రంగనాయకమ్మ

వికీపీడియా నుండి
రంగనాయకమ్మ

రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.

ఆమె ఆవేశం, ఆమె భావాల్లోని స్పష్టత పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి. అద్భుతమైన భావ వ్యక్తీకరణతో, అంతర్లీనంగా వినిపించే ఆవేశంతో, కడుపుబ్బ నవ్వించే హాస్య చతురతతో ఆమె వ్రాసిన నవల స్వీట్ హోం.


విషయ సూచిక

[మార్చు] జీవితం

రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939 లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెం లో ఉన్నత పాఠశాలలో చదివి 1955 లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయినది.

రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970 లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.

[మార్చు] ఇంటి పేరు

తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరవాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.

[మార్చు] రచయిత్రిగా

వైవిధ్యంగల తెలుగు రచయిత్రులలో రంగనాయకమ్మ అగ్రగణ్యులు. తెలుగు భాష నుంచి మార్క్సిజం దాకా, సినిమా విమర్శల నుంచి నవలల దాకా రచల్లో బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం.

[మార్చు] విమర్శకురాలిగా

ఈమె అనేక విషయాల పై అనేక విమర్శలు చేస్తుంటారు. గాంధి, అంబేద్కర్ లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. వరవరరావు గారు చేతకాని వాళ్ళని కొజ్జా వాళ్ళతో పోలుస్తూ ఒక కవిత వ్రాసినప్పుడు స్త్రీలని, కొజ్జావాళ్ళని కించపరిచే భాష వాడడం ఎందుకు తప్పో వివరిస్తూ రంగనాయకమ్మ గారు వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం చదివి వరవరరావు గారు వెంటనే తప్పుని అంగీకరించారు. అసమానత్వం నుంచి అసమానత్వం లోకే ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి.

[మార్చు] వివాదాలు

ఈమె వ్రాసిన నవల 'జానకి విముక్తి' ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. నీడతో యుద్ధం పుస్తకంలో గోరా, జయగోపాల్, సి.వి., ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యం లో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసిదళం' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. వాటిలో యండమూరి తో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు ను కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.[ఆధారం కోరబడినది]

[మార్చు] "జన సాహితి" సంస్థలో రంగనాయకమ్మ

మరిన్ని వివరాలకోసం జన సాహితితో మా విభేదాలు పుస్తకం గురించిన వ్యాసం చూడండి.

రంగనాయకమ్మ కొంత కాలం "జన సాహితి" అనే సాంస్కృతిక సంస్థలో పనిచేశారు. సైధ్ధాంతిక విభేదాల వల్ల ఆ సంస్థ నుంచి బయటకి వచ్చేశారు. ఆ సంస్థ వారు తమది భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థ అని చెప్పుకున్నారు కానీ వారు వ్యక్తిగతంగా ఆచరించేది మాత్రం భూస్వామ్య సంస్కృతే. ఆ సంస్థ వారు ఒక వైపు భూస్వామ్య సంస్కృతిని విమర్శిస్తూనే మరో వైపు భూస్వామ్య సంస్కృతిలో భాగమైన కట్నం లాంటి ఆచారాలు పాటిస్తుంటారు. వీరు రంగనాయకమ్మకి తెలియకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చెడుగా మాట్లాడేవారు. రంగనాయకమ్మ తన మొదటి భర్తని విడిచిపెట్టి తన కంటే వయసులో పదేళ్ళు చిన్నవాడైన గాంధీతో సంప్రదాయ వివాహం లేకుండా కలిసి ఉండడం గురించి గుసగుసలాడుకునే వారు. రంగనాయకమ్మ భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా వ్రాసిన రామాయణ విషవృక్షం పుస్తకాన్ని కూడా విమర్శించారు. ప్రగతివాద సాహిత్యమైన చలం సాహిత్యాన్ని కూడా విమర్శించేవారు. వీరు చలం సాహిత్యంలోని పాజిటివ్ అంశాలని చూడలేకపోయేవారు.[1]

[మార్చు] నవలలు

[మార్చు] ఇతర రచనలు

[మార్చు] మూలాలు

  1. *'జన సాహితి'తో మా విభేదాలు - రచన: రంగనాయకమ్మ, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్

[మార్చు] బయటి లంకెలు

"http://te.wikipedia.org/w/index.php?title=రంగనాయకమ్మ&oldid=703149" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు