికేతర పోస్ట్ కోడు ప్రాంతం, కేవలం భౌళికేతర చిరునామాల కొరకు ఉన్నది. BX తో మొదలయ్యే పోస్ట్ కోడులు ప్రమాణం ప్రకారమే ఉంటాయి. ఐతే గ్రహీత యొక్క చిరునామాకు ప్రమేయం లేకుండా ఉంటుంది. గ్రహీత చిరునామా మారినా, ఈ కోడు అలాగే అట్టి పెట్టుకోబడవచ్చు. లాయిడ్స్ TSB[24] మరియు HM రెవిన్యూ అండ్ కస్టమ్స్ ఈ కోడుని వాడే కొన్ని ప్రసిద్ద సంస్థలు.[27] ఫాదర్ క్రిస్మస్ కు వచ్చే ఉత్తరాలకు SAN TA1 అనే ఒక విశేష పోస్ట్ కోడు ఉంది.[28]


రాయల్ మెయిల్ లోపల, తప్పుడు చిరునామా ఉన్న తపాలా మరియు అంతర్జాతీయ ఉత్తరాలకు, XY తో మొదలయ్యే బయట కోడులు రూటింగ్ కొడులుగా వాడబడుతాయి.[citation needed]

ప్రత్యేక పోస్ట్ కోడులు[మార్చు]

పోస్ట్ కోడ్ లు సామాన్యంగా వ్యావహారిక ఉపయోగానికి మాత్రమే వాడుతున్నా కొన్ని సందర్భాలలో వాటిని సాంప్రదాయానికి భిన్నంగా ఉపయోగిస్తారు.

బ్రిటన్ యొక్క రాజ్యాంగపరమైన స్థాయి విధానము అనధికారికంగా ఈ క్రింద ఉన్న మూడు పోస్ట్ కోడ్ లను ఆజ్ఞాపించటములో అగుపిస్తుంది:

పోస్ట్ కోడు ప్రదేశం
SW1A 0 AA హౌస్ ఆఫ్ కామన్స్ (హుందాతనము ముందుగల ప్రజాస్వామ్య ప్రాంగణము; హౌస్ ఆఫ్ లార్డ్స్ కు తయారు చేసిన దిగువ పట్టికను చూడండి)
SW1A 1 AA బకింగ్ హామ్ (రాష్ట్ర అధినేత యొక్క అధికారిక నివాసం)
SW1A 2 AA 10 డౌనింగ్ వీధి (ప్రభుత్వము యొక్క అధినేత కు చెందిన అధికారిక నివాసము )


ప్రత్యేక పోస్ట్ కోడు కేటాయించే స్థాయిలో ఉత్తరాలు వచ్చే కొన్ని సంస్థల కోడులో సంస్థలు పేరులు కోడు యొక్క అంతిమ భాగములో సూచించబడుతుంది. కొన్ని ప్రసిద్ధ ఉదాహరణలు:


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found