యోగి (2007 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యోగి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.వినాయక్
నిర్మాణం పి.సుదర్శన్ రెడ్డి,
పి.చంద్రప్రతాపరెడ్డి
రచన రాజేంద్ర కుమార్
కథ ప్రేమ్
తారాగణం ప్రభాస్,
నయనతార,
శారద,
రాజన్.పి.దేవ్,
చంద్రమోహన్,
చలపతిరావు,
ప్రదీప్ రావత్,
ఎమ్మెస్ నారాయణ,
ఆలీ,
వేణుమాధవ్,
సునీల్,
మెల్కోటె,
సుబ్బరాజు,
ముమైత్ ఖాన్
సంగీతం రమణ గోగుల
నృత్యాలు స్టన్ శివ
గీతరచన సుద్దాల అశోక్ తేజ,
చంద్రబోస్
ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి
కళ చిన్నా
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ ఈశ్వరీ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్
భాష తెలుగు
పెట్టుబడి 8 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథాగమనం[మార్చు]

కర్నూలు దగ్గర బేతంచర్ల అనే ఊర్లో నివసించే శాంతమ్మ,రామ్మూర్తి (శారద, చలపతిరావు) లకు లేకలేక పుట్టిన ఏకైక సంతానం ఈశ్వరప్రసాద్ (ప్రభాస్). యుక్తవయస్సు వచ్చినా పనీపాటా లేకుండా తిరిగే ప్రసాదుకు తల్లి అంటే ప్రాణం. హైదరాబాద్ నుండి వచ్చిన తన స్నేహితుడు చెప్పిన మాటలతో తల్లికి చెప్పకుండా ఉద్యోగం కోసం హైదరాబాద్ బయలు దేరతాడు. అక్కడ అతని కళ్ళ ముందే సైదులు (సుబ్బరాజు) అనే గూండా కోటేసు (కోటశ్రీనివాసరావు) అనే గూండాను, పోలియోతో కాళ్ళు పోయిన అతని అనుచరుడిని నరికి వెళ్ళిపోతే వాళ్ళఇద్దరినీ హాస్పిటల్లో చేరుస్తాడు. ఆరు నెలల తరువాత తన తల్లికి బంగారు గాజులుకొని ఊరికి బయలుదేరబోతే తను పనిచేసే హొటల్ ఓనర్ (చంద్రమోహన్) కొంతమంది కస్టమర్లకు టీ ఇచ్చి వెళ్ళమంటాడు. అక్కడ్ సైదులు ఇతడిని గుర్తుపట్టి అతని తల్లిని తిట్టి గాజులను క్రిందపడేసి తొక్కేస్తాడు. అది చూసి ప్రసాద్ అతడిని చంపేస్తాడు. పోలీసులు ప్రసాదును అరెస్ట్ చేస్తే చంద్రమోహన్ అతడిని విడిపించి తన కొడుకు పేరు అయిన యోగిని ప్రసాదుకు తగిలిస్తాడు.

ఆతరువాత యోగి పెద్ద గూండాలకు సింహస్వప్నంగా మారుతాడు. కొడుకును వెతుకుతూ అతని తల్లి శాంతమ్మ హైదరాబాద్ వస్తుంది. అమెకు జర్నలిష్టుగా పనిచేస్తున్న నందిని (నయనతార) ఆశ్రయం కల్పిస్తుంది. ఆమె యోగిని ప్రేమిస్తూ ఉంటుంది. శాంతమ్మకు తీవ్రమైన అనారోగ్యంగా ఉంటుంది. కొన్ని సంఘటనలలో యాదృచ్ఛికంగా పక్కపక్కనే ఉన్నా తల్లీకొడుకులు కలుసుకోలేక పోతారు. ఆలీ ద్వారా కొడుకును కలుసుకోవాలని గుడికి వచ్చిన శాంతమ్మ అక్కడే మరణిస్తుంది. అలీ ఆమె అంత్యక్రియలకు మనుషులను ఏర్పాటు చేసి ప్రసాదును వెతికుతుంటాడు. కేవలం నలుగురు మనుషులతో సాదాగా వెళుతున్న తల్లి శవయాత్ర ప్రక్కగా వెళతాడుగాని ముసుగు వలన గుర్తుపట్టలేక పోతాడు ప్రసాద్ తల్లి శవాన్ని. అనాథ శవం కాబోలనుకొని శవాన్ని శ్మశానమువరకూ మోస్తూ తీసుకొచ్చి దండలు కొని తెస్తానని వాళ్ళతో చెప్పి వెళతాడు. అక్కడ కోటేసు మనుషులతో గొడవపడటంతో లేటయిపోతుంది. అతనికోసం ఎదురుచూసి శవాని కాల్చేస్తారు మోసుకొచ్చిన వాళ్ళు. అప్పుడు అక్కడికొచ్చిన ఆలీ, నయన తారల ద్వారా చనిపోయినది తన తల్లేనని ప్రసాదుకు తెలుస్తుంది.

పాటలు[మార్చు]

  • డోలు బాజా - శంకర్ మహదేవన్
  • ఓరోరి యోగీ - కార్తిక్ & బెంగళూరు సునీత
  • యే నోము నోచిందో - సురేష్
  • గిల్లి గిచ్చి - రాజేష్ & గంగా
  • నీ ఇల్లు బంగారం గాను - టిప్పు, సునీత
  • గన గన గన - అదనాన్ సామి, సుధ

చిత్ర విశేషాలు[మార్చు]

  • ముఖ్య మంత్రి వైయ్యెస్.రాజశేఖరరెడ్డి బావమరది అయిన కడప మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఈ చిత్రాన్ని సమర్పించారు
  • ప్రేమ్ రచించి, దర్శకత్వం వహించిన శివరాజ్ కుమార్ కన్నడ సినిమా జోగి ఈ చిత్రానికి మూలం

ఈ సినిమా పాటలు సూపర్ హిట్ అయినవి. ఆడియో ప్లాటినం డిస్క్ సాధించింది. కాని హింస అధికంగా ఉండుట సెంటిమెంట్ సన్నివేసాలు సరిగా కుదరక సినిమా హిట్ సాదించలేకపోయింది.