యూరీ గగారిన్

వికీపీడియా నుండి

యూరీ గగారిన్
Юрий Гагарин
ఫైలు:Yuri Gagarin official portrait.jpg
వ్యోమగామి (Cosmonaut)
జాతీయత రష్యన్
Status మరణించాడు
జననం మార్చి 9 1934(1934-03-09)
క్లుషినో, Russian SFSR, సోవియట్ యూనియన్
మరణం 27 మార్చి 1968 (వయసు: 34)
కిర్‌జాచ్, Russian SFSR, సోవియట్ యూనియన్
ఇతర వృత్తులు చోదకుడు (పైలట్)
ర్యాంక్ Colonel (పోల్కోవ్‌నిక్), సోవియట్ వాయుసేన
Space time 1 గంట, 48 నిముషాలు
Selection వాయుసేన గ్రూప్ 1
Missions వోస్టాక్ 1
Mission
insignia
Vostok1patch.png

యూరీ అలెక్సెయెవిచ్ గగారిన్ లేదా యూరీ గగారిన్ (ఆంగ్లం : Yuri Alexeyevich Gagarin) (రష్యన్ భాష Ю́рий Алексе́евич Гага́рин ), జననం మార్చి 9 1934 - మరణం మార్చి 27 1968. ఇతడు సోవియట్ వ్యోమగామి, రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12 న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు, అలాగే మొదటి సోవియట్ కూడానూ. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించినవాడుగానూ రికార్డులకెక్కాడు. అంతరిక్షంలోకి ప్రయాణించినందుకు, ప్రపంచంలోని అనేక దేశాలు, పతకాలు, బహుమానాలు ఇచ్చి, ఇతడిని గౌరవించాయి.

విషయ సూచిక

[మార్చు] అంతరిక్ష యాత్ర

ఏప్రిల్ 12 1961 న, గగారిన్, అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా నమోదయ్యాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక వోస్టోక్ 3KA-2 (వోస్టోక్ 1). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్' (సెడార్; (రష్యన్ : Кедр).[1] తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం "ద మదర్ ల్యాండ్ హీయర్స్, ద మదర్ ల్యాండ్ నోస్" అంతరిక్షంలో పాడాడు. (రష్యన్ భాష "Родина слышит, Родина знает").[2][3]

ఆ కాలంలో మీడియాలో గగారిన్ వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. "నేను యే దేవుడినీ ఇక్కడ చూడడం లేదు" అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని లేవు.[4]

[మార్చు] మరణం

గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి స్టార్ సిటీ లో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను ఫైటర్ పైలట్ గా తిరిగీ అర్హతపొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968, చకలోవ్‌స్కీ ఎయిర్ బేస్ నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా, ఇతను మరియు ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ మిగ్ -15UTI విమానం కిర్జాచ్ పట్టణం వద్ద కూలిపోయి మరణించారు. వీరిరువురినీ రెడ్ స్క్వేర్ లోని క్రెమ్లిన్ గోడలు లో ఖననం చేసారు.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] మూలాలు

  1. Gagarin. Astronautix.com (2007-11-17). తీసుకొన్న తేదీ: 2008-03-30.
  2. Гагарин, Юрий (2004-12-03). Дорога в космос. Pravda via TestPilot.ru. తీసుకొన్న తేదీ: 2008-03-30.
  3. Motherland Hears (download). SovMusic.ru. తీసుకొన్న తేదీ: 2008-03-30.
  4. మూస:Ru icon Полная стенограмма переговоров Юрия Гагарина с Землей с момента его посадки в корабль (за два часа до старта) до выхода корабля "Востока-1" из зоны радиоприема. Cosmoworld.ru. తీసుకొన్న తేదీ: 2008-03-30.

[మార్చు] బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది

పేజీకి సంభందించిన లింకులు